
విజేతలు చెబుతున్న విజయ రహస్యాలు..! | Secrets Tips of Winners in Telugu
జీవితం లో విజయం సాధించాలని కోరుకొని వారెవరు? కానీ ప్రతిసారీ ఓటమి పాలవుతూ కొత్త మార్గాలు వెతుక్కుంటాం. నిజానికి గెలుపు మన చేతుల్లోనే ఉంది. మనిషి తలుచుకుంటే ఏదీ ఎప్పటికీ అసాధ్యం కాదు. ‘ఒక చేపను కొండలెక్కమంటే ఎంత ప్రయత్నించినా చేయలేదు కదా. అలాగే మనకు కూడా హద్దులున్నాయ్’ అనే మాటలు వినకండి. ఎందుకంటే మనిషి చేపలా ఈద గలడు, పక్షిలా ఎగర గలడు, చెట్లను కూడా ఎక్కగలడు. స్వతహాగా సహజ సిద్ధంగా మనిషికి అపరిమితమైన శక్తులున్నాయి. మనకు పరికరాల తోడు ఉంది, పరిజ్ఞానం ఉంది. ఇంకా దేనికోసం ఆగుతున్నాం..? సాధించాలనుకోవడమే విజయానికి హద్దు.
3. 2. వ్యాయామం తప్పనిసరి
‘శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం’ అన్నారు పెద్దలు. ముందు శరీరం ఆరోగ్యంగా ఉంటే ఎన్ని ధర్మ కార్యాలైన చేయవచ్చు అని దాని అర్థం. ఆరోగ్యమైన శరీరం ఆరోగ్యమైన ఆలోచనలను చేయగలదు. ఆరోగ్యం సరిగా ఉంటే ఈ రోజుల్లో లక్షలు దాచినట్టే. ఆరోగ్యానికి సరైన తిండి తో పాటు తగినంత వ్యాయామం తప్పనిసరి. శరీరానికి వ్యాయామం, మనసుకు ధ్యానం మన ఆయుష్షుని పెంచుతాయి.
3. రేపటి విజయం కోసం ఇవాళే పునాది వేయండి
పెద్ద లక్ష్యాలను ఛేదించాలనుకున్నప్పుడు, ఆ మార్గానికి చేర్చే చిన్న చిన్న లక్శ్యాలను ఏర్పరుచుకొని రోజువారీ పని ప్రారంభించాలి. అంటే మీ జీవితం లో అతిపెద్ద లక్ష్యాన్ని చేరుకోడానికి ఎంతో శ్రమించాలనుకున్నప్పుడు ఆరోజు వరకూ ఎదురుచూడకుండా ప్రతిరోజూ ఒక అరగంటైనా దానికోసం కేటాయించాలి.