Patanjali Maharishi Birth Secret in Telugu/ పతంజలి మహర్షి జన్మ రహస్యం
1. యోగ భూమి
యోగేన చిత్తస్య పదేన వాచామలం శరీరస్య చ వైదికేన
యోపాకరోత్తమ్ మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి ||
భావం: యోగము చేత శరీరం లోని మలినాలనూ , వ్యాకరణము చేత వాక్కులోని దోషాలనూ, ఔషధాల చేత శరీరం లోని రోగాలనూ నశింపజేసిన పతంజలి మహర్షికి శిరసా నమస్కరిస్తున్నాను.
భగవంతుడు ప్రసాదించిన అత్యద్భుతమైన ఈ శరీరం ఉండగా, ఆరోగ్యం కోసం మానవులు సృష్టించుకున్న రసాయనాలతో పనిలేదని నిరూపించిన అద్భుత శాస్త్రం యోగం. పరమాత్ముడే స్వయంగా కొలువైన ఈ శరీరమే అన్ని సమస్యలకూ పరిష్కారాన్ని సాధించగలదని చాటింది యోగ శాస్త్రం. ఆ పరమాత్మ స్వరూపాన్ని, మరెన్నో సృష్టి రహస్యాలనీ నిలుచున్న చోటే దర్శించగల మహా విజ్ఞానం యోగం. ఆయుప్రమాణాన్ని పెంచగల అమృత తుల్యమైన కానుక యోగం. ఈ నాడు ప్రపంచమంతా ఆరోగ్యం కోసం అనేకరకాలైన యోగ విధానాలను అనుసరిస్తున్నాయి. యోగ భూమి అయిన భారత దేశాన్ని వేనోళ్ల కొనియాడుతున్నాయి. అటువంటి యోగ శాస్త్రాన్ని అధ్యయనం చేసి మానవాళికి అందించిన మహనీయుడు పతంజలి మహర్షి. కారణ జన్ముడైన ఆయన జన్మ రహస్యాన్ని తెలుసుకుందాం.