నిజాన్ని ఎలా చెప్పాలి? ఎలా చెప్పకూడదు? మీకు తెలుసా? | How to Tell Truth and How not to in Telugu

0
15209
truth
how to tell truth and how not to

How to Tell Truth and How not To 

1. నిజాన్ని ఎలా చెప్పాలి? ఎలా చెప్పకూడదు? మీకు తెలుసా?

సత్యాన్ని గురించి మన శాస్త్రాలు ఏం చెప్పాయి?

మన శాస్త్రాలు సర్వజ్ఞాన సంపన్నమైనవి. మానవ జీవితానికి కావలసిన బహువిధ విషయాలన్నీ కొన్ని వేల సంవత్సరాలనుంచీ మనకు బోధిస్తూ ఉన్నాయి. ఎన్ని కాలాలు మారినా యుగాలు గడిచిపోయినా మన పూర్వీకులు చెప్పిన కొన్ని విషయాలు అన్ని స్థలకాలాలకూ చక్కగా సరిపోతాయి. ఏ సమయములోనైనా నిజం చెప్పడం అనివార్యం. అది ధర్మం. నిజం కఠినంగా ఉంటుంది. కానీ నిజాన్నే చెప్పాలి. కఠినమైన నిజాన్ని చెప్పగలిగే నేర్పు మనమందరం కలిగి ఉండాలి. అబద్ధం అందంగా ఉంటుంది. కానీ అపరిమితమైన నష్టం కలిగిస్తుంది. మన పురాణాలు ఇటువంటి విషయాలను అత్యంత సౌమ్యంగా చెప్పాయి. దీనినే సనాతన ధర్మము అని అంటారు.

నిజాన్ని ఎలా చెప్పాలంటే?

సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్ సత్యమప్రియం
ప్రియం చ నానృతం బ్రూయాత్ ఏష ధర్మస్సనాతనః

భావం: నిజం చెప్పు. ఇతరులకు వినసొంపుగా సాంత్వన కలిగించే విధంగా నిజాన్ని చెప్పు. అత్యంత కఠినంగా ఉన్న నిజాన్ని చెప్పకు. అందరికీ ఆనందం కలిగిస్తుంది కదా అని అబద్ధాన్ని చెప్పకు. ఇదే సనాతన ధర్మము.

కాబట్టి నిజాన్ని ఇతరులకు ఆనందాన్ని కలిగించే విధంగానే చెప్పాలి. ఎంత ఆనందాన్ని కలిగించినా నష్టం కలిగించేదయితే అబద్ధాన్ని చెప్పకూడదు.

ఈ విధంగా నిజం చెప్పడంలో ధర్మాన్ని పాటిస్తే అందరికీ శుభమే జరుగుతుంది.

జై మహా కాళి _/\_

Related Posts 

 

పురాణాల ప్రకారం ఈ సూత్రాలు పాటిస్తే ఆయురారోగ్యాలు పక్కా!16 Sutras for Good Sleep & Health

తులసి చెట్టుకి నీరు పోసేటప్పుడు పాటించవలసిన ముఖ్య నిబంధనలు!? | Tulsi Plant Rules

ఆలయానికి ఏ వస్తువులను దానం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి?! | Donation Results in Temple

ఇంట్లో ఏ జంతువుల విగ్రహాలను పెట్టుకోవాలి? వాటి ఫలితాలు ఏమిటి? Which Animal Idols can we keep House?

ఇలా చేస్తే 7 జన్మాల పాపాలు పోయి శాశ్వతమైన పుణ్యం లభిస్తుంది! | Hindu Beliefs

దేవుడికి ఏ పండ్లు నైవేద్యంగా పెడితే ఎలాంటి ఫలితం వస్తుంది? | Which Fruits are Offered to the God

నవగ్రహాలకు అస్సలు ఇష్టం లేని & చేయకుడని పనులు | The Things That Navagrahas Do Not Like

శ్రీవారి ఆలయ గోడలపై ఉండే శాసనాల రహస్యాలు ఏమిటి?! | Behind the Story of Tirumala Shasanas

 

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here