
Ksheerabdi Dwadasi Pooja Telugu
ఇక పై రోజు శుభ సమయం కోసం మన AstroTags అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.
వీటితో పాటు మీ జన్మ వివరాలు బట్టి రోజు మీరు ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో తెలుసుకోండి. మరిన్ని వివరలకు
https://onelink.to/ppsjem
1. క్షీరాబ్ధిశయన (క్షీరాబ్ధి ద్వాదశి) వ్రతకల్పము
సంకల్పం, గణేశ పూజ తరువాత
ధ్యానం :
శ్లో : దక్షిణాగ్ర కరే శంఖం పద్మంత స్వాప్యదః కరే
చక్ర మూర్ధ్వకరే వామ గదాంత స్యాష్యధఃకరే,
దధానం సర్వలోకేశం సర్వాభరణభూషితం
క్షీరాబ్ధిశాయినం దేవం ధ్యాయేనారాయణం ప్రభుం ||
తులసీధాత్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః ఆవాహనం సమర్పయామి.
శ్లో : అనేకహార సంయుక్తం నానామణి విరాజితం
తులసీధాత్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః
రత్నసింహాసనం సమర్పయామి.
శ్లో : పద్మనాభ సురారాధ్య పాదాంబుజ వరప్రద
పాద్యం గృహాణ భగవన్ మయానీతం శుభావహ.
తులసీధాత్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః పాద్యం సమర్పయామి.
శ్లో : నిష్కళంక గుణారాధ్య జగత్రితయరక్షక
అర్ఘ్యం గృహాణమద్దత్తం శుద్దోదక వినిర్మితం.
తులసీధాత్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః | అర్ఘ్యం సమర్పయామి.
శ్లో : సర్వారాధ్య నమస్తేస్తు సంసారార్ణవ తారక
గృహాణ దేవ మద్దత్తం వరమాచమనీయకం.
తులసీధాత్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః ఆచమనీయం సమర్పయామి.
శ్లో : స్వపాద పద్మసంభూత గంగాశోధితవిష్టప
పంచామృతైః స్నాపయిష్యే తతః శుద్దోదకేనచ!!
తులసీధాత్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః పంచమృత స్నానం సమర్పయామి,
శ్లో : విద్యుద్విలాస ధష్యేణ సర్వవస్త్రేణ సంయుతం
వస్త్రయుగ్మం గృహాణేదం భక్త్యా దత్తం మహాప్రభో||
తులసీధాత్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః | వస్త్రయుగ్మం సమర్పయామి.
శ్లో : నారాయణ నమస్తేస్తు నాకనాథాదిపూజిత,
స్వర్ణోపవీతం మద్దత్తం స్వర్ణద ప్రతిగృహ్యతాం||
తులసీధాత్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః | యజ్ఞోపవీతం సమర్పయామి.
శ్లో : రమాలింగన సంసక్తరమ్య కాశ్మీర వక్షసే |
కస్తూరీ మిళితంథ్యానే గంధం ముక్తి ప్రదాయకం||
తులసీధాత్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః | గంధం సమర్పయామి.
శ్లో : అక్షతానక్షతాన్ శుభ్రాన్ పక్షిరాజద్వయావ్యయ,
గృహాణ స్వర్ణవర్ణాంశ్చ కృపయా భక్తవత్సల!!
తులసీధాత్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః | అక్షతాన్ సమర్పయామి.
శ్లో : చామంతికా వళుళ చంపకపాటలాబ్జ పున్నాగ జాజి కరవీర రసాలపుషైః బిల్వ
ప్రవాళతులసీదళ మల్లికాభి, సాంపూజయామి, జగదీశ్వర వాసుదేవః!!
తులసీధాత్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః | పుష్పాణి సమర్పయామి.
