ఆయుర్వేదం పరంగా స్థూలకాయం, చెడు కొలెస్టరాల్‌, మధుమేహం అదుపునకు ఏమి చెయ్యాలి ? | How to Control Obesity Bad Cholesterol and Diabetes in Telugu

4
20181
ayurveda health problems
ఆయుర్వేదం పరంగా స్థూలకాయం, చెడు కొలెస్టరాల్‌, మధుమేహం అదుపునకు ఏమి చెయ్యాలి ? | How to Control Obesity Bad Cholesterol and Diabetes in Telugu

how to control obesity bad cholesterol and diabetes

ప్రతి ఇంట్లో పోపు సామాను పెట్టెలో తప్పక కనిపించేవి మెంతులు. ప్రతి రోజూ మన ఆహారంలో ఏదో ఒక రూపంలో మెంతులను వాడుతుంటాం. మెంతులలో ఔషధగుణాలనున్నాయని చాలా మందికి తెలుసు.
మెంతులను ఆయుర్వేదంలో దీపనీ, మిత్రి అని అంటారు. హిందీలో మెథీ అని పిలుస్తారు. ముదురు పసుపు రంగులో ఉండి, గింజలలోని ఘాటైన సుగంధ తైలాలు, ఔషధ తత్వాన్ని కలిగి ఉంటాయి. గింజలలో కొన్ని రకాల రసాయనాలు ఉంటాయి. గింజల్లోని జిగురు, చెడు రుచి కూడా ఈ రసాయనాల వల్లనే. జీర్ణాశయం సంబంధ సమస్యలకు మెతులు మంచి ఔషధం. స్థూలకాయం, చెడు కొలెస్టరాల్‌, మధుమేహం అదుపునకు ఇవి దోహదపడతాయి.

Back

1. మెంతి ఆకుల ఔషధ గుణాలు #

  • ఆకులు గుండెకు, పేగులకు మంచి ఔషధం.
  • పైత్యం అధికంగా ఉన్నప్పుడు ఆకులను శుభ్రంగా కడిగి రసంగా చేసి, ఒక చెమ్చాడు తేనె కలిపి తీసుకుంటే త్వరగా తగ్గుతుంది.
  • కామెర్ల వచ్చిన వారికి, లివర్‌ సిర్రోసిస్‌ ( కాలేయ క్షయం)తో బాధపడుతున్న వారికి ఆకుల దంచి కాచిన రసం తేనె కలిపి తాగిస్తే ఆకలి పెరిగి త్వరగా కోలుకుంటారు. (అయితే డాక్టర్‌ సలహా మేరకు మందులు కూడా వాడాలి)
  • ఆకులను రసంగా చేసి రాత్రి భోజనానికి ముందు తాగితే చక్కగా నిద్రపడుతుంది.
  • ఆకుల రసాన్ని పిప్పితో సహా నిమ్మకాయ పిండి భోజనానికి ముందు తాగితే స్థూలకాయులు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు కొంత గుణం కనిపిస్తుంది.
  • ఆకును దంచి పేస్ట్‌గా చేసి తలకు రాస్తే చుండ్రు, వెంట్రుకలు రాలడం తగ్గుతాయి. వెంట్రుకలు నిగనిగలాడతాయి.
  • ఆకులను దంచి పేస్ట్‌గా ముఖానికి రాస్తే ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. పొడి బారడడం తగ్గుతుంది.
  • కంటి నుండి అదే పనిగా నీరు కారతుంటే ఆకులను శుభ్రమైన వస్త్రంతో కట్టి రాత్రి పూట కంటికి కట్టాలి.
Promoted Content
Back

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here