
Lakshmi Devi is Mother of Vishnu
1. లక్ష్మీదేవి విష్ణువుకి తల్లా?
శ్రీ లక్ష్మీదేవి విష్ణుపత్ని.అనేక యుగాలలో అనేక జన్మలలో ఆయనకు తోడుగా అవతారాలను ఎత్తి, చివరికి విష్ణుమూర్తి ఇల్లాలిగానే అవతార పరిసమాప్తి కావించినది లక్ష్మీదేవి.
మరి అటువంటి లక్ష్మీదేవి విష్ణుమూర్తికి తల్లి ఎలా అయింది.? లక్ష్మీదేవి మూలరూపం ఆదిలక్ష్మీ అమ్మవారు. ఆమె విష్ణుమూర్తికి జన్మనిచ్చింది.
ఆదిలక్ష్మీ దేవి ఎవరు?
శ్రీ ఆది లక్ష్మీ దేవే సృష్టి లోని జనన మరణాలన్నిటికీ మూలం.లక్ష్మీ దేవికి మూల రూపంగా మనం కొలిచే ఆదిలక్ష్మీ అమ్మవారే విష్ణుమూర్తికీ, శంకరునికీ,బ్రహ్మ దేవునికీ జన్మనిచ్చింది. అష్టలక్ష్ములలో మొదటి రూపం ఆదిలక్ష్మీ అమ్మవారు.
ఆమె సమస్త సృష్టికీ మూలమని మన పురాణాలు చెబుతున్నాయి. మూడు లోకాలూ, త్రిమూర్తులూ, త్రిగుణాలైన సత్వ, రజస్, తమో గుణాలూ అన్నీ అమ్మవారినుండే ఉద్భవించాయని పురాణోక్తం.
ఆది శక్తి రూపమే ఆదిలక్ష్మి . ఆమె సత్వ గుణ ప్రధానంగా సరస్వతీ దేవినీ, రాజోగుణ ప్రధానంగా లక్ష్మీ దేవినీ, తమో గుణ స్వరూపంగా మహాకాళినీ సృష్టించింది.
త్రిమూర్తుల సృష్టి ఎలా జరిగింది..?
ఆదిలక్ష్మీ దేవి గురించిన ఒక ఆసక్తికరమైన ఒక కథ బ్రహ్మండ పురాణం లో ఉంది. ఆ కథ ప్రకారం ఆదిలక్ష్మీ దేవి నుండీ మూడు అండాలు ఉద్భవించాయి. మొదటి అండం నుండి విష్ణువు, అంబిక జన్మించారు. రెండవ అండం నుండి బ్రహ్మదేవుడు, లక్ష్మీ దేవీ జన్మించారు. మూడవ అండం నుండీ శంకరుడు, సరస్వతీ జన్మించారు.
ఆ తరువాత సృష్టిని కొనసాగించడానికి విష్ణు మూర్తికీ లక్ష్మీదేవీ కీ , శంకరునికీ అంబికకీ, బ్రహ్మదేవునికీ సరస్వతికీ వివాహం జరిపించబడింది. వారి నుండీ సృష్టి క్రమం కొనసాగుతోంది.2
Related Posts
లక్ష్మీదేవి క్షేత్రం..ఎక్కడ వుందో తెలుసా ? | Where is Lakshmi Devi Kshetram Located in Telugu?
లక్ష్మీదేవి అనుగ్రహానికి | How to Get Lakshmi Devi Blessings in Telugu
లక్ష్మీదేవి అనుగ్రహా మాల | Lakshmi Devi Anugraha Mala in Telugu.
Service to Hindu is a good thing. This type can success only with the blessing of Lord Parameswara.This organisation is succeed and observed that Parameswara blessing are with them.