పతంజలి మహర్షి జన్మ రహస్యం | Patanjali Maharishi Birth Secret in Telugu

0
14728
Patanjali maharshi janma rahasyam
Patanjali Maharishi

Patanjali Maharishi Birth Secret in Telugu 

1. పతంజలి మహర్షి జన్మ రహస్యం

యోగ భూమి

యోగేన చిత్తస్య పదేన వాచామలం శరీరస్య చ వైదికేన 

యోపాకరోత్తమ్ మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి ||

భావం: యోగము చేత శరీరం లోని మలినాలనూ , వ్యాకరణము చేత వాక్కులోని దోషాలనూ, ఔషధాల చేత శరీరం లోని రోగాలనూ నశింపజేసిన పతంజలి మహర్షికి శిరసా నమస్కరిస్తున్నాను.

భగవంతుడు ప్రసాదించిన అత్యద్భుతమైన ఈ శరీరం ఉండగా, ఆరోగ్యం కోసం మానవులు సృష్టించుకున్న రసాయనాలతో పనిలేదని నిరూపించిన అద్భుత శాస్త్రం యోగం. పరమాత్ముడే స్వయంగా కొలువైన ఈ శరీరమే అన్ని సమస్యలకూ పరిష్కారాన్ని సాధించగలదని చాటింది యోగ శాస్త్రం. ఆ పరమాత్మ స్వరూపాన్ని, మరెన్నో సృష్టి రహస్యాలనీ నిలుచున్న చోటే దర్శించగల మహా విజ్ఞానం యోగం. ఆయుప్రమాణాన్ని పెంచగల అమృత తుల్యమైన కానుక యోగం. ఈ నాడు ప్రపంచమంతా ఆరోగ్యం కోసం అనేకరకాలైన యోగ విధానాలను అనుసరిస్తున్నాయి. యోగ భూమి అయిన భారత దేశాన్ని వేనోళ్ల కొనియాడుతున్నాయి. అటువంటి యోగ శాస్త్రాన్ని అధ్యయనం చేసి మానవాళికి అందించిన మహనీయుడు పతంజలి మహర్షి. కారణ జన్ముడైన ఆయన జన్మ రహస్యాన్ని తెలుసుకుందాం.

పతంజలి మహర్షి కాలం

భారతీయ పండితుల అభిప్రాయం ప్రకారం పతంజలి మహర్షి శ్రీ కృష్ణుని కాలానికి చెందినవాడు. మరికొందరి అభిప్రాయం ప్రకారం ఈయన క్రీ.పూ 200 శతాబ్దానికి చెందినవాడు. ఈయన జీవించి ఉన్న కాలం విషయం లో అనేక అభిప్రాయాలు ఉన్నాయి. ఈయన శ్రీ మహావిష్ణుడు శయనించే ఆదిశేషుని అవతారమనీ గొనార్ద అనే ఒక యోగినికి వరప్రసాదంగా భూమిపై అవతరించాడనీ చెబుతారు. ఆయన క్రీ.పూ. 2వ శతాబ్దికి చెందినవాడని గ్రీకు గ్రంథాలు చెబుతున్నాయి. ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో నివసించాడని కొన్ని ఆధారాలు లభించాయి.

పతంజలి మహర్షికి ఆ పేరు ఎలా వచ్చింది?

పతంజలి అంటే అంజలి ఘటిస్తున్న చేతులలో పడినవాడని ఒక అర్థం. గొనార్ధ తన తపస్సును ముగించుకుని సూర్యునికి అర్ఘ్యాన్ని ఇవ్వడానికి అంజలిఘటించగా ఆమె చేతులలో ఒక చిన్న పాము పిల్ల పడిందనీ.. చూస్తుండగానీ ఆ పాము బాలుని రూపం ధరించి తాను ఆది శేషుడిననీ, తనను పుత్రునిగా గ్రహించమనీ వేడినట్లు ఐతిహ్యం.

పతంజలి అంటే అనేకానేకమంది ప్రజల అంజలులు(నమస్కారాలు) పొందినవాడు. సింధి భాషలో పతంజలి అంటే ‘పత’ అంటే ఒడ్డు అని ‘జలి’ అంటే జలము అని. అంటే ఆయన పేరు ‘సింధూ లోయ నాగరికత’ను తెలుపుతుంది.

పతంజలి మహర్షి రచించిన అపురూప గ్రంధాలు

పతంజలి మహర్షి కాలం పై భిన్నాభిప్రాయాలు ఉన్నా ఆయన రచించిన యోగసూత్రాలు, పాణినీయ వ్యాకరాణానికి రచించిన మహాభాష్యమనే వ్యాఖ్య మానవాళికి అపురూప కానుకలు.

Related Posts

దేవుళ్ళకు ఇలాంటివి నైవేద్యంగా పెడితే దేనికి కూడా లోటు ఉండదు!? | Gods & Prasadam

మహాభారతం, రామాయణాల్లో వాడిన శక్తివంతమైన ఆయుధాల గురుంచి ఆశ్చర్యకరమైన విషయాలు!? | Hindu Gods Powerful Weapons

పన్నెండు మంది సూర్యుల గురించి విన్నారా..? | Have You Ever Heard of Twelve Sun Gods in Telugu

వివాహానికి వచ్చి ఆశీర్వదించే దేవతలు ఎవరో మీకు తెలుసా ? | Gods Blessing for Marriage in Telugu

ఏ దేవుడుకు యే దీపం పెట్టాలి ? | Types of Lamps to be use for Different Gods in Telugu?

Telangana Bonalu 2025 | బోనాలు ఆషాఢ మాసంలోనే ఎందుకు చేస్తారు? దీని వెనక ఉన్న కథ ఏమిటి?

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here