అధాంగపూజా :
- శ్రీ పాదావనత నాకేశాయ నమః – పాదౌ పూజయామి
- శ్రీ నివృత్తినిమేషాది కాలాత్మనే నమః – జంఘే పూజయామి
- శ్రీ విశ్వరూపాయ నమః – జానునీ పూజయామి
- శ్రీ జగన్నాథాయ నమః – గుహ్యం పూజయామి
- శ్రీ పద్మనాభాయ నమః – నాభిం పూజయామి
- శ్రీ కుక్షిస్థాఖిలవిష్టపాయనమః – కుక్షిం పూజయామి
- శ్రీ లక్ష్మీ విలసద్వక్షసే నమః – వక్షం పూజయామి
- శ్రీ చక్రాదిహస్తాయ నమః – హస్తాన్ పూజయామి
- శ్రీ కంబుకంఠాయ నమః – కంఠం పూజయామి
- శ్రీ చంద్రముఖాయ నమః – ముఖం పూజయామి
- శ్రీ వాచస్పతయే నమః – వక్త్ర0 పూజయామి
- శ్రీ కేశవాయ నమః – నాసికాం పూజయామి
- శ్రీ నారాయణాయ నమః – నేత్రా పూజయామి
- శ్రీ గోవిందాయ నమః – శ్రోత్రా పూజయామి
- శ్రీ నిగమశిరోగమ్యాయ నమః – శిరః పూజయామి
- శ్రీ సర్వేశ్వరాయ నమః – సర్వాణ్యంగాని పూజయామి
అధ విష్ణ్వష్టోత్తర శతనామార్చనం కుర్యాత్:
- ఓం విష్ణవే నమ:
- ఓం లక్ష్మీపతయే నమ:
- ఓం కృష్ణాయ నమ:
- ఓం వైకుంఠాయ నమ:
- ఓం గరుడధ్వజాయ నమ:
- ఓం పరబ్రహ్మణే నమ:
- ఓం జగన్నాథాయ నమ:
- ఓం వాసుదేవాయ నమ:
- ఓం త్రివిక్రమాయ నమ:
- ఓం దైత్యాంతకాయ నమ:
- ఓం మధరిపవే నమ:
- ఓం తార్క్ష్యవాహాయ నమ:
- ఓం నారాయణాయ నమ:
- ఓం పద్మనాభాయ నమ:
- ఓం హృషీకేశాయ నమ:
- ఓం సుధాప్రదాయ నమ:
- ఓం మాధవాయ నమ:
- ఓం పుణ్డరీకాక్షాయ నమ:
- ఓం స్థితికర్త్రే నమ:
- ఓం పరాత్పరాయ నమ:
- ఓం వనమాలినే నమ:
- ఓం యజ్ఞరూపాయ నమ:
- ఓం చక్రపాణినే నమ:
- ఓం గదాధరాయ నమ:
- ఓం ఉపేంద్రాయ నమ:
- ఓం కేశవాయ నమ:
- ఓం హంసాయ నమ:
- ఓం సముద్రమథనాయ నమ:
- ఓం హరయే నమ:
- ఓం గోవిందాయ నమ:
- ఓం బ్రహ్మజనకాయ నమ:
- ఓం కైటబాసురమర్దనాయ నమ:
- ఓం శ్రీధరాయ నమ:
- ఓం కామజనకాయ నమ:
- ఓం శేషశాయినే నమ:
- ఓం చతుర్భుజాయ నమ:
- ఓం పాఞ్చజన్యధరాయ నమ:
- ఓం శ్రీమతే నమ:
- ఓం శార్ఙ్గపాణయే నమ:
- ఓం జనార్దనాయ నమ:
- ఓం పీతాంబరధరాయ నమ:
- ఓం దేవాయ నమ:
- ఓం సూర్యచంద్రవి లోచనాయ నమ:
- ఓం మత్స్యరూపిణే నమ:
- ఓం కర్మరూపిణే నమ:
- ఓం క్రోడరూపిణే నమ:
- ఓం నృకేసరిణి నమ:
- ఓం వామనాయ నమ:
- ఓం భార్గవాయ నమ:
- ఓం రామాయ నమ:
- ఓం హలినే నమ:
- ఓం కల్కినే నమ:
- ఓం హయననాయ నమ:
- ఓం విశ్వంభరాయ నమ:
- ఓం శిశుమారాయ నమ:
- ఓం శ్రీకరాయ నమ:
- ఓం కపిలాయ నమ:
- ఓం ధ్రువాయ నమ:
- ఓం దత్తాత్రేయాయ నమ:
- ఓం అచ్యుతాయ నమ:
- ఓం అనంతాయ నమ:
- ఓం ముకుందాయ నమ:
- ఓం దధివాహనాయ నమ:
- ఓం ధన్వంతరిణే నమ:
- ఓం శ్రీనివాసాయ నమ:
- ఓం ప్రద్యుమ్నాయ నమ:
- ఓం పురుషోత్తమాయ నమ:
- ఓం శ్రీవత్సకౌస్తుభధరాయ నమ:
- ఓం పురారాతయే నమ:
- ఓం అధోక్షజాయ నమ:
- ఓం వృషభాయ నమ:
