Why Married Women Wear Nallapusalu in Telugu
1. పెళ్లైన ఆడవాళ్ళు నల్లపూసలు ఎందుకు ధరిస్తారు?
పెళ్లైన ఆడవాళ్ళు నల్ల పూసలు ధరించడం హిందూ సాంప్రదాయం లో మాత్రమే కాదు ముస్లిం సాంప్రదాయం లోనూ కనిపిస్తుంది. వివాహం అయినందుకు గుర్తుగా తాళిబొట్లు ఉండగా మళ్ళీ నల్లపూసలను ఎందుకు ధరిస్తారు?
నల్లపూసల పేరు యొక్క ప్రాధాన్యత
చాలా ప్రాంతాలలో నల్లపూసలలోనే తాళి బొట్టు వేసుకుని ధరిస్తారు. నల్ల పూసలలోని బంగారు శక్తి స్వరూపిణి అయిన అమ్మవారికి ప్రతీక. నల్లని పూసలు శివునికి ప్రతిరూపం. శివశక్తుల కలయిక అయిన నల్లపూసల పేరు అన్యోన్యమైన దాంపత్యాన్ని నిత్యం స్త్రీలకి స్ఫురణకు తెస్తుంది. నల్లపూసలలో ఉండే ఎర్రని పగడపు పూసలు చైతన్యానికి ప్రతీకలు.
వివాహమైన స్త్రీలు నల్లపూసలు తప్పనిసరిగా ఎందుకు ధరించాలి?
నల్లపూసలు స్త్రీలలో వివాహ సంబంధమైన వాంఛలను ప్రేరేపిస్తాయి. వివాహిత తన బాధ్యతలని నెరవేర్చడానికి శక్తినిస్తాయి. నలుపు రంగు దృష్టి దోషాలను పోగొడుతుంది. అందుకని నలుపురంగు పూసలను వాడతారు. నల్లపూసలు వివాహితకు ఎటువంటి దిష్టీ తగలకుండా కాపాడతాయి. ఎర్రని పగడపు పూసలు చైతన్యాన్ని కలిగిస్తాయి. అందుకే వివాహితలు తప్పని సరిగా నల్లపూసలను ధరించాలి. వారి శరీర ఆరోగ్యానికీ, అనుకూల దాంపత్యానికీ అవి ఎంతగానో సహకరిస్తాయి.
Related Posts
వాస్తు ప్రకారం ఇంట్లో దేవతా విగ్రహాలు/పటాలు ఏ దిక్కున ఉండాలి? | Direction of God Idols/images
Lord Shiva | శివుడి దగ్గర ఉన్న నంది, త్రిశూలం, పాము, రుద్రాక్ష, డమరుకం వెనుక పరమార్థం ఏమిటి?
Kashi Yatra | కాశి వెళ్లే వారు తొమ్మిది రోజులుండి ఆ రోజుల్లో ఏం చేయాలి & ఏమి చూడాలి?
ప్రతి స్త్రీ తమ జీవితంలో తప్పకుండా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు | Woman Should Know These Things
Dharma Sandehalu | మీ జీవితంలో తెలుసుకోవాల్సిన నిత్య సత్యాలు & ధర్మ సందేహాలు
Bilvapatram | శివుడికి బిల్వపత్రం సమర్పించేటప్పుడు ఈ తప్పులు చేయకండి.
Hindu population | భారతదేశంలో రాష్ట్రాల వారీగా మరియు దేశాల వారీగా హిందూ జనాభా తాజా గణాంకాలు.