
2. నమస్కారం అంటే అర్ధం ఏమిటి?
అవతలి వారిపట్ల మన సహృదయతనూ గౌరవాన్నీ చాటుకోవడం కోసం నమస్కారం చేస్తాం. నేను అన్న అహంకారాన్ని విడిచి అవతలవ్యక్తిని గౌరవించే నమ్ర భావమే నమస్కారం.
నమస్కారం చేయడం వెనుక గల అద్భుతమైన విషయాలు..
చేతులు జోడించి నమస్కరించడం హిందూ ధర్మం లో ప్రధానమైనది. ఈ పద్ధతిని తర్వాత ఏర్పడ్డ బౌద్ధ, జైన మొదలైన మతాలు కూడా అనుసరించాయి. నమస్కరించడానికి రెండు అర చేతులనూ దగ్గరికి చేరుస్తాం. అలా చేర్చడం వల్ల వేళ్ళ చివరన, అరచేతిలో ఉండే శక్తి కేంద్రకాలు ఉత్తేజితమౌతాయి. దాని వల్ల ఎదురుగా ఉన్న వ్యక్తి ఎక్కువ కాలం గుర్తుంటారు. ఇది ఒక కారణం.
ఇంకాస్త లోతుగా పరిశీలిస్తే ఇందులో మరో అద్భుతమైన రహస్యం ఉంది. నమస్కారం చేయడం వలన హృదయ భాగం లో ఉండే అనాహత చక్రం తెరుచుకుంటుంది. ఎదుటి మనిషి కూడా మనకు నమస్కరించినపుడు ఒకరికొకరు తమ ఆత్మ శక్తి ద్వారా అనుసంధానించబడతాం. అంటే కేవలం మాటలతో సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడం కాకుండా ఒక అలౌకికమైన, ఆత్మానుసంధానమైన వారధి ని నిర్మించుకోవడానికి నమస్కారం చేస్తాము. అప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులకూ మాటలతో పనిలేకుండా ఒకరి మనసును మరొకరు తెలుసుకునే సంబంధం ఏర్పడుతుంది. ఇదే హిందూ ధర్మం లోని నమస్కారం యొక్క ఆంతర్యం.
నమస్కారం ఒక ఆరోగ్యకరమైన అలవాటు
అంతే కాదు కరచాలనం చేయడం వల్ల ఒకరి చేతి క్రిములు మరొకరికి అంటుకునే ప్రమాదం ఉంది. నమస్కారం చేయడం వల్ల అలాంటి అవకాశాలు లేవు. అందుకే నమస్కారం ఒక ఆరోగ్యకరమైన అలవాటుగా ప్రపంచం లోని అన్ని సంస్కృతులవారూ అంగీకరించారు.
Related Posts
Chaturmasam 2025 | విష్ణువు 4 నెలలు పాటు ఎందుకు యోగనిద్ర తీసుకుంటాడు?
Shani Jayanthi 2025 | శనిజయంతి రోజు ఈ పనులు చేస్తే శుభ ఫలితాలు ఖాయం
Dhantrayodashi in Telugu | లక్ష్మీ దేవి అనుగ్రహం కోసం ధన త్రయోదశి నాడు ఇలా చేయండి.
Krishna janmashtami 2025 | శ్రీ కృష్ణ జన్మాష్టమి విశిష్టత & పూజా విధానం
Rakshabandhan Rules | రాఖీ కట్టేటప్పుడు & తీసివేసేటప్పుడు పాటించవలసిన నియమాలు
List of Telugu Year Names | తెలుగు సంవత్సరాలు ఎన్ని? ఆ పేర్లు ఎలా వచ్చాయి.