
Greatness of Sri Rama Nama
రామనామ మహిమ: మోక్షానికి మార్గం
శ్రీరామనామం మహత్తరమైనది. ఈ మంత్రం ప్రణవానికి నిలయం, మోక్షదాయకం, ప్రకృతి-పురుష తత్త్వాలను తెలుపుతుంది. బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు వంటి దేవతలు ఈ నామాన్ని జపిస్తారు. రామనామం పాపాలు, రాగద్వేషాలను నశింపజేస్తుంది. ఇది సదా స్మరణ చేయదగినది. యుగయుగాలు గడిచినా రామనామం మధురతను కోల్పోదు. భవసాగరంనుండి విముక్తి కలిగించే ఏకైక మంత్రం ఇది. దీనిని జపించడం చాలా సులభం. “నమో నారాయణాయ” నుండి “రా” అక్షరం, “నమః శివాయ” నుండి “మ” అక్షరం కలిపి “రామ” అని శబ్దం ఏర్పడింది. రామనామం జపించే వారికి భుక్తి, ముక్తి రెండూ లభిస్తాయి. శ్రీరామనామం ఆర్తులకు అభయం ఇస్తుంది, జీవనమును ప్రసాదిస్తుంది, భక్తులను కాపాడుతుంది. శ్రద్ధతో లేదా కాక్‌తాళీయంగా స్మరించినా మానవుని తరింపజేస్తుంది.
పూర్వం అవంతి నగరంలో విద్యాధరుడు అనే బ్రాహ్మణుడు చెడు స్నేహాలతో భ్రష్టుడై, వేదశాస్త్రాలను మానివేశాడు. వేశ్యలతో సహవాసం చేస్తూ, తన ధర్మపత్నిని పట్టించుకోలేదు. అతనికి గత్యంతరం లేక ఇంటికి వచ్చినప్పుడు భార్య అన్నపానాదులు మాని మరణించింది. భార్య మరణం తెలుసుకుని, “ఓ రామా (ఓ ప్రియురాలా), హా రామా (హాప్రియురాలా), క్వ రామా (నాప్రియురాలు ఎక్కడ)” అని రోదిస్తూ కాలం గడిపాడు. ఆతడు అన్యాపదేశంగా రామనామం ఉచ్చరించడం వల్ల పాప రహితుడయ్యాడు. మరణించిన తర్వాత, యమదూతలు అతని జీవమును తీసుకెళ్లేందుకు వచ్చినప్పుడు, ఆ జీవం బ్రహ్మైక్యమైపోయింది. యమధర్మరాజు బ్రహ్మను అడిగితే, బ్రహ్మ “రామనామం విష్ణుసహస్రనామాలుతో సమానం, పవిత్రం” అని చెప్పారు.
రామనామం ‘రా’ అనే అక్షరం నోరు తెరవగానే పాపాలను తొలగిస్తుంది, ‘మ’ అని పలుకుతూ నోరు మూయగానే పాపాలను భస్మమైపోతుంది. ఈ మంత్రం మహత్తరమైనది. ఏడు కోట్ల మంత్రాలలో రామనామం మహామంత్రం. శ్రీరాముడు హనుమంతుడిని “నాకు గొప్పతనం ఉందా నా నామానికి?” అని అడిగితే, హనుమంతుడు “మీ పేరు మహత్తరమైనది” అని చెప్పారు. రామనామం ముల్లోకాలను తరింపజేస్తుంది.
నిర్వికారమైన, నిరాలంబమైన, మలరహితమైన, సర్వేశ్వరుని ప్రకాశింపజేసే శ్రీరామనామాన్ని జపించి జీవితాలను ధన్యముగా చేద్దాం.
Related Posts:
Lord Rama | రాముడు తోబుట్టువుల గొప్పతనాన్ని ఈ విధంగా వివరించాడు.
రాముడికంటే రావణుడు గొప్పవాడ? | Ravana Greater Than Lord Rama in Telugu ?
జన్మనిచ్చిన తల్లి, జన్మభూమి గురించి రాముడు ఏం చెప్పాడు? | Lord Rama words about Mother & Mother Land