ఈ ఆలయానికి పురాతన కథ సైతం లేక పోలేదు. ఒక రాక్షస ప్రభువు అనేక మంది శిల్పులను పిలిపించి ఒకే రోజులో ఆలయం నిర్మించాలని ఆదేశించాడట. ఆలయం నిర్మాణం జరుగుతుండగానే తెల్లవారి పోవడంతో ఆవరణలో ఉన్న మరో రెండు దేవాలయాలు అసంపూర్తిగా వదిలేసి వెళ్లినట్లు కథనం ప్రాచుర్యంలో ఉంది.