
Prahlada Significance in Telugu / ప్రహ్లాదుని సౌశీల్యము
శీలము సత్ప్రవర్తనల యొక్క ప్రాముఖ్యతను తెలిపే పురాణగాథ తెలుసుకుందాం. ఈ కథ మహాభారతం లో ధృతరాష్ట్రుడు పాండవులపట్ల ఈర్ష్యాసూయాలతో ఉన్న సుయోధనునికి వివరించాడు.
4. ప్రహ్లాదుని శీలత్యాగం
ప్రహ్లాదుడు తన శీల సంపద ఫలాన్ని వజ్రికి ధారపోశాడు. అప్పుడు ప్రహ్లాదుని శరీరం లోనుంచీ ఒక కాంతిపుంజం బయటకువచ్చి రాజా సెలవు అంది. ప్రహ్లాదుడు చూసి దివ్యపురుషా..! ఎవరు నీవు? అన్నాడు. అప్పుడా ఆకృతి రాజా నేను నీ శీలాన్ని నీ ఆజ్ఞప్రకారమే ఈ విప్రుని వద్దకు వెళుతున్నాను అన్నది. ఆ శీలానికి వెంటనే మరొక కాంతిపుంజం ప్రహ్లాదుని శరీరం నుండీ వెడలసాగింది.అది చూసిన ప్రహ్లాదుడు నీవెవరు నన్ను వదిలి ఎందుకు వెళుతున్నావు అన్నాడు. అప్పుడా దివ్యాకృతి నేను సత్యాన్ని. శీలాన్ని అంటిపెట్టుకుని ఉంటాను. శీలం లేని చోట నాకు స్థానం లేదు. అని వెడలిపోయింది. ఇలా ఒక దానివెంట ఒకటి ఋజుప్రవర్తన, పరాక్రమం, బలం అతన్ని వీడిపోయాయి. చివరిగా ఆదిలక్ష్మి అతనిని విడిచి వెళ్ల సాగింది. విద్యుత్ ప్రభలతో వెలుగుతున్న ఆమెను ఆపి ప్రహ్లాదుడు. అమ్మా నీవెవరు నన్ను విడిచి ఎందుకు వెళుతున్నావు అని అడుగగా. ‘కుమారా..! నేను ఆదిలక్ష్మిని శీలం లేను చోట నేను ఎన్నటికీ నిలువజాలను. ‘ అంది. అమ్మా ఈ విప్రుడు ఎవరు అని అడుగగా ఆదిలక్ష్మి ఇంద్రపదవిని కోల్పోయిన శచీపతే విప్రవేషం లో వచ్చినాడని ప్రహ్లాదునికి తెలియజేసింది.