- ఓం మోహినీరూపధారిణే నమ:
- ఓం సంకర్షణాయ నమ:
- ఓం క్షీరాబ్ధిశాయినే నమ:
- ఓం భూతాత్మనే నమ:
- ఓం అనిరుద్ధాయ నమ:
- ఓం భక్తవత్సలాయ నమ:
- ఓం నరాయ నమ:
- ఓం గజేన్ద్రవరదాయ నమ:
- ఓం త్రిధామ్నే నమ:
- ఓం బూతభావనాయ నమ:
- ఓం శ్వేతద్వీపసువాస్తవ్యాయ నమ:
- ఓం సూర్యమండలమధ్యగాయ నమ:
- ఓం సనకాదిమునిధ్యేయాయ నమ:
- ఓం భగవతే నమ:
- ఓం శంకరప్రియాయ నమ:
- ఓం నీలాకాంతాయ నమ:
- ఓం ధరాకాంతాయ నమ:
- ఓం వేదాత్మనే నమ:
- ఓం బాదరాయణాయ నమ:
- ఓం భాగీరథీజన్మభూమి నమ:
- ఓం పాద పద్మాయ నమ:
- ఓం సతాంప్రభవే నమ:
- ఓం స్వధయే నమ:
- ఓం విభవే నమ:
- ఓం ఘనశ్యామాయ నమ:
- ఓం జగత్కారణాయ నమ:
- ఓం అవ్యయాయ నమ:
- ఓం బుద్ధావతారాయ నమ:
- ఓం శాంతాత్మనే నమ:
- ఓం లీలామానుషవిగ్రహాయ నమ:
- ఓం దామోదరాయ నమ:
- ఓం విరాడ్రూపాయ నమ:
- ఓం భూతభవ్యభవత్ప్రభవే నమ:
- ఓం ఆదిదేవాయ నమ:
- ఓం మహాదేవాయ నమ:
- ఓం ప్రహ్లాదపరిపాలకాయ నమ:
విష్ణ్వష్టోత్తర శతనామావళీ స్సమాప్తః.
శ్లో : దశాంగం గుగ్గులోపేతం చందనాగరువాసితం,
ధూపం గృహాణ దేవేశధూర్జటి స్తుత సద్గుణ||
తులసీధాత్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః ధూపమాఘ్రాపయామి.
శ్లో : అజ్ఞానధ్వాంతనాశాయ అఖండ లోకశాలినే
ఘృతాక్త వర్తీ సంయుక్త దేవందాద్య శక్తితః||
తులసీధాత్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః | దీపం సమర్పయామి.
ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి.
శ్లో : మధుకానిక్షుఖండాంశ్చ కదళీఫలకానిచ
దాపయిష్మే భవత్ప్రీత్యై: గృహాణ సురపూజిత!
తులసీధాత్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః నైవేద్యం సమర్పయామి.
శ్లో : విస్తీర్ణం సంయుక్తం పూగీఫల విరాజితం
కర్సూరేణ సుసంమిశ్రం తాంబూలం స్వీకురుప్రభో||
తులసీధాత్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః | తాంబూలం సమర్పయామి.
శ్లో : ప్రదీపితంచ కర్పూర ఖండైగ్దాన ప్రయుక్తం,
గృహాణేదం మయాదత్తం నీరాజన మిదం ప్రభో||
తులసీధాత్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః నీరాజనం సమర్పయామి. నీరాజనాంతరం శుద్దాచమనీయం సమర్పయామి.
శ్లో :పుష్పాంజలిం ప్రదాస్యామీ భక్త్యా భక్తాశ్రయప్రభో,
అనుగృష్ఠంతు భద్రమ్మే దేహి దేవేశ్వరాచ్యుత||
తులసీధాత్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః
సువర్ణమంత్ర పుష్పం సమర్పయామి. ప్రదక్షిణం కరిష్యామి.
శ్లో :సర్వభ్రమ నివారణం సంసారసాగరాన్మాం
త్వముద్ధరస్వ మహాప్రభో
తులసీధాత్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః నమస్కారాన్ సమర్పయామి.
