
వైశాఖ మాసం ప్రాముఖ్యత ఏమిటో తెలుసా? | Vaishakha Masam Importance in Telugu
4. వైశాఖ మాసంలో ఏ దానం చేస్తే ఏమి లభిస్తుంది?
మామిడిపళ్ళు దానం చేస్తే పితృదేవతలకు పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. పానకం దానం చేస్తే పితృదేవతలకు వంద సార్లు గయలో పిండప్రదానం చేసిన ఫలం దక్కుతుంది. దోస, బెల్లం, చెరుకు దానం చేయడం వలన సర్వపాపాలు నశిస్తాయి. వస్త్రాలు దానం చేస్తే దీర్ఘాయుష్షును పొందుతారు. కుంకుమ దానం చేయడం వలన స్త్రీలకు పూర్ణ ఆయుష్షు కలిగిన భర్త లభిస్తాడు.
గంధం దానం చేస్తే ఆకస్మిక ప్రమాదాలు తప్పుతాయి. తాంబూల దానం అంతులేని సంపదను, ఆధిపత్యాన్ని ఇస్తుంది. కొబ్బరికాయను దానం చేస్తే ఏడు తరాల పితృదేవతలను నరకభాదల నుండి విముక్తులను చేసినవారిమవుతాము. సరస్వతీదేవి అనుగ్రహం సంపాదించాలంటే మజ్జిగ దానం చెయ్యాలి. నరకబాధలనుంచీ పాదరక్షల దానం కాపాడుతుంది. సమస్త దోషాలు నివారింపబడి కష్టాలు, మృత్యుబాధ నుంచీ ఉపశమనం లభించాలంటే గొడుగును దానం చెయ్యాలి. బియ్యం దానం చేయడం వలన యజ్ఞ ఫలం లభిస్తుంది.
ఆవునెయ్యి దానం చేస్తే అశ్వమేథయాగం చేసిన పుణ్యం లభిస్తుంది. అన్నదానం వలన సమస్త దేవతల ఆశీస్సులు పొందుతారు.
అత్యంత పవిత్రమైన ఈ వైశాఖ మాసంలో శక్తి కొలది దానం చేసి మీ జన్మను తరింపజేసుకోండి.
తెలుగు నెలల పేర్లు ఏ విధంగా నిర్ణయించారు ..? How are Decide Telugu Months Names in Telugu ?