
How to Fasting on Shivaratri?
1శివరాత్రి ఉపవాసం పద్దతి
శివరాత్రి నాడు ఉపవాసం ఏవిధంగా చేస్తే విశేష ఫలితాలను పొందవచ్చు? అసలు శివరాత్రినాడు తప్పని సరిగా ఉపవసించాలా..? ఉపవాసం చేయలేకపోతే ఏమైనా అరిష్టం జరుగుతుందా..? ఈ ప్రశ్నలు ఎంతో మందిని వేధిస్తుంటాయి.
మహా శివరాత్రి పర్వదినాన అతిముఖ్యమైనవి అభిషేకం, ఉపవాసం, జాగరణ. శివ రాత్రి విశేషం ఏమిటంటే, శివం అంటే శుభం అని అర్థం. రాత్రి అనే పదం రా అనే ధాతువు నుండీ వచ్చింది. రా అంటే దానార్ధరకమైనది. శుభాన్నీ సుఖాన్నీ ప్రదానం చేసేది శివరాత్రి. శివరాత్రినాడు ఉపవాసవ్రతం చేస్తే వారికి అశ్వ మేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని శివపురాణం లో చెప్పబడింది. శివరాత్రినాడు ఉపవాస జాగరణలు చేసినవారు అఖండ ఐశ్వర్యాలను పొంది, జన్మాంతం లో జీవన్ముక్తులౌతారని స్కాంద పురాణం చెబుతోంది. తనకు ఏపూజ చేసినా చేయకున్నా కేవలం ఉపవాసం చేయడం వలన ఆ ఫలితాలన్నీ పొందగలరని మహాదేవుడే పార్వతితో అంటాడు.
శివంతు పూజయత్వా యోజా గర్తిచ చతుర్దిశీం!
మాతుః పయోధర రసం నపిబేత్ స కదాచన!!
శివరాత్రి నాడు అంటే మాఘ కృష్ణ చతుర్థినాడు ఎవరైతే శివపూజ చేస్తారో, వారు మరొకసారి తల్లి పాలను తాగ లేరని అర్థం. అంటే వారు శివపూజా ఫలం వల్ల జన్మాంతం లో శివైక్యం పొంది మళ్ళీ జన్మ ఉండదని భావం.
శివరాత్రి ఉపవాస విశిష్టత (The Significance of Shivratri Fasting) :
ఉప సమీపే యో వాసః జీవాత్మ పరమాత్మనోః
ఉపవాసః సవిఘ్నేయ సర్వభోగ వసర్జిత్ ||
వరాహోపనిషత్తు లో గల ఈ శ్లోకం ఉపవాసానికి అర్థాన్నిచెబుతోంది. జీవుడు పరమాత్ముని సామీప్యం లో వశించడమే ఉపవాసం. ఎటువంటి ఇతరమైన ఆలోచనలూ చేయకుండా, కేవల భాగవదారాధనే ఉపవాసం అంటే. భవిష్యపురాణం లోనూ ఇదే అభిప్రాయం చెప్పబడింది.
ఉపవాసం ఎలా చేయాలి..? (Shivratri Fasting Procedure)
సూర్యోదయానికి ముందే లేచి అభ్యంగన స్నానాన్ని చేసి, శివుని ధ్యానించాలి. అన్నం, పప్పు దినుసుల తో చేసిన పదార్థాలు తినకూడదు. సముద్రపు ఉప్పు కాకుండా నల్ల ఉప్పు లేదా సైంధవ లవణాన్ని వాడాలి. పాలూ పండ్లూ తినవచ్చు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఆహారం మీదకి దృష్టి పెట్టకుండా భగవంతుని ధ్యానించడమే ఉపవాస లక్ష్యం. ఆహారం మన ఆలోచనలను నియంత్రిస్తుంది. కాబట్టి సాత్వికాహారమైన పాలు, పళ్లని స్వీకరించాలి. అన్నం పప్పులలో ఉండే ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు అరగడానికి జరిగే ప్రక్రియ వలన మెదడుకు రక్తప్రసరణ తగ్గుతుంది. శరీరం భుక్తాయాసం తో మందకొడిగా తయారవుతుంది. అందుకని అన్నం పప్పులు వంటి ఆహార పదార్థాలని ఉపవాస దీక్షా సమయం లో తినకూడదు.
ఆరోగ్యం సరిగా లేనివారు, వృద్ధులు, బాలింతలు, గర్భవతులు, చిన్నపిల్లలు ఉపవాస దీక్షను చేయవలసిన నియమం లేదు. “శరీరమాద్యం ఖలు ధర్మసాధనం” అన్నారు పెద్దలు. అంటే ఎటువంటి ధర్మకార్యాలకైనా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడం ప్రాథమిక అవసరం.
శివకృపా కటాక్ష సిద్ధిరస్తు..!
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
Follow HariOme WhatsApp Channel
Related Posts
శివరాత్రి రోజు చదవవలసిన కథ | Story to Read on Shivaratri in Telugu
What are the Benefits of Shivaratri Fasting | What is the Right Way to do it?
Sri Siva Sahasranama Stotram Uttara Peetika | శ్రీ శివ సహస్రనామ స్తోత్రం ఉత్తర పీఠిక
Sri Siva Sahasranama Stotram Poorva Peetika | శ్రీ శివ సహస్రనామ స్తోత్రం పూర్వపీఠిక
Really it is important page…its useful lines for everyone who really belive lord shiva