సద్భక్తి యొక్క శక్తి | Power of Devotion

0
3118
hindu-sunset_2011431i
సద్భక్తి యొక్క శక్తి | Power of Devotion

సద్భక్తి అంటే? | సద్భక్తి యొక్క శక్తి | Power of Devotion

సత్ అంటే మంచిది అని అర్థం. సద్భక్తి అంటే మంచి భక్తి. అదేంటి? మంచి భక్తీ చెడుభక్తీ ఉంటాయా? భక్తి అనేక విధాలుగా వ్యక్త పరచబడ్డట్లే అనేక రకాలుగానూ ఉంటుంది. మన ఉద్దేశ్యం, నిబద్ధత ని బట్టి ఆ భక్తి ఫలిస్తుంది. స్వార్థం కోసం దేవునికి పెట్టే నమస్కారానికీ, భగవంతుని తత్వాన్ని గ్రహించి, మనస్ఫూర్తిగా అహాన్ని ఆయన పాదాలవద్ద విడిచి ఆత్మ సమర్పణ చేసుకోవడానికీ ఎంత తేడా ఉంది? అదే సద్భక్తికీ స్వార్థ పూరితమైన తాత్కాలిక భక్తికీ తేడా. భగవంతుని నిష్కల్మషంగా, నిస్సందేహంగా నమ్మిన ఒక సాధారణ పశువుల కాపరి యొక్క అసాధారణమైన కథ తెలుసుకుందాం.

Next

2. యోగి పశువుల కాపరికి భగవంతుని ఉనికిని గురించి చెప్పాడా?

పదే పదే భగవంతుని గూర్చి అడుగుతున్న పశువుల కాపరి వైపు ఆ యోగి హేళనగా చూసి. నువ్వు కాసుకునే ఆ బర్రెలో దేవుడు ఉన్నాడు అని చెప్పాడు. పశువుల కాపరి ఆ బర్రెను నిజంగానే దేవుడని నమ్మాడు. అన్ని పశువులకూ పెట్టే గడ్డి కాకుండా ఈ బర్రెకు ఎక్కువ పచ్చగా, తాజాగా ఉన్న గడ్డిని పెట్టేవాడు. అన్ని బర్రెలకన్నా దీనికి ఎక్కువ తౌడునీ, ఇతర పోషకాహారాన్నీ అందించేవాడు. దాని దగ్గరే నిద్రించేవాడు. భక్తిగా పూజించేవాడు. కొద్దిరోజులలో ఆ బర్రె మునుపటికన్నా ఆరోగ్యంగా అందంగా తయారయింది. ఒక రోజు రాత్రి ఒక అద్భుతం జరిగింది. అది ఆ పశువుల కాపరి జీవితాన్నే మార్చేసింది.

అర్ధరాత్రి జరిగిన ఆ అద్భుతం ఏమిటి ?

ఒకనాడు అర్ధరాత్రి పశువుల కాపరి నిద్రిస్తుండగా “కుమారా..!” అన్న పిలుపు వినబడింది. అతను ఆశ్చర్య పోయాడు. తాను పూజించే ఆ బర్రె నుంచే ఆ శబ్దం వస్తోందని తిరిగి చూశాడు. మళ్ళీ అదే కంఠం “కుమారా..!” అని అతను తదేకంగా గమనించగా ఆ శబ్దం అతని లోనుండే వస్తోందని గ్రహించి పులకరించిపోయాడు. అతని లోపల ఉన్న పరమాత్మ అతనితో మాట్లాడాడు.  పశువుల కాపరి ఎన్నో సందేహాలకు సమాధానాలను తెలుసుకున్నాడు. ఆత్మ స్వరూపాన్ని గ్రహించాడు. తనకు కలిగిన ఈ అద్భుతమైన అనుభవాన్ని వివరించడానికి యోగి దగ్గరకు బయల్దేరాడు.

యోగికీ పశువుల కాపరికీ మధ్య ఏమి జరిగింది?

అల్లంత దూరం నుండీ పశువుల కాపరి రాకను అమితాశ్చర్యం తో యోగి గమనించసాగాడు. ఎందుకంటే అతను దివ్యమైన జ్ఞాన ప్రభతో తేజోమయమూర్తిగా, నడిచి వస్తున్న సూర్యునిలా ఆ యోగికి కనిపించాడు. ఆ యోగిని సమీపించగానే పశువుల కాపరి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి ‘స్వామీ మీరు చెప్పినట్టే నేను నా బర్రెను పూజించాను భగవంతుని కనుగొన్నాను’ అన్నాడు. పశువుల కాపరి మాటలకు తాను అహంకారం తో అతనిని హేళన చేయడం గుర్తుకు తెచ్చుకుని,  కొంత సిగ్గుతో తలవంచుకొని, ‘నేను హాస్యానికి నీతో అలా అన్నాను. కానీ అది నిజం కాదు.నన్ను క్షమించు. ఈ నీ జ్ఞాన ప్రభకు గల కారాణాన్ని దయచేసి తెలుప’మని కోరాడు. అప్పుడా పశువుల కాపరి ‘ స్వామీ మీరు చెప్పినాదాన్ని నేను పూర్తిగా నమ్మాను. ఆ బర్రెలో భగవంతుడు ఉన్నాడని నమ్మి, త్రికరణ శుద్ధిగా పూజించాను. ఆ కారణంగానే నాకు ఈ ఆత్మ సాక్షాత్కారం లభించింది. దీనికి నేను మీకు సర్వదా కృతజ్ఞుడనై ఉంటాను.’ అని నమస్కరించాడు. అంతేకాక ఆ యోగి కి కలిగిన అనేక సందేహాలను నివృత్తి చేశాడు.

పశువుల కాపరి కథ చెబుతున్న పరమ సత్యం ఏమిటి?

ప్రతిప్రాణిలోనూ ఆత్మ ఉంటుంది. అది జీవాత్మ. దానినే ప్రత్యగాత్మ అంటారు. నిష్కల్మషమైన భక్తి అనే వెలుగులో ఆత్మ స్వరూపం తెలుస్తుంది. ఆ ఆత్మ జ్ఞానమే ఉత్కృష్టమైన పరమాత్ముని మనకు దర్శింపజేస్తుంది.  ఆ స్థితిలో మానవుడు పాంచభౌతికమైన ఈ శరీరానికీ, చర్మ చక్షువులకీ అందని ఎన్నో విషయాలను తానుగా తెలుసుకుంటాడు. ఇందుకు యోగులు, సన్యాసులు తాపసులే కావలసిన అవసరం లేదు. త్రికరణ శుద్ధిగా భగవంతుని నమ్మే పశువుల కాపరికి కూడా పరమాత్మ సాక్షాత్కారం సాధ్యమే అని చెప్పడమే ఈ కథ లక్ష్యం.

Devotional Related Posts:

How people express Devotion?

నిష్కల్మషమైన గురుభక్తికి నిదర్శనం తోటకాచార్యుడు..! | Embodiment of Flawless Devotion Totakacharya in Telugu

నవవిధ భక్తి మార్గములు తెలుసా? Nine Ways Of Devotions in Telugu

భక్తి మార్గాలు ఎన్ని ? అవి ఏవి ? | Different Paths Of Devotion in Telugu

Do you know Why Devotees Worship Lord Hanuman’s Tail

Promoted Content
Next

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here