వివాహం కానీ స్త్రీలు దర్శించవలసిన క్షేత్రం

0
20355

pilgrimage-for-unmarried-woman

ముదిచూర్ ఆలయం……..!!

చెన్నైలోని తామ్రాకు దగ్గరలో ఈ హరిహర క్షేత్రం ఉంది. శ్రీ విద్యాంబికా సమేత భీమేశ్వర స్వామి ఇక్కడ కొలువయ్యాడు. దాదాపు 1300 ఏళ్ళ కిందట కామేశ్వరన్ అనే శివభక్తుడు ఇక్కడి స్వయంభూ లింగాన్ని పూజించినట్లు ఆలయచరిత్ర మనకు తెలియజేస్తోంది.
కామేశ్వరన్ అనే శివభక్తుడు అదే గ్రామానికి చెందిన విశ్వం అనే అతడి కూతురు వాసుకిని ప్రేమించాడు. వారి పెళ్ళికి విశ్వం అంగీకరించలేదు. వివాహం కోసం కామేశ్వరన్ పరమేశ్వరుణ్ని శరణు వేడాడు. అంతట పరమేశ్వరుడు విశ్వం కలలో కనిపించి… వారిద్దరి వివాహం జరిపించమని ఆజ్ఞాపించాడు. అలా విశ్వం వారిద్దరికీ వివాహం చేశాడు.
వివాహం కాని వారు ఇక్కడ ఉండే చెట్టుకి పసుపు రంగు తాడు కట్టి, స్వామికి మొక్కుకుంటారు. ప్రతి తాడుకు ఓ నంబర్ ఇస్తారు. మొక్కున్న వారు వివాహం అయిన వెంటనే… మళ్లీ ఆలయానికి వెళ్ళి, ఆ తాడును విప్పి, మళ్లీ పూజ చేసి రావాలి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here