మహా భారతం లో కచ దేవయానుల కథ చాలా ప్రసిద్ధమైనది. అందులో భాగంగా దేవగురువు బృహస్పతి కుమారుడైన కచునికీ, దైత్య గురువు శుక్రాచార్యునికీ మధ్య జరిగిన కథ మనకు ఎన్నో గొప్ప విషయాలను చెబుతుంది. ఆ కథను తెలుసుకుందాం.
10. శుక్రాచార్యుడు-కచుల కథ చెప్పే నీతి ఏమిటి?
లోకహితం కోసం కుటుంబాన్ని సైతం పణంగా పెట్టగల త్యాగం బృహస్పతి వద్ద కనబడుతుంది. తండ్రి మాటను అనుసరించి, ఒక మంచి పనికోసం ప్రాణాన్ని అడ్డుపెట్టగల సాహసం, తానెవరో దాచని నిజాయితీ, బ్రహ్మచర్యం, విద్యాపట్ల గురువు పట్ల అమితమైన గౌరవం కచుని చూసి నేర్చుకోవలసిన విషయాలు.
శత్రువు వర్గం వారైనా సరే విద్యార్హత ఉండి విద్యను అర్థిస్తే కాదనని ఔన్నత్యం శుక్రాచార్యుని సొంతం. అంతేకాదు తన ప్రాణాలు అడ్డువేసి శిష్యుని కాపాడుకొన్న ఆ వాత్సల్యం అద్భుతమైనది. వ్యక్తి సంస్కారాన్ని ఈ కథ నేర్పుతుంది.
Promoted Content