చంద్ర గ్రహణం – వివరాలు
చంద్ర గ్రహణం గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా !
అయితే క్రింది సమాచారము మీ కొరకు పొందుపరచబడుతున్నది.
7. గ్రహణ దోష నివారణ కొరకు ఎవరు ఏ దానాలు , ఏ పూజలు చేయాలి ?
గ్రహణ మిశ్రమ ఫలం ఉన్న రాశుల వారు చేయవలసిన దానాలు :
గ్రహణ మిశ్రమ ఫలం కలవారు అనగా వృషభ రాశి , కర్కాటక రాశి , కన్యా రాశి మరియు ధనుస్సు రాశి వారు ఒక నూతన ఇత్తడి పాత్రలో నిండుగా ఆవు నెయ్యి వేసి అందులో వెండి చంద్రుని ప్రతిమ మరియు వెండి నాగ ప్రతిమ ఉంచి దానం ఇవ్వాలి.
గ్రహణ అశుభ ఫలం కలిగిన రాశుల వారు చేయవలసిన దానాలు :
ఒక నూతన ఇత్తడి పాత్రలో నిండుగా ఆవు నెయ్యి పోసి అందులో బంగారం చూరు , వెండి చంద్ర ప్రతిమ , వెండి నాగ విగ్రహము , ఒక మంచి ముత్యం వేసి దానమివ్వాలి.
తప్పకుండా గ్రహణ హోమము చేయించాలి.తెల్లటి వస్త్రము మరియు బియ్యం కూడా దానమివ్వాలి.
గ్రహణ మోక్ష కాలము పూర్తయిన తర్వాత స్నానమాచరించి, సద్భ్రాహ్మణుడికి దక్షిణ తాంబూల సమేతంగా , సంకల్పయుక్తంగా పై సూచించిన దానాలు ఇవ్వాలి.
అపాత్ర దానం శూన్య ఫలాన్నిస్తుందని గరుణ పురాణంలో పేర్కొనబడినది.కావున ఎవరికిపడితే వారికి కాకుండా మీ మీ ప్రాంతాలలో ఉన్న సదాచార సంపన్నులు , నిష్ఠా గరిష్ఠులు , నిత్య జప-తప-హోమ యాగ క్రతువులు చేయువారు , నిత్య దేవతార్చన చేయువారు , వేదాధ్యయనము చేసిన వేద మూర్తులైన బ్రాహ్మణ పండితులకు దానమీయవలెను.అప్పుడే దాన ఫలితము లభించును.
క్రింది చంద్ర గాయత్రిని గ్రహణ సమయములో జపము చేసుకోవచ్చు
ఓం క్షీర పుత్రాయ విద్మహే , అమృత తత్వాయ ధీమహి
తన్నో చంద్ర ప్రచోదయాత్ .
సద్భక్తులకు ముఖ్య గమనిక :-
గ్రహణ సమయంలో, సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి నడయాడిన పవిత్ర క్షేత్రము, శ్రీ క్షేత్రం కురుగడ్డలో, పవిత్ర కృష్ణా నది తీరమున శక్తి పీఠం ఆధ్వర్యములో వేద పండితుల సమక్షములో ప్రత్యేక గ్రహణ పూజలు, గ్రహణ హోమము నిర్వహించబడును.ఆసక్తి కలిగినవారు ముందుగానే ఫోను ద్వారా సంప్రదించగలరు.
గ్రహణ సమయంలో నదీ స్నానం చేసి, నదీ తీరములో అనుష్ఠానము చేసుకోవడం సంపూర్ణ ఫలప్రదము,పుణ్య ప్రదము.