
Simhachalam Annual Chandanotsavam 2023 Date
2చందనోత్సవం (Chandanotsavam)
ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ తదియ నాడు మాత్రమే చందనాన్ని పూర్తిగా తొలగించి, కేవలం 12 గంటల సమయం మాత్రమే స్వామివారి నిజస్వరూపాన్ని చూసే అవకాశాన్ని భక్తులకు కలిగిస్తారు. దీనిని చందనోత్సవం లేదా చందనయాత్ర అని పిలుస్తారు. ఇది సింహాచల క్షేత్రానికి సంబంధించిన చాలా ముఖ్యమైన ఆధ్యాత్మిక ఉత్సవం. స్వామి రూపం సింహాచలంలో వరాహ ముఖం, నరుని (తెల్ల) శరీరం, తెల్లని జూలు, భుజంపై తోక, రెండు చేతులు, భూమిలో దాగివున్నపాదాలు.. ఈ నిజరూప స్వామి దర్శనం అక్షయ తృతీయ నాడు మాత్రమే కొన్ని గంటలు సేపు చందనం తొలగించగా దొరుకుతుంది.
ఏప్రిల్ 23న జరుగనున్న సింహాచలం అప్పన్న నిజరూప దర్శనం చందనోత్సవ యాత్రకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి శ్రీ కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, దేవాదాయ శాఖ కమీషనర్, జిల్లా కలెక్టర్, పోలీస్ కమీషనర్, ఎమ్మెల్యేలతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో చందనోత్సవ ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈనెల 23వ తేదీ తెల్లవారుజామున మూడు గంటలకు సింహాచల చందనోత్సవ మొదటి దర్శనం ప్రారంభమవుతుందని తెలిపారు.







