
Mantra Japam for Curing back Pain
1. వెన్ను నొప్పిని తగ్గించే అద్భుతప్రయోగం
వెన్నునొప్పిని తగ్గించే మందుతో పాటు మంత్రజపం ఏమైనా ఉందా ? – మానవుని లో వెన్నుపూస ప్రధానమైన అవయవం . వెన్నుపూస అడుగుభాగంలో చుట్టచుట్టుకుని ఉన్న కుండలినీ శక్తి యోగసాధనలో మేల్కున్నప్పుడు వెన్నుపాము ద్వారా ప్రయాణించి సహస్రారాన్ని చేరటమే సిధ్ధియని చెబుతారు. అయితే సాధకులు కానివారిలో కొంతమందిలో వెన్ను నొప్పి వస్తుంది. దీనివలన నరకయాతన అనుభవిస్తుంటారు. ప్రయాణాలలో నైతే వారి బాధ వర్ణనాతీతం .
పరమేశ్వరుని అనుగ్రహంతో ఈ వెన్ను నొప్పిని నివారించుకునే ఓ అద్భుతవైద్యం ఉంది. ఆచరించి చూడండి .ఆయన అనుగ్రహాన్ని పొందండి. వెన్ను నొప్పిలేనివారైనా ఈ క్రియద్వారా మేలు పొందుతారు.
ఎలాచేయాలి ?
తులసిరసం, తేనె,నువ్వులనూనె, పచ్చకర్పూరం,సమంగా మిశ్రమం చేసి దానిని ఓ ప్రమిదలో ఉంచి జ్యోతి వెలిగించి పరమేశ్వరుని సన్నిధిలో ఉంచాలి . ఆపై ఆదీపం పైభాగాన మీ హస్తమును ఉంచి ఈక్రింది మంత్రాన్ని వెయ్యిన్నెనిమిది సార్లు జపించాలి . చేయి ఎక్కువసేపు చాచి ఉంచలేకున్నా పరవాలేదు . మంత్రజపం మాత్రం మధ్యలో ఆపకుండా ఎవరితో మాట్లాడకుండా ఆలోచనలను పక్కకు మరల్చకుండా స్వామి పై దృష్టి ఉంచి సాగించాలి .
మంత్రం మరియు క్రియ
” ఓం సర్వశుభలక్షణాయ మృత్యుంజయాయ నమః” ఈమంత్రాన్ని జపించాలి . తదనంతరం ఆ ప్రమిదలోని మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుని [కొద్దిగా వంచుకుని] వెన్నుపూసకు నొప్పి ఉన్నభాగంలో సున్నితంగా మర్ధన చేసుకోవాలి . కాలకూటాన్ని కూడామ్రింగి లోకాలను కాపాడిన పరమేశ్వరుని అనుగ్రహం వలనమహామహా వైద్యాలకు కూడా లొంగని నొప్పి ఈ ప్రక్రియద్వారా తొలగిపోతుంది . ఇలా విడువకుండా కొన్నిరోజులు చేయాలి .
Related Stories
ఆషాఢమాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు? | Gorintaku in Ashadamasam in Telugu
Vadapappu & Panakam on Rama Navami | శ్రీ రామ నవమినాడు వడపప్పు పానకం ఎందుకు పంచుతారు?
వినాయక చవితి పూజలో వాడే 21 పుజా పత్రాలు & విశిష్ఠత | Vinayaka Chavithi 21 Patri Names in Telugu
Jaggery, Roasted chana | వేయించిన శనగలు బెల్లంతో కలిపి తింటే శరీరంలో ఇన్ని అద్భుతాలు జరుగుతాయా!
Coconut Water | వేసవి దాహానికి కొబ్బరి నీరు దివ్యౌషదం, కానీ ఈ సమస్యలున్నవారికి ప్రమాదం!
Belly Fat | పొట్ట చుట్టూ పెరిగిన కొవ్వును తగ్గించే అద్భుత పానీయాలు!
Ma brother ki vennupusa kada disk garigimdata daniki amaina nivarana unda,ma nanna ki kallaku unde naram gungutundani badapadutuntadu ma nannaku suger, bp,ad4years bake hort operation garijindi diniki amaina nivarana cheppandi pls