
సావాస దోషం
మన స్నేహితులను చూసి మన వ్యక్తిత్వం ఏమిటో చెప్పవచ్చు అంటారు పెద్దలు. నిజమే. మనం ఎవరితో ఎక్కువ గా సమయాన్ని గడుపుతామో వారి అలవాట్లు ఆలోచనలు మనల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. మంచైనా చెడైనా మనమీద ఆ ముద్ర పడటం సహజం. మనుషులే కాదు వస్తువులు కూడా మనపై ప్రభావితం ఎంతగా చూపగలవో చెప్పే కథ తెలుసుకుందాం.
3. కత్తి ప్రభావం
ఆ బాటసారి మళ్ళీ తిరిగి రాలేదు. ఈన్నో రోజుల తర్వాత ఆ తపస్వి బాటసారి ఇచ్చిన కత్తిని మొదటిసారిగా చేతిలోకి తీసుకున్నాడు. సాధారణ జీవితానికి దూరంగా తపమాచారిస్తున్న అతనికి ఆ కత్తిని తాకాగానే అతనిలోని పూర్వపు ఆలోచనలు మొదలు కావడం ప్రారంభించాయి. కంద మూలాలను కోసుకోడానికి ఆ కత్తిని ఉపయోగించాడు. తరువాత తనకు హాని చేయకుండా పక్కనుంచీ వెళుతున్న సర్పాన్ని ప్రాణభయంతో ఆ కత్తిని ఉపయోగించి చంపేశాడు. ఇలా మెల్లిగా అతను తపస్సును విడిచి క్రూరునిగా మారాడు. దేవేంద్ర పదవిని అధిష్టించాలన్న అతని కోరిక మూలనపడింది. అనర్హునికి దేవేంద్ర పదవి దక్కనందుకు దేవేంద్రుడు సంతోషించాడు.