
Importance Of Karthika Masam
Next బటన్ నొక్కకుండా మొత్తం కంటెంట్ సింగల్ పేజీ లో మరింత సులువుగా చదవటానికి మన హరి ఓం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి Android / iOS
4. మహాప్రదోషకాల ప్రాముఖ్యత
కొందరు నిష్టాపరులు ఈ కార్తీకమాసమంతా పుణ్యనదీస్నానం ఆచరిస్తూ ప్రతి నిత్యం హరిహరాదులను పూజిస్తూ పగలు అపక్వాహారం అంటే వండని ఆహారం. పాలు, పండ్లు స్వీకరించి సాయంత్రం భక్తితో కార్తీక దీపారాధనలు, పూజలు చేసి, నివేదించిన అన్నాన్ని రాత్రి భుజిస్తూ ఉంటారు. ఇలా ఈ కార్తీక వ్రతాన్ని నిత్యం ఆచరిస్తారు.ఇక ప్రదోషకాలంలో పరమేశ్వరుడు ఏక కాలంలో రెండు రూపాల్ని ప్రదర్శిస్తూ ఎడమ భాగాన పార్వతి, రెండవ భాగంలో పరమేశ్వరరూపంగా ‘‘అర్థనారీశ్వరుడుగా’’ దర్శనమిచ్చే కాలం ఈ ప్రదోషకాలం అని చెప్పబడినది. ఆ ప్రదోష సమయాల్లో ఆ తల్లి ‘‘అధ్యక్షురాలు’’గా అధిరోహించియుండగా! పరమేశ్వరుడు పరవశించి తాండవం చేస్తూ ఉంటాడు. ఆ నృత్యాన్ని దర్శించటానికి దేవతలందరూ అక్కడ కొలువుతీరి ఉంటారుట! ఆ సమయంలో ఆ తాండవ నృత్యానికి అనుగుణంగా సరస్వతి దేవి వీణవాయిస్తూ ఉంటే బ్రహ్మ తాళం వేస్తాడట. శ్రీ మహాలక్ష్మీ గానం చేస్తూ ఉంటే! శ్రీ హరి మృదంగం వాయిస్తాడుట. ఇంద్రుడు వేణునాదంతో పులకింపచేస్తూ ఉంటాడు! అలాంటి ప్రదోష సమయాల్లో దేవగంధర్వ మహర్షి సిద్ధులందరూ పరమాత్మ స్వరూపాన్ని కొలుస్తూ ఉంటారుట.
కాబట్టి ప్రదోష సమయాల్లో శివుని ఆరాధిస్తే! శివుని ఆశీస్సులతోపాటు మిగతా దేవతల ఆశీస్సులు కూడా ఏకకాలంలో మనం పొందగలుగుతామని చెప్పబడింది. ఇంకా మనకు ఆ అర్థనారీశ్వర స్వరూపాన్ని ధ్యానిస్తే! రెండు ప్రయోజనాలు లభిస్తాయట. కామం! అంటే కోర్కెలను నియంత్రించే శక్తి మరియు కాలాన్ని అంటే మరణాన్ని జయించే శక్తిని ప్రసా దిస్తాడుట! ఇంకా ఈ ప్రదోష దర్శనం సర్వశుభాలను కలుగచేసి, సర్వదారిద్య్ర బాధలను తొలగించి సర్వసంపత్తులు అనుగ్రిహస్తుంది అని చెప్పబడింది.