3. తమిళ నాడు ముఖ్యమంత్రి జయలలితకు ప్రాణగండము ఉందా?
ఇప్పుడు మనం అసలు విషయానికి వచ్చినట్లైతే తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ జయలలిత గారి జాతకమును పరిశీలించినట్లైతే వీరి జాతకములో ప్రస్తుతము జన్మ జాతకములోని జీవకారకుడు అయిన బృహస్పతి,దేహ కారకుడు అయిన కుజుడు ,మన: కారకుడు అయిన చంద్రుడి మీదకు గోచార రాహువు వచ్చి జీవుడిని కబళించడానికి తగిన అవకాశము కోసము ఎదురుచూస్తూ ఉన్నాడు . వాస్తవానికి ఈ గోచార గురువు 2016 పిబ్రవరిలోనే ఈ గ్రహ త్రయం మీదకి రావడము జరిగింది .అందుకనేనేనో అప్పటినుండి శ్రీ జయలలిత గారు రకరకాలైన శారీరక ,మానసిక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉండటము మనం గమనించాము .ఎప్పుడైతే ఆగస్టు నెలలో గురువు కన్యా రాశి ప్రవేశము జరిగిందో అప్పటినుండి జన్మ జాతకములోని శుక్ర గ్రహం యొక్క అనుగ్రహం కొంత మేర పెరగటము వలన ఆయా సమస్యల యొక్క తీవ్రత తగ్గిందని చెప్పుకోవచ్చు.
అయితే సెప్టెంబర్ 18 వ తేదీన కుజుడు ధనుర్రాశి ప్రవేశము జరగడము తో జన్మ జాతకములో ఉన్న గ్రహ త్రయానికి శని +కేతు +కుజ +గురు +రాహు సంయోగము ఏర్పడి అప్పటి నుండి శరీర నొప్పులు ,శ్వాస లో అస్వస్థత ,తో పాటు జ్వరాది అనారోగ్యములు కలిగే అవకాశము ఉన్నది .అయితే సింహములో నున్న బుదుడు వక్రము వీడి రవి యొక్క నక్షత్రము లోకి ప్రవేశించిన తర్వాత శరీరములో వాతము ప్రకోపించి తీవ్రమైన నరముల ,లేదా రక్త ప్రవాహమునకు సంభందించిన సమస్య వచ్చే అవకాశము ఉన్నది.ఏది ఏమైనప్పటికి శ్రీ జయలలిత గారి జాతక రీత్యా గనుక గమనించినట్లైతే అక్టోబర్ 2 వ తేదీ నుండి 18వ తేదీ వరకు మరణ గండ చూచనలు ఉన్నాయని చెప్పవచ్చు .కావున ఈ సమయములో తగిన శాంతి పరిహారములను చేసుకోవడము ద్వారా ఉపశమనం కలిగే ? అవకాశము ఉన్నది.
గతములో జరిగిన ఆంద్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలలోనూ ,మరియు చెన్నై వరదల విషయములోను జ్యోతిష శాస్త్ర సహకారముతో ఆయా ఫ్రింట్ ,ఎలట్రానిక్ మీడియాల ద్వారా నేను అందించిన వివరాలు తేదీలు ,గణాంకములతో సహా 100% ఖచ్చితమైన ఫలితాలను అందించాయని ఈ సందర్భముగా మీకు తెలియచేసుకుంటున్నాను .
రాఘవేంద్ర ఏం.ఏ . జ్యోతిష్యం .స్వర్ణ పతక గ్రహీత
ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష బిరుదు విశ్వభంధు గ్రహీతలు
కనినిక ,కశేరుక ,నిమిత్త నాడీ జ్యోతిష పరిశోధకులు
జూబ్లీహిల్స్ రోడ్ నెం : 5
హైదరాబాద్
astroguru81@gmail.com
సెల్ : 9246461774