-
History of the Famous Shiva Temple Keesaragutta Hyderabad -
History of the Famous Shiva Temple Keesaragutta Hyderabad
విష్ణుకుండినులు మొదట ఇంద్రపురిని (నేటి నల్గొండ జిల్లా రామన్నపేట మండలంలోని తుమ్మలగూడెం) రాజధానిగా చేసుకొని ప్రజారంజకంగా పరిపాలన చేశారు.
కీసరగుట్ట ప్రాంతం వారి సైనిక స్థావరం. ఈ ప్రాంతంలో పురావస్తు శాఖవారి త్రవ్వకపు పరిశోధనలలో 3 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఒక శిథిలమైన కోట, భవనాలు, ఆభరణాలు, అలంకార వస్తువులు, నాణెములు, మట్టి పాత్రలు, యజ్ఞ కుండాలు వెలుగుచూశాయి.
ఈ వంశంలోని మొదటి గోవింద వర్మ బలపరాక్రమ సంపన్నుడై అనేక రాజ్యాలను జయించి బౌద్ధారామ విహారాలను, చైత్యములను, దేవాలయములను నిర్మించి ప్రసిద్ధిచెందినట్లుగా ఇంద్రపురి (ఇంద్రపాల నగరం) లో లభించిన తామ్రశాసనం ద్వారా తెలుస్తోంది.
విష్ణుకుండినులు తెలుగుబాషను అధికార బాషగా మొట్టమొదట గుర్తించినట్లు ఇక్కడ లభించిన శాసనాల ద్వారా తెలుస్తున్నది.
Pic: కీసరలో తామర కొలనుఈ వంశీయులు అపురూపమైన దేవాలయాలను, గుహాలయాలను నిర్మించారు. నల్గొండ జిల్లాలోని చెరువుగట్టు జడల రామలింగేశ్వర ఆలయం, తుమ్మలగూడెం లోని రామేశ్వర, అమరేశ్వర, మల్లికార్జున ఆలయాలు, మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ సమీపంలోని ఉత్తరరాజ రామలింగేశ్వరాలయం, కందూరు రామలింగేశ్వరాలయం, గుంటూరు జిల్లా వేల్పూరు రామలింగేశ్వరాలయం వీటిలో కొన్ని దేవాలయాలు.
క్రీ.శ. 17వ శతాబ్దంలో గోల్కొండ కుతుబ్ షాహీ వంశంలోని అబ్దుల్ హసన్ తానీషా నవాబు వద్ద మహా మంత్రులుగా ఉన్న అక్కన్న, మాదన్నలు కేసరిగిరి శ్రీరామలింగేశ్వరస్వామిని దర్శించి, ఈ క్షేత్రాన్ని హరిహర క్షేత్రముగా అభివృద్ధి చేయదలచి హిందూ మహమ్మదీయ సమ్మిళిత సంప్రదాయం ఉట్టిపడేలా ఒక దేవాలయాన్ని నిర్మించారు.
దానిలో శ్రీ లక్ష్మీనృశింహస్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ దేవాలయం వెనుక ఒక ఏకశిలా విజయస్థూపం కలదు.
ఈ స్తంభంపై మత్స్య, కూర్మ, వరాహ, గణపతి, ఆంజనేయ విగ్రహాలు చెక్కబడి ఉన్నవి. ఇక్కడ గుట్టపైన బండ రాతి పై అనేక శివ లింగాలు ఉన్నాయి. ఉత్సవ సమయంలో వీటి నన్నిటిని నూనె తో అభిషేకిస్తారు.
కీసరలో బయటపడిన శతాబ్దాల నాటి కట్టడాల పునాదులుచరిత్రకెక్కని మరొక విసేషము ఇక్కడున్నది. అదేమనగా ఈ గుట్ట పైన మరియు ప్రక్కనున్న గుట్టపైన వృత్తాకారంలో అతి పెద్ద ఇటుకలతో కట్టిన బౌద్ద స్తూపాల వంటి కట్టడాలు కనిపిస్తాయి.
అవి చాల వరకు శిధిలమై పోతున్నాయి. అదే విధంగా కీసర గుట్ట ప్రక్కన వున్న మరొ గుట్టపై ఒక పెద్ద ద్వారము కట్టబడి వున్నది.
అది ముస్లిం వాస్తును ప్రతిబింబిస్తున్నది. దీనిని నిజాం ప్రభువుల ఉద్యోగులైన అక్కన్న మాదన్న లు కట్టించినట్టుగా తెలియు చున్నది.
ఈ ప్రాంగణంలో అక్కన్న మాదన్న లు కట్టిన మరో రామాలయము కూడ వున్నది.
Home తెలుగు ఆధ్యాత్మికం హైదరాబాద్ లో ఉన్న ప్రసిద్ద శివాలయం కీసర గుట్ట చరిత్ర తెలుసుకోండి | History of...