
Story of 18 Holy Steps in Sabarimala Temple
1అయ్యప్ప స్వామి 18 మెట్ల విశిష్టత
అయ్యప్ప స్వామి ఆలయంలో 18 మెట్లు ఉండటానికి అసలు కారణాలు ఏంటి.. ఒక్కో మెట్టుకు ఉన్న ప్రత్యేకతలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
శబరిమల ఆలయంలో అయ్యప్ప స్వామి దేవాలయం ప్రాముఖ్యత ఏంటి అంటే సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే తెరచుకుంటుంది. పంబ నది దగ్గర నుంచీ శబరి గిరులన్నీ అయ్యప్ప స్వామి అయ్యప్ప నామ స్మరణతో మారుమోగుతున్నాయి. అయ్యప్ప స్వామి మాల వేసి ఇరుముడితో వచ్చే వారికి మాత్రమే 18 స్వర్ణ మెట్లు వెళ్లేందుకు అనుమతిస్తారు. సాధారణ భక్తుల 18 స్వర్ణ మెట్లు అనుమతించరు. 18 స్వర్ణ మెట్లను ‘పదునెట్టాంబడి’ అని అంటారు. హిందూ మతం ప్రకారం శబరిమల అయ్యప్ప స్వామి నివాసం ఉండేందుకు 2 శాస్త్రాలు, అష్టదిగ్పాలకులు, 4 వేదాలు 18 మెట్లుగా మారగా అయ్యప్ప స్వామి ఒక్కో మెట్టుపై ఒక్కో అడుగేస్తూ స్థానాన్ని అధిష్టించారు.
అష్టాదశ దేవతల ఎవరంటే? (Who are Ashtadasha Devas?)
సాధారణంగా హిందూ దేవాలయాలన్నీ ప్రతి రోజూ తెల్లవారుజాము నుంచే తెరచుకుంటాయి. అయ్యప్ప స్వామి దేవాలయం మాత్రం సంవత్సరంలో కేవలం కొన్ని రోజులు మాత్రమే తెరచుకుంటుంది. ఈ సమయంలోనే స్వామి వారిని దర్శించుకునే వీలు కలుగుతుంది. అయ్యప్ప స్వామి ఆలయంలో బంగారంతో చేసిన మెట్లు 18 ఉంటాయి. . అందుకు గల అసలా కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం…
శబరిమల అయ్యప్ప ఆలయానికి 18 మెట్లు ఉండడానికి కారణాలు (Reasons Why Sabarimala Ayyappa Temple Has 18 Steps)
అయ్యప్ప స్వామి ఆలయంలో పద్దెనిమిది మెట్లే ఉండటానికి గల కారణాలేంటి? ఒక్కో మెట్టుకు ఉన్న ప్రత్యేకతలేంటో తెలుసా?
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో పద్దెనిమిది మెట్లే ఉన్నాయి. స్వామి వారికి ఈ పద్దెనిమిది బంగారం మెట్లకు ఉన్న ప్రత్యేకత ఏమిటీ? ఆ మెట్ల వెనుక దాగి ఉన్నా అసలా రహస్యాలేంటి? ఒక్కో మెట్టుకు ఉన్న ముఖ్యమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం
18 దేవతా రూపాలు
అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్న 18 స్వర్ణ మెట్లను ‘పదునెట్టాంబడి’ అంటారు. ఈ సోపానాల మీదుగా వెళ్లేందుకు ప్రతి ఒక్కరూ అయ్యప్ప మాలను విధిగా 41 రోజుల పాటు ధరించి, మండల దీక్ష చేపట్టి ఇరుముడిని తలపై పెట్టుకుని రావాలి.
అష్టాదశ దేవతలెవరంటే?
1) మహంకాళి
2) కళింకాళి
3) భైరవ
4) సుబ్రహ్మణ్యం
5) గంధర్వరాజ
6) కార్తవీర్య
7) క్రిష్ణ పింగళ
8) భేతాళ
9) మహిషాసుర మర్దని
10) నాగరాజ
11) రేణుకా పరమేశ్వరి
12) హిడింబ
13) కర్ణ వైశాఖ
14) అన్నపూర్ణేశ్వరి
15) పుళిందిని
16) స్వప్న వారాహి
17) ప్రత్యంగళి
18) నాగ యక్షిణి
18 మెట్ల యుక్కా ప్రాముఖ్యత (18 Golden Steps Importance)
1. తొలి 5 మెట్లను – కళ్లు, చెవులు, నాలుక, ముక్కు, స్పర్శలకు సంకేతాలుగా పరిగణిస్తారు.
2. 6-14 మెట్లను అష్ట రాగాలకు సంకేతంగా భావిస్తారు – అసూయ, లోభం కామం, క్రోధం, మదం, మోహం, మాస్తర్యం, దంబంను సూచిస్తాయని పరిగణిస్తారు.
3. 15 – 18 మూడు మెట్లు సత్వం, రాజసం తామసంను సూచిస్తాయి.
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j
Hindu Temples Guides Related Posts
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం పూజ సమయాలు | Sabarimala Ayyappa Temple Puja Timing
అయ్యప్ప జననం & విగ్రహ రహస్యం | Birth History of Lord Ayyappa
శబరిమల ఆలయం చరిత్ర & విశిష్టత | Sabarimala Temple History & Significance
ప్రపంచంలోనే ఒకే ఒక్క యముడి ఆలయం!? Dharmapuri Yama Dharmaraja Temple
వాడపల్లి వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు | Vadapalli Sri Venkateswara Swamy Brahmotsavam Dates 2023
వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం | Vadapalli Sri Venkateswara Swamy Temple History