Hanuman Photo Placement Tips | వాస్తు ప్రకారం, హనుమంతుని ఫోటో ఇంట్లో ఏ దిశలో పెట్టాలి?

0
80
Tips for placing a Hanuman photo at home
Hanuman photo placement tips

Important things to know when placing a photo of Hanuman in your home

1ఇంట్లో హనుమాన్ ఫోటో పెట్టేటప్పుడు తెలుసుకోవాల్సిన విషయాలు:

పురాణాల ప్రