కార్తీక పురాణము – పదునాల్గవ అధ్యాయము | Karthika Puranam Fourteenth Chapter in Telugu

0
1399
Karthika Puranam Fourteenth Chapter in Telugu
Karthika Puranam Fourteenth Chapter

ఇక పై రోజు శుభ సమయం కోసం మన AstroTags అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

వీటితో పాటు మీ జన్మ వివరాలు బట్టి రోజు మీరు ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో తెలుసుకోండి. మరిన్ని వివరలకు
https://onelink.to/ppsjem

Karthika Puranam Fourteenth Chapter

2తలంటుకొనుట-తైలాభ్యంగము

ఈమాసమందు శరీర సామర్ధ్యముండియు, గృహమందు ఉష్ణోదక స్నానమాచరించినయెడల ఆస్నానము కల్లుతో స్నానమగునని బ్రహ్మదేవుడు చెప్పెను. తులయందు రవియుండగా కార్తీకమాసమందు నదీస్నానము ఖ్యము. సర్వశ్రేష్ఠము. తులారాశిలో సూర్యుడు ప్రవేశించినది మొదలు నెల రోజులు నదీస్నానమే చేయవలెను. అట్లు నదియుండనిచో తటాకమందుగాని, కాలువలయందుగాని, బావులవద్దగాని స్నానము చేయవలెను. తటాక కూపములందు స్నాన సమయమున గంగా ప్రార్థన చేయవలెను. ఇది గంగయందును, గోదావరియందును, మహానదులయందును అవసరము. (లేక) గంగా గోదావరి మొదలైన నదులు సన్నిధిలో లేనప్పుడు తటాకస్నానము కర్తవ్యము. గంగకు నమస్కరించవలెను. కార్తీకమాసము ప్రాతస్నానమాచరించి వాడు నరకమందు యాతనలను అనుభవించి తరువాత చండాలుడై పుట్టును. గంగాది సమస్త నదులను స్మరించి స్నానము చేసి సూర్యమండల గతుడైన హరిని ధ్యానించి హరిచరిత్రను విని గృహమునకు వెళ్ళవలెను. పగలు చేద్యదగిన వ్యాపారములన్నియు చేసికొని సాయంకాలము తిరిగి స్నానము చేసి ఆచమించి పూజాస్థానమందు పీఠముంచి దానియందు శంకరుని ఉంచి పంచామృతములతోను, ఫలోదకములతోను, కుశోదకముతోను మహాస్నానము చేయించి షోడశ ఉపచారములతోను పూజించవలెను. తరువాత శంకరుని ఆవాహనము చేయవలెను. శంకరాయ ఆవాహనము సమర్పయామి తరువాత

  • ౨.వృషధ్వజాయ ధ్యానం సమర్పయామి,
  • ౩. గౌరీప్రియాయ పాద్యం సమర్పయామి,
  • ౪. లోకేశ్వరాయ అర్ఘ్యం సమర్పయామి,
  • ౫. రుద్రాయ ఆచమనీయం సమర్పయామి
  • ౬. గంగాధరాయ స్నానం సమర్పయామి.
  • ౭.ఆశాంబరాయ వస్త్రం సమర్పయామి
  • ౮. జగన్నాధాయ ఉపవీతం సమర్పయామి
  • ౯. కపాలధరిణే గంధం సమర్పయామి.
  • ౧౦. ఈశ్వరాయ అక్షతాన్ సమర్పయామి.
  • ౧౧. పూర్ణగుణాత్మనే పుష్పం సమర్పయామి.
  • ౧౨. తేజోరూపాయ దీపం సమర్పయామి
  • ౧౩. లోకరక్షాయ నైవేద్యం సమర్పయామి.
  • ౧౪. లోకసాక్షిణే తాంబూలం సమర్పయామి
  • ౧౫. భవాయ ప్రదక్షిణం సమర్పయామి.
  • ౧౬. కపాలినే నమస్కారం సమర్పయామి.
ఈ ప్రకారముగా షోడశోపచారముల చేత శంకరుని పూజింపవలెను. పైనజెప్పిన నామములతో భక్తితో పూజించి మాసమంతయు సహస్రనామముల చేత నిత్యము పూజించి పూజావసానమందు

శ్లో!! పార్వతీకాంత దేవేశ పద్మజార్చ్యాంఘ్రి పంకజః!
అర్ఘ్యం గృహాణ దైత్యారేదత్తంచేదముమాపతే!!

అను మంత్రముతో అర్ఘ్యము నివ్వవలెను. ఇట్లు భక్తితో చేయువాడు ముక్తుడగును. సంశయము లేదు.

రాజా! తనశక్తి కొలది దీపమాలలను సమర్పించి శక్తివంచన చేయక బ్రాహ్మణులకు దానమివ్వవలెను. ఈప్రకారము కార్తీకమాసమంతయు బ్రాహ్మణులతో గూడి నక్తవ్రతమును జేయువాడు వేయి సోమయాగమును, నూరు వాజపేయయాగములు, వేయి అశ్వమేధయాగములు చేసిన ఫలమును బొందును. కార్తీకమాసమునందీ ప్రకారముగా మాస నక్తవ్రతమాచరించు వాడు పాపములను సమూలముగా పరిహరించుకొనునని నారదాదులు చెప్పిరి. కార్తీకమందు మాస నక్తవ్రతము వలన పుణ్యమధికమగును. సమస్త పాపములు నశించును. ఇందుకు సందేహము లేదు. చతుర్దశియందు పితృప్రీతి కొరకు బ్రాహ్మణునకు భోజనమును బెట్టిన యెడల పితరులందరు తృప్తినొందుదురు. కార్తీకమాసమున శుక్ల చతుర్దశినాడు ఫలదానమాచరించువాని సంతతికి విచ్ఛేము గలుగదు. సందేహము లేదు. చతుర్దశినాడు ఉపవాసమాచరించి శంకరుని ఆరాధించి తిలదానమాచరించు వాడు కైలాసమునకు ప్రభువగును. సమస్తపాపములను బోగొట్టునదియు, సమస్త పుణ్యములను వృద్ధిపరచునదియు అయిన కార్తీకవ్రతమును జేయువాడు విగతపాపుడై మోక్షమొందును. పవిత్రకరమైన యీ అధ్యాయమును భక్తితో వినువారు సమస్త పాతకములకు ప్రాయశ్చిత్తమును జేసుకొన్న వారగుదురు.

ఇతి శ్రీ స్కాందపురాణే కార్తీకమహాత్మ్యే చతుర్దశాధ్యాయస్సమాప్తః

Related Stories

కార్తీక పురాణం పదిహేనవ అధ్యాయము | Karthika Puranam 15th Chapter in Telugu

కార్తీక పురాణం – పదహారవ అధ్యాయము | Karthika Puranam 16th Chapter in Telugu

కార్తిక పురాణం – పదిహేడవ అధ్యాయము | Karthika Puranam 17th Chapter in Telugu

కార్తీక పురాణం – పద్దెనిమిదవ అధ్యాయము | Karthika Puranam 18th Chapter in Telugu

కార్తీక పురాణం – పంతొమ్మిదవ అధ్యాయము | Karthika Puranam 19th Chapter in Telugu

కార్తీక పురాణం – ఇరవై అధ్యాయము | Karthika Puranam 20th Chapter in Telugu

Next

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here