
విపరీతమైన ఎండల తర్వాత వచ్చే వర్షాకాలం శరీరానికీ మనసుకీ ఎంతో సాంత్వనను ఇస్తుంది. తొలకరి జల్లు చిందించే మట్టివాసన అనిర్వచనీయమైన ఆనందాన్ని కలుగజేస్తుంది.
వర్షాకాలం యొక్క ఆనందాన్ని పూర్తిగా పొందాలంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా ఎంతో అవసరం.
2. వర్షాకాలం పాటించవలసిన జాగ్రత్తలు
- ఇంటిని వీలైనంత పొడిగా ఉంచండి.
- తడి బట్టలను ఇంట్లో ఉంచడం వల్ల బాక్టీరియా చేరుతుంది. దోమలు, ఇతర కీటకాలు ఆకర్షింప బడతాయి. కనుక తడి బట్టలను ఎప్పటికప్పుడు ఆరేయాలి.
- వంటగదినీ, మిగతా ఇంటినీ ఆంటీ బాక్టీరియల్ ద్రవాలను ఉపయోగించి శుభ్రం చేయండి. లేదా శుభ్రం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసినా మంచిది.
- వర్షం లో తడిసి వచ్చినప్పుడు శుభ్రంగా స్నానం చేయడం తప్పనిసరి. ఎందుకంటే వర్షపు నీటితోపాటు నీలపైనుంచీ మీ మీదకు చిందిన మురికి నీరు,కాలుష్య ప్రభావం చర్మం లోకి ఇంకిపోయి వ్యాధులను కలుగజేస్తుంది.
- వర్షాకాలం చాలామంది నీరు తాగటాన్ని తగ్గిస్తారు. ఇది చాలా ప్రమాదం. వర్షాకాలం లో శరీరానికి తగినంత నీరు అందించాలి. నీటిని కాచి చల్లార్చి తాగడం లేదా శుద్ది చేసిన నీటిని తాగటం ఎంతో ముఖ్యం.
- సి విటమిన్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వలన జలుబు,దగ్గు వంటి వ్యాధులనుంచీ రక్షణ కలుగుతుంది.
- ఉలవలు, నువ్వులతో చేసిన పదార్థాలు శరీరం లో తగిన వేడిమిని ఉండేలా సహకరిస్తాయి. అంతేకాకుండా వర్షాకాలం లో సాధారణంగా కలిగే మజ్జు లేదా స్తబ్దత తగ్గి చురుగ్గా ఉంటారు.
Promoted Content








Super your Hari om
Super your website