యస్యస్కృత్యాది – ఏతత్పలం తులసీధాత్రీ సహిత లక్ష్మీనారాయణార్పణ
మస్తు. శ్రీకృష్ణార్పణమస్తు.
అధ కథా ప్రారంభః –
శ్లో : క్షీరాంభోధితరంగోత్థ బిందు చంద్రకితాకృతిం,
తులసీ వనసీమాయా మాగతం మాధవం భజే||
బ్రహ్మదేవుడు చెప్పుచున్నాడు. ఎల్లప్పుడు క్షీరసముద్రంలో శయనించియుండు విష్ణువు ద్వాదశీరోజున, లక్ష్మీ బ్రహ్మ మొదలగు వారితో కూడి బృందావనమునకు వచ్చుచున్నాడు. కావున అప్పుడు బృందావనమందు ఎవ్వడైనను శ్రద్దా భక్తులతో విష్ణుపూజ చేయునో అతనికి దీర్ఘమైన ఆయుస్సు, ఆరోగ్యము, ఐశ్వర్యము మొదలగునవి కలుగననుటకు సంశయము లేదు. సాధకుండు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడస్తమించిన తరువాత స్నానము కాని, దానముగాని, పూజ గాని చేసిన అధిక ఫలమును అందును. క్షీర సముద్రము నుండి లక్ష్మీదేవితో గూడి సమస్తమైన మునులచేతను నమస్కృతుండై పరమేశ్వరుండయిన నారాయణుడెచ్చట వాసము చేయునో అట్టి బృందావన క్షేత్రమందు పూజనీయుడై నట్టి, నిత్యుడైనటువంటి తులసీసహితుడైనట్టి శ్రీమన్నారాయణమూర్తిని బ్రహ్మాది సమస్త దేవతలను శ్రద్దా భక్తియుక్తులై పూజ చేయవలెను. శ్రీ మహావిష్ణువు వసిష్ఠాది మహామునులచేత నానావిధ స్తోత్రపూర్వకంగా తులసివనమందు పూజింపబడినవాడై ఆ కాలము నందు “ఈ కార్తీక శుద్ధ ద్వాదశినాడు తులసీవనము నందు నన్ను ఎవరు పూజ చేయుదురో , వారు సమస్త పాపముల చేతను విడువబడి నా సాన్నిధ్యమును పొందుదురని ప్రతిజ్ఞ చేసెను. ఎల్లప్పుడున్ను దేవతలేమి, యక్షులేమి, నారదుడు మొదలగు మునీశ్వరులేమి వీరందరును బృందావనములో సన్నిహితుడై ఉన్న శ్రీవిష్ణువును సమస్త పాపములు నశించుటకుగాను పూజ చేయుచున్నారు. పతితుడుగాని, మహాపాతకములు చేసిన వాడుగాని, ద్వాదశి రోజున విష్ణువును పూజించిన వాని పాపములు అగ్నిహోత్రములో పడిన ప్రత్తిపోగు వలె నశించిపోవును.
తులసీసహితుడయిన శ్రీ విష్ణువును ఏ పురుషుడు పూజ చేయక ఉండునో అట్టి పురుషుడు పూర్వ పుణ్యముల చేతను విడువబడినటువంటివాడై రౌరవాది నరకంబులు పొందును.
బృందావనము చాలా మహాత్యము గలిగినదని, అచ్చట పూజించినట్లు అయితే విష్ణువుకు అత్యంత సంతోషకరమని పూర్వము దేవతలు గంధర్వులు ఋషులు మొదలగు వారందరును బృందావనమందు సన్నిహితుడైన శ్రీ మహావిష్ణువును పూజ చేసిరి.
ఆ కార్తీకశుద్ధ ద్వాదశి రోజుననే ఆ బృందావనమునందు శ్రీ మహావిష్ణువును అనన్య శరణ్యుడై శ్రద్దాభక్తులతో పూజ చేసినట్లైతే బ్రహ్మహత్యా, సురాపానములను, సువర్ణ స్తేయము మొదలగు మహాపాతకములు గాని గురుతల్పము మొదలగు అతి పాతక ములు గాని ఉపపాతక కోటులయిన అవన్నియు తక్షణము అగ్నిహోత్రమునందు పడిన శూలము వలె దగ్గమగును.
