
సావాస దోషం
మన స్నేహితులను చూసి మన వ్యక్తిత్వం ఏమిటో చెప్పవచ్చు అంటారు పెద్దలు. నిజమే. మనం ఎవరితో ఎక్కువ గా సమయాన్ని గడుపుతామో వారి అలవాట్లు ఆలోచనలు మనల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. మంచైనా చెడైనా మనమీద ఆ ముద్ర పడటం సహజం. మనుషులే కాదు వస్తువులు కూడా మనపై ప్రభావితం ఎంతగా చూపగలవో చెప్పే కథ తెలుసుకుందాం.
2. ఇంద్రుని పరీక్ష
అతనిని పరీక్షించదలచిన ఇంద్రుడు ఒక బాటసారి వేషం లో, తపస్విగా మారిన ఆ బ్రహ్మచారి వద్దకు వెళ్ళాడు. ‘ స్వామీ నేను పక్కనే ఉన్న ఆలయాన్ని దర్శించుకొని వస్తాను. ఆలయానికి ఆయుధాలను తీసుకు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. దయచేసి నా వద్ద ఉన్న ఈ కత్తిని మీ సంరక్షణలో ఉంచండి. తిరిగి తీసుకుంటాను. ఈ అడవి మార్గం లో ఆదేనాకు ఆత్మ రక్షణ.’ అన్నాడు. ఆ బ్రహ్మచారి అతను చెప్పినదానికి సమ్మతించాడు.
Promoted Content