
Importance Of Karthika Masam
Next బటన్ నొక్కకుండా మొత్తం కంటెంట్ సింగల్ పేజీ లో మరింత సులువుగా చదవటానికి మన హరి ఓం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి Android / iOS
10. కార్తీక సోమవారాలు:
ఈ మాసవారాలలో సోమవారానికి ప్రత్యేకత ఉంది. సోమవారానికి చంద్రుడు అధిపతి. దేవతలలో ప్రథముడైన అగ్ని నక్షత్రాలలో మొదటిదైన కృత్తికను అధిపతిగా ఉండటం, చంద్రుడు పూర్ణుడై ఈ నక్షత్రం మీద ఉండటం వల్ల మాసంలోని సోమవారాలకు విశిష్టత కలిగింది. చంద్రుని వారమైన ఈ సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైనది. శైవభక్తులు ఈ మాసంలో ముఖ్యంగా సోమవారాలలో భక్తిశ్రద్ధలతో నియమనిష్టలతో శివుణ్ణి ఆరాధిస్తారు. ఈ మాసకాలంలో సూర్యోదయ పూర్వమే బ్రహ్మ ముహూర్తంలో నదీ స్నానం చేసి ‘హరహరశంభో’ అంటూ శివుణ్ణి స్తుతిస్తూ భక్తి ప్రపంచంలో మునిగిపోతారు. ముఖ్యంగా శైవభక్తులు ఈ మాసమంతా ఉపవాసముండి శివుడిని పూజిస్తారు. శివ ప్రీతికరమైన సోమవారం రోజు భానోదయం ముందు లేచి స్నానాదికార్యాక్రమాలు ముగించుకుని, పొడి బట్టలు ధరించి మొదటగా దీపారాధన చేయాలి. అనంతరం శివుడికి రుద్రాభిషేకం చేయించి శివవ్రత నియమాలను పాటించాలి. ఈ విధంగా చేయడం వల్ల నిత్యమూ సిరిసంపదలతో, సుఖసౌఖ్యాలతో వర్థిల్లుతారని ప్రజల నమ్మకం. సూర్యుడు తులారాశిలో ప్రవేశించిన నాటి నుండిగాని, కార్తీక మాసారంభదినమైన శుద్ధపాడ్యమి మొదలుకొని గాని వ్రతారంభం చేయాలి. అలా ప్రారంభించే సమయంలో “ఓ కార్తీక దామోదార! నీకు వందనములు. నాచే ఆరంభింపబడే కార్తీక వ్రతాన్ని విఘ్నం లేకుండా చేయు”ము అని తరువాత స్నానం చేయాలి.
ఆ విధంగా జీవనదికి వెళ్ళి గంగకు, శ్రీ మన్నారాయణునను, భైరవున్ని నమస్కరించి భైరవాజ్ఞను తలదాల్చి మొలలోతు నీటిలో నిలువబడి మొదట సంకల్పము చెప్పుకొని సూక్తాలను చదివి, మార్జన మంత్రముతోను, అఘమర్షణ మంత్రముతోను, గంగోదకమును శిరస్సున జల్లుకొని అఘమర్ష స్నానమా ఆచరించాలి. తరువాత సూర్యుడికి కర్ఘ్య ప్రదానం చేసి దేవతలకు, ఋషూలకు, పితృదేవతలకు క్రమ ప్రకారంగ తర్పణం వదలాలి. అప్పుడది సుస్నానం అవుతుంది. స్నానం చేసిన తరువాత నదీతీరము చేరి మూడుదోసిళ్ళ నీరు గట్టుపైన పోయాలి.
కార్తీకమాసంలో గంగా, గోదావరి, కావేరీ, తుంగభద్రాది నదులలో స్నానం చేస్తే ఆత్యుత్తమం, గంగానది కార్తీకమాసంలో నదులన్నిటిలో ద్రవరూప సన్నిహితయై వుంటుంది. శ్రీ ఆదినారాయణుడు గోష్పాద మాత్ర ప్రదేశంలో జలములో సన్నిహితుడై ఉంటాడని వేదాలు చెప్పుతున్నాయి కాబట్టి సముద్రకామి అయిన నదీ స్నానం అత్యంత పవిత్రమైనది. నదీ స్నానానికి ఆవకాశము లభించకపోతే కులువలోగాని, చెరువులోగాని, కూపము దగ్గరగాని సూర్యోదయము స్నానం చేయాలి. తరువాత మడిబట్టలను ధరించి ముందుగా భగవంతుని స్మరించు కోవాలి. తరువాత భస్మాన్ని త్రిపుండ్రముగా నుదుట ధరించాలి. లేక గోపీచందనముపైన నుదుట నూర్ద్వ పుండ్రముగా వుంచుకోవాలి. తరువాత సంధ్యావందనము, బ్రహ్మ యజ్ఞాన్ని ముగించి, నిత్యాగ్నిహోత్రాన్ని చేసుకొని దేవతార్చన చేసుకోవాలి. స్నానతీర్థములోనే కార్తీక పురాణ శ్రవణమును చేయాలి.
