జ్యేష్ఠ అమావాస్య, వట్ సావిత్రి వ్రతం, శని జయంతి ఒకే రోజు? ఏమేమి చేస్తే శుభం? | Jyeshtha Amavasya 2023

0
898
Jyeshta Amavasya 2023
Jyeshta Amavasya Significance

Auspicious Jyeshtha Amavasya, Vat Savitri Vrat & Shani Jayanti on Same Day

1ఒకే రోజున శుభ జ్యేష్ట అమావాస్య, వట్ సావిత్రి వ్రతం & శని జయంతి

హిందువులకు జ్యేష్ఠ అమావాస్య చాలా పవిత్రమైన రోజు. ఈ రోజు స్నానం చేసి దానం, పూర్వీకులకు తర్పణాలు వదలడం చేస్తే అంతా శుభం జరుగుతుంది అని నమ్మకం. జ్యేష్ఠ అమావాస్య ఎప్పుడు వస్తుంది, ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం.

హిందూ మతంలో అమావాస్యకి చాలా ప్రాధాన్యత ఉంది. కొందరు మాత్రం తంత్ర పూజలకు వాడుకుంటారు అది వేరే విశయం అనుకోండి. ఈ రోజే వట్ సావిత్రి వ్రతం, శని జయంతి కూడా వచ్చాయి. అమావాస్య తిథికి అధిపతి పిత్రుడు.

జ్యేష్ఠ అమావాస్య తేదీ & ముహూర్తం ఎప్పుడు? (Jyeshtha Amavasya Date & Muhurt)

జ్యేష్ఠ అమావాస్య తిథి మే 18న రాత్రి 9.42 గం.కు మోదలై తర్వాతి రోజు మే 19న రాత్రి 9.22 గంటలకు ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం జ్యేష్ఠ అమావాస్య మే 19వ తేదీ శుక్రవారం రోజు జరుపుకోవాలి.

1. స్నాన సమయం చేయవలసిన సమయం – ఉదయం 05:15 నుండి ఉదయం 04:59 వరకు.
2. వట్ సావిత్రి పూజ ముహూర్తం – ఉదయం 05.43 నుండి 08.58 వరకు చేసుకోవచ్చు.
3. శనిదేవుడి పూజ ముహూర్తం – సాయంత్రం 06:42 నుండి రాత్రి 07:03 వరకు చేసుకోవచ్చు.

జ్యేష్ఠ అమావాస్య రోజు ఏమి చేయాలి? (What to do on Jyeshtha Amavasya Day?)

1. ఉదయం స్నానాదులు ముగించుకొని ఉపవాసం ఉండటం వల్ల మీ పాపాలు నశించి పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి.
2. ఇదే రోజు శని జయంతి కావున సూర్యాస్తమయం తర్వాత శని దేవుడిని పూజించడం శ్రేయస్కరం.

జ్యేష్ఠ అమావాస్య పూజ విధానం ఏమిటి? (What is the Jyeshtha Amavasya Puja Procedure?)

1. ఈ రోజు నదీ స్నానం చేసి సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించాలి.
2. ఈ రోజు పిండ ప్రదానం చేయడం వల్ల పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరుతుంది.
3. పేదవారికి దానం మరియు దక్షిణ ఇవ్వండి.
4. శనిదేవుడికి ఆవాల నూనె, నల్ల నువ్వులు, నల్ల బట్టలు మరియు నీలిరంగు పువ్వులు సమర్పించి శని చాలీసాను పఠించాలి.
5. వట్ సావిత్రి వ్రతం పాటించే స్త్రీలు ఈ రోజు యముడిని పూజించాలి.

Related Posts

Vat Savitri Vrat 2025 | వట్ సావిత్రి వ్రతాన్ని పాటిస్తే దీర్ఘకాలం ఆయుష్షుతో పాటు సంతాన భాగ్యం

Shani Jayanti 2025 | శని జయంతి, పూజా విధానం, ప్రాముఖ్యత మరియు కథ ఈ రోజున ఏమి చేయాలి.

వటసావిత్రీవ్రతం, మహాజ్యేష్ఠి, ఏరువాక పూర్ణిమ, వృషభపూజ – జ్యేష్టాభిషేకములు | Vat Savitri Vrat 2025

Masik Kalashtami 2025 Dates, Story, Vrat & Puja Vidh | కాలాష్టమి పూజ విధానం మరియు విశిష్టత, ఈ రోజు ఇలా పూజిస్తే చాలు

Jyeshtha Purnima 2025 in Telugu | జ్యేష్ఠ పూర్ణిమ ప్రాముఖ్యత, పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి?

జ్యేష్ఠమాసంలో ఈ తప్పులు అస్సలు చేయకూడని పనులు | Jyeshta Masam Precautions & Remedies

Ashadha Pournami Vratham 2025 In Telugu | ఆషాఢ పౌర్ణమి వ్రతం ఎలా ఆచరించాలి?

https://hariome.com/vaishakha-paurnami/