నలుపురంగు అశుభానికి గుర్తా ?

0
18885
black
black is inauspicious

Black is Inauspicious 

1. నలుపురంగు గొప్పదనం

నలుపు అశుభానికి గుర్తన్న వాళ్ళే, నలుపు నారాయణ మెప్పు అన్నారు. రాముడినీ, కృష్ణుడినీ తప్ప నల్లగా ఉన్న వాళ్లందరినీ తక్కువగా చూస్తుంటారు.చర్మం దగ్గరి నుంచీ, వేసుకునే బట్టల వరకూ నలుపు రంగును చాలా మంది దూరంగా ఉంచుతారు. నిజానికి రంగులన్నీ కలిస్తే పుట్టేది నలుపు రంగే. CHROMATICS (వర్ణ శాస్త్రం) ప్రకారం నలుపు హుందా తనాన్నీ, అధికారాన్నీ సూచిస్తుంది. విష్ణు మూర్తి అవతారాలయిన రాముడు, కృష్ణుడు మాత్రమే కాదు పురాణాలలో అత్యంత సౌందర్య వతులయిన ద్రౌపది, శకుంతల వంటి వారు కూడా నల్లని మేనిఛాయను కలిగి ఉన్నవారే.

అయ్యప్ప స్వామి మాల ధారణకు నలుపూ రంగే వాడతారు. కొన్ని ప్రాంతాలలో అమ్మవారికి నల్లని చీరను ధరింపజేస్తారు. ఆలయానికి వచ్చిన స్త్రీలకు నల్లని గాజులను అమ్మవారి ప్రసాదంగా ఇస్తారు.

నలుపు అశుభ సూచకంగా ఎందుకు భావిస్తారు ?

త్రిగుణాలలో ఎరుపు రాజసానికి, నీలం సాత్వికానికి ,నలుపు రంగు తామస గుణానికి ప్రతీక అని శ్రీ కృష్ణ భగవానుడే స్వయంగా భగవద్గీతలో అన్నాడు. తామసం అంటే క్రోధం. వెలుతురు జ్ఞానానికి ప్రతీక చీకటి ఆజ్ఞానానికి ప్రతీక. నలుపు రంగు చీకటికి చిహ్నం. నలుపు దుఃఖానికి, నిరసనకి ప్రతీకగా ఇప్పటికీ వాడుతున్నాము. కొన్ని ప్రాంతాలలో భర్త చనిపోయిన వారు నలుపు దుస్తులను ధరించి ఉంటారు. వారి శేష జీవితమంతా నలుపు రంగు దుస్తులనే వారు ధరిస్తారు.

నలుపు రంగు వేడిని తొందరగా గ్రహిస్తుంది. ప్రమాదాలను త్వరగా ఆకర్షిస్తుంది. అందుకే నలుపు రంగుని అశుభ సూచకంగా భావిస్తారు.

Related Posts

Signs of Evil Eye | ఈ సంకేతాలు ఉంటే మీకు నరదృష్టి ఉన్నట్టే! నివారణ ఇప్పుడే తెలుసుకోండి!

Internal Devotion | భక్తిని బయటకు తెలియజేయాల్సిన అవసరముందా?

Radha-Krishna Idol | రాధా-కృష్ణుల విగ్రహాలు సంతానప్రాప్తిని ప్రభావితం చేస్తాయా?

Garuda Purana Insights | శవాలను ఒంటరిగా ఇందుకే ఉంచరు, గరుడ పురాణం ఎం చెబుతుంది?

Key Signs of Goddess Lakshmi | మీ ఇంట్లో ఈ సంకేతాలు ఉన్నాయా? అయితే లక్ష్మి దేవి వచ్చినట్టే!

Significance of worshipping Lord Shiva via Nandi | నంది కొమ్ముల మధ్యలో నుండి శివుడిని చూడటం వెనుక కారణం.

Ayyappa Deeksha | భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త అయ్యప్ప మాల వేసుకుంటే ఏమవుతుంది?

Best Rudraksha for Students | మీ పిల్లలు చదువులో రాణించాలంటే ఈ రుద్రాక్షను ధరించండి!

 

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here