సూర్యుడు ఆస్తమించే కాలంలో సాయంసంధ్యను పూర్తి చేసికొని శివాలయముగాని, విష్ణు ఆలయంలోగాని దీపారాధన చేయాలి. షోడశోపచార పూజావిధానంలో హరిహరులను పూజించి షడ్రసోపేతమై, భక్ష్యభోజ్యాదులతో కూడిన నైవేద్యము పెట్టాలి. ఈ విధంగా కార్తీకశుద్ధ ప్రతిపత్తు మొదలు అమావాశ్య తుదివరకు నక్తవ్రతం చేస్తే కార్తీకమాస వ్రతము పూర్తవుతుంది. మరునాడు శక్తిననుసరించి మృష్టాన్నముతో భూత తృప్తి కావించాలి. కార్తీక మాసంలో సోమవారం శివప్రీతికై సోమవారవ్రతము చేసినవారికి కైలాసంలో శివుని సన్నిధానమున నుండుట ప్రాప్తిస్తుంది. సోమవారవ్రత విధానం ఎలాంటిది అంటే – సోమవారం నదీ స్నానం చేసి సంపూర్ణంగా ఉపవాసం ఉండి, శివునికి అభిషేకం చేసి రాత్రి మొదటి ఝామున భుజించాలి.
ఆ రోజున యితరులలాగా పదార్ధం గ్రహింపరాదు. తిలదాన మొనర్చినందువలన పాపములన్నియు నశించును. ఇంకా ఆత్యంత నిష్ఠతోను, భక్తితోను ఆచరింప అవకాశం ఉన్నవారు ఆ దినం రాత్రి కూడా నిద్రింపోక పురాణాది పఠనంతో జాగరణ చేసి, మరునాడు శక్తి కొలదిగా బ్రాహ్మణులకు సంతర్పణను చేసి తరువాత భుజించాలి. ఈ పై రెండూ చేయలేనివారు సోమవారం రోజు నపరాహ్ణము వరకు వుండి భుజించాలి. యిందులో ఏది చేయుడానికి శక్తిలేకపోతే నదీస్నానం చేసుకొని భగవంతుని ధ్యానించాలి. సోమవారం రోజు స్త్రీగాని, పురుషుడుగాని నక్షత్ర దర్శనం అయ్యేవరకు ఉపవాసం చేసి తరువాత భుజించినవారి పాపాలు అగ్నిలో పడిన దూదివలే నాశనం అవుతుంది. ఆ రోజునశివుడికి అభిషేకం చేసి, బిల్వదళంబులతో సహస్రనామార్చన చేసి, ఇతరులచే చేయించిమా, శివపంచాక్షరీ మంత్రాన్ని జపించినా, వారిని శివుడు ఆనుగ్రహించి సర్వసంపదలను, సమస్త శుభాలను చేకూరుస్తాడు.
కార్తీక సోమవారాలు లేదా పౌర్ణమినాడుగాని లేక ఇతర దినాల్లో అయినా సాయంసమయాలలో శివాలయంలో ఉసిరికాయపైన వత్తులను వుంచి దీపం వెలిగించడం శ్రేష్టం. ఆవునెయ్యితో దీపం వెలిగించడం శ్రేష్టం. లేదంటే నువ్వులనూనెతో గానీ, కొబ్బరినూనెతో గానీ, నెయ్యితోగాని, అవిశనూనెతో గానీ, ఇప్పనూనెతో గానీ, లేదంటే కనీసం ఆముదంతోనైనా దీపాన్ని వెలిగించాలి. అంతే కాకుండా కార్తీకమాసంలో దీపదానం చేయాలని వేదాలు చెప్తున్నాయి..
లోకా సమస్తా సుఖినోభవంతు…







