శ్రీ మహాలక్ష్మి మన ఇంట నివసించాలంటే పాటించవలసిన నియమాలు ఏమిటి?! | Whose House Does Goddess Sri Mahalakshmi Live In?

0
2754
Doing this Lakshmi will reside in your home
In Which House Sri Mahalakshmi Doesnot Live

Where Does Goddess Lakshmi Live?

2శ్రీ మహాలక్ష్మి ఏ ఇంట్లో నివసించదు (In Which House Sri Mahalakshmi Doesnot Live)

1. తెల్లవారి జామునే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకుని ఇంటిని శుభ్రం చేసుకుని సూర్యోదయానికి ముందు దీప ఆరాధన చేసి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి లక్ష్మీ దేవిని కొలిచినట్లైతే వారి పట్ల ఆ లక్ష్మీదేవి ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది.
2. ఇంటి ముందు ముగ్గు వేసిన వాకిలి గుండా లక్ష్మి దేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అందుకే తెల్లవారజామునే వాకిలి ఊడ్చి నీళ్ళు చల్లి ముగ్గులు వేసుకోవాలి.
3. లక్ష్మీదేవి అమ్మవారికి శుచి, శుభ్రత ఉన్న ఇళ్లు అంటే మక్కువ. అందువలన ఇంట్లో పాడైపోయిన వస్తువులు, విరిగి పోయిన మరియు చెడిపోయిన వస్తువులు ఉంటే ఎప్పటికప్పుడు వాటిని బయట పడేయాలి.
4. అలాగే పాడైన గడియారాలు, పగిలిన అద్దాలు, చిరిగి మరియు వాడని వస్త్రాలు ఇంటి లోపల అస్సలు ఉండకూడదు.
5. మీ ఇంటి గడప ముందు చెప్పులు పడేయకూడదు. గడప లక్ష్మీదేవి యొక్క స్వరూపం అందువలన గడప తొక్కుకుంటూ ఇంట్లోకి రావడం, గడప మీద కూర్చోవడం, గడపకు అటు ఇటు కాలు వేసి నుంచోవడం వంటి పనులు అస్సలు చేయకూడదు. పసుపు మరియు కుంకుమ గడపలకు రాయడం వలన అవి లక్ష్మి దేవికి ఆహ్వానం పలుకుతాయి. దాని కారణంగా ప్రతి శుక్రవారం నాడు గడపకు పసుపు మరియు కుంకుమతో అలంకరణ చేయాలి. మొదటి ద్వారం తలుపు పైన ఎర్రని కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేస్తే మరీ మంచిది పండితులు చెబుతున్నారు.
6. ఏ ఇంట్లో ఐతే భార్య భర్త రోజు గొడవ పడతారో, ఏ ఇంట్లో అయితే ఇల్లాలు నిరంతరం అసంతృప్తిగా ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మి దేవి రావడనికి నిరాకరిస్తుంది.
7. ఇంటి ఇల్లాలు ఏడుపు ఆ ఇంటికి మంచి కాదు. ఇంటి ఇల్లాలు గట్టిగా మాట్లాడడం, నట్టింట్లో చెడు మాటలు, చెడు తిట్లు తిట్టడం, స్నానం చేయకుండా ఇల్లంతా కలియ తిరగడం వంటివి చేయడం మంచిది కాదు.
8. ఏ ఇంట్లో అయితే అబద్ధాలు చెప్పే వాళ్ళు, నిద్రించే వారు మరియు బద్ధకస్తులు ఉంటారో, అక్కడ లక్ష్మి దేవి అమ్మవారు అస్సలు ఉండదు.
9. ఏ ఇంట్లో సంధ్య సమయంలో దీపారాధన చేసి మరియు తల్లిదండ్రులను, గురువులను,పెద్దలను గౌరవ మర్యాదలతో కొలుస్తారో వారి ఇంట లక్ష్మి దేవి కొలువై ఉంటుంది. అలాగే సాయంత్రం వేళల్లో సాంబ్రాణి ధూపం ఇంట్లో వేస్తే మరి మంచిది.
10. సత్యవాదులు మరియు మంచి ప్రవర్తన కలిగిన వారి పట్ల లక్ష్మీ దేవి ప్రసన్నురాలై ఉంటుంది.
11. బంగారం, వెండి, రత్నాలు, ముత్యాలు లో లక్ష్మి దేవి అమ్మవారు ఎక్కువగా కొలువై ఉంటుంది.
12. ఏ ఇంట్లో అయితే చిల్లర పైసలు, పువ్వులను మరియు మిగిలిన అన్నాన్ని నిర్లక్ష్యంగా పడేస్తారో వారు అమ్మవారి అనుగ్రహం పొందలేరు.
13. ఉదయం మరియు సంధ్యా సమయ నియమాలు పాటించేవారు, మంగళ శుక్ర వారాలు పూజలు చేసేవారు, లక్ష్మిని(డబ్బు) గౌరవించే వారు, అవసరాన్ని బట్టి దానం చేసిన వారు అమ్మవారికి అత్యంత ఇష్టమైన వారిగా ఉంటారు.
14. ప్రతి శుక్రవారం రోజున తల స్నానం చేసి, ఎర్రని వస్త్రాలు మరియు పువ్వులు ధరించి, లక్ష్మి పూజ చేసేవారు ఆ అమ్మవారి అనుగ్రహం పొందుతారు.

Navaratri Related Posts

హనుమన్ చాలీసాని పఠించేటప్పుడు ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు | Hanuman Chalisa Chanting Rules

ప్రతి రోజు హనుమాన్ చాలీసా చదవడం వల్ల పొందే ప్రయోజనాలు | Benefits of Reciting the Hanuman Chalisa

ఉదయం లేవగానే మొట్టమొదటగా దీనిని చూస్తే మీ జీవితమే మారిపోతుంది! Morning Astrology

పూజా చేసేటప్పుడు పుష్పాలను ఎందుకు వినియోగించాలి?! Importance of Using Flowers During Puja?

శివలింగానికి బిల్వదళాలతో అర్చన చేస్తే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా?! | Significance of the Bilwa Leaves for Worshiping Lord Shiva

పద్మిని ఏకాదశి | వ్రతం, విశిష్ఠత, పరిహారాలు | Padmini Ekadashi

Shravana Masam 2025 | శ్రావణ మాసం అంటే ఏమిటి? వచ్చే పండుగలు? ఈ మాసంలో ఏ దేవుళ్ళను పూజించాలి? ఎందుకు?

Aishwarya Deepam | ఐశ్వర్యాన్ని ఇచ్చే ఐశ్వర్య దీపం ఎలా వెలిగించాలి? విశిష్ఠత & వెలిగించే విధానం

నాగుల చవితి ప్రతి సంవత్సం వచ్చే తేదిలో మార్పులు ఎందుకు? విశిష్టత? పూజ విధానం & కావాల్సిన సామగ్రి | Nag Panchami 2023

విజయవాడ దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి 2024 మహోత్సవాలు | Vijayawada Dasara Navaratri Utsavalu 2024

శ్రీ మహా చండీ దేవి దసరా శరన్నవరాత్రి అలంకారం విశేషాలు, అవతార చరిత్ర| Sri Maha Chandi Devi

నవరాత్రి వ్రతం పూర్తయిన తర్వాత ఉద్యాపన ఏవిధంగా చేయాలి? కలశాన్ని ఏమి చేయాలి? | Devi Navaratri Udyapana Procedure

Next