అట్టి మహాపుణ్యకరంబగునట్టిది గాన తులసీ బృందావన సన్నిధానము నందు శ్రీమహావిష్ణువును పూజించుట ప్రశస్తమనుట.
సాధకుడగు పురుషుడు స్నాన సంధ్యావందనాది నిత్యకర్మానుష్టానంబులు సలిపి కలోకప్రకారంబుగ నానావిధ వేద మంత్రముల చేత గాని పురుష సూక్తములచేత గాని శ్రద్ధాభక్తియుక్తుండై పూజ చేయవలెను. ఏలాగంటే “ప్రథమమందు పంచామృత స్నానము గావించి ఆ పిమ్మట శుద్దోదకములచే అభిషేకమొనర్చి ఆ మహావిష్ణువును
స్వర్ణవస్త్రముచే అలంకరించి నానావిధములగు పుష్పములచేతను ధూపదీపాదులచేజించి భక్తి పూర్వకముగా నైవేద్యము నిచ్చి దక్షిణ తాంబూలములు సమర్పించి ఆ పిదప కర్పూరనీరాజనములు సమర్పించవలెను. లోకమునందు ఎవ్వడేనియు నీ పకారము పూజ గావించుచుందురో వారలు సకల పాపములచే విడువబడి సమస్త సంపత్సమృద్ధి కలిగి మిగుల జయశాలియై ఉండును.
తులసి చెంత ఊడ్చి గోమయము చేత అలికి పంచవన్నెముగ్గులతో అలంకరించి పద్మమును, శంఖమును, శాస్త్రమును, చక్రమును, కౌమోదకిని, గోపాదములను, వత్సపాదములను ఆ తిన్నెమీద అలంకరించి పూజించి ఆ వినుక గీత వాద్యములతో నున్న, వేదఘోషములతో నున్న తులసీ కథను వినవలయును.
పూజి చేసిన తరువాత సంతుష్టుడుగానూ స్వచ్చమైన మనస్సు కలవాడుగానున్నూ కాగలడు. పుణ్యము కోరెడు వాడు ఏలాగైనా తులసీవ్రతమాహాత్మ్యమును వినవలయును. విష్ణుదేవునికి ఏ మాత్రమైన ప్రీతి చేయవలెననియున్న తులసీ మాహాత్యము భక్తితో వినవలయును. ద్వాదశిరోజున తులసీకథను విన్నట్లు అయితే పునర్జన్మ కృతమైన దుఃఖములన్నియు వదలిపోవును. ఎవరు దానిని వినునో, చదువునో వారు విష్ణులోకమును పొందును. అప్పుడు పూజాకాలమునందు ధూపదీపములను చూచినవాడు గంగాస్నాన ఫలమును పొందును. పాపము గలవాడెవ్వడయినను నీరాజనమును చూచినట్లుయితే వాని పాపములన్నియు నిప్పులో బడిన ప్రత్తిపోగు వలె మండిపోవును. ఎవడు నీరాజనమును నేత్రముల యందును, శిరస్సునందును అద్దుకొనునో వారికి విష్ణులోకము కల్గును. .
ఆ వెనుకను టెంకాయలు, బెల్లము, ఖర్జూరము, అరటిపళ్ళు, చెరుకుగడలు మొదలగు వానిని నివేదనము చేయవలెను. వీటిని తులసీసహితుడయిన శ్రీ మహావిష్ణువునకు నైవేద్యము సమర్పించి మోక్షార్థియైన పురుషుడు శ్రీ ప్రసాద మంత్రాక్షతలను పుచ్చుకొని శ్రద్దాభక్తి యుక్తుండయి గంధ పుష్పాక్షతాదులతో బ్రాహ్మణులను పూజించి ఫలములను యధాశక్తి దక్షిణల నివ్వవలయును. ఈ ప్రకారము కోటి జన్మములయందు చేసిన పాపములను నశింపజేసెడి. ఈ మహావ్రతమును ఎవడు ఒనర్చెదరో అతనికీ లోకమునందు సమస్త భోగములను ఆముష్మికమును ఉత్కృష్టమైన గతియును కలుగును.
ఈ ద్వాదశీరోజున బృందావన సన్నిధి నందు అవశ్యకముగా దీపదానం చేయవలెను. ఒక దీపము దానము చేసినటులయితే ఉపపాతకములు నశించును. పదిదీపములు దానం చేసిన మహాపాతక నాశనమగును. నూరు దీపములు దానము చేసినవానికి శివసాన్నిధ్యం కలుగును. ఇంతకు మిదుట దీపదానము జేయుట వల్ల స్వర్గాధిపత్యము పొందియున్నారు. అలాగే బ్రహ్మాదులకును దీపదానప్రభావము వల్లనే వైకుంఠమందు శాశ్వతమైన నివాసము కలిగెను. కార్తీకశుద్ధ ద్వాదశిరోజున బృందావనసన్నిధియందు దీపదానమును యెవడు చేయునో అతడు వైకుంఠములో సమస్తమైన భోగములను అనుభవించి విష్ణుసాన్నిధ్యమును పొందును. ఆ దీప దర్శన మాత్రము చేతనే ఆయుస్సు బుద్దిబలము ధైర్యము సంపత్తులు పూర్వజన్మ స్మరణం మధ్యమము ఇవన్నియు కలుగును.
ఆ దీపమునకు ఆవునెయ్యి ఉత్తమము. మంచినూనె మధ్యమము. ఇప్పునూనె అధమములు. ఆవు నెయ్యితో దీపము వెలిగించి దానము చేసినటులయితే జ్ఞానలాభమున్ను, మోక్షప్రాప్తియున్ను కలుగును. మంచినూనెతో వెలిగించిన సంపత్తు కీర్తి లభ్యమగును. ఇప్పనూనెతో దీపము పెట్టిన నిహభోగములను అనుభవించును. ఇతరమైన వన్య తైలములు కామార్థములు, ఆవాలునూనెతోగాని, అవిసెనూనెతోగాని దీపము పెట్టిన శత్రువులు నశించును. ఆముదముచే దీపముంచిన సంపత్తు ఆయుస్సు క్షీణమగును. గేదెనూనెతో దీపము వెలిగించినట్లయితే పూర్వము చేసిన పుణ్యము కూడ నశించిపోవును. అదే స్వల్పముగా ఆవు నేతితో కల్పి పెట్టినట్లైతే ఏమి దోషం లేదు. ఈ దీపదానమహాత్యం వర్ణనకు అందదు.
ఒక వత్తితో దీపము పెట్టి దానము చేసిన సమస్త పాపములచేత విడువబడినవాడై తేజస్విగాను బుద్ధిమంతుడుగా నగును. నాలుగు వత్తులతో దీపములంబెట్టిన రాజగును. పదివత్తులతో దీపదానము చేసిన చక్రవర్తి అగును. ఏబది వత్తులతో దీపము వెలిగించిన దేవతలలో నొకడగును. నూరు వత్తులతో దీపదానము చేసిన విష్ణుసాన్నిధ్యము లభించును. వేయి వత్తులతో దీపము పెట్టిన సాక్షాద్విష్ణురూపుడగును. ఈ ఫలము విష్ణుక్షేత్రమందు తులసీ సన్నిధియందు చేసినట్లయితే ద్విగుణముగా నున్ను గంగాతీరమందు చేసిన మూడింతలున్ను, కార్తీక ద్వాదశియందైన చతుర్గుణముగాను నగును. కార్తీకశద్ధ ద్వాదశి రోజున బృందావన సన్నిధియందు మహావిష్ణువును పూజించినవానికి పరమోత్కృష్టమైన గతి కలుగును.
Related Posts:
మార్గశిర మాసంలో లక్ష్మీ దేవి అనుగ్రహం కోసం | Margashira Lakshmiwara Vratam
Hari Sayana Ekadasi, Go Padma Vratam, Beginning of Chaturmasya Vrata
శ్రీ వరలక్ష్మీ వ్రతకల్పం – Sri Varalakshmi Vrata Kalpam in Telugu
శ్రావణ మంగళ గౌరీ వ్రతం విధానం – మంగళ గౌరీ పూజ | Sravana Mangala Gowri Vratham Vidhanam in Telugu
మౌనవ్రతం -ఆచరించడం వల్ల కలిగే లాభాలు ? | Mouna Vratham Benefits in Telugu ?
Mangala Gowri Vratham in Telugu | మంగళగౌరి వ్రతం – ఎవరు చేయవచ్చు? వ్రత నియమాలు ఏమిటి ?
వరలక్ష్మీ వ్రతకల్పము | వరలక్ష్మీ పూజ విధానం | Varalakshmi Vratham Puja Vidhanam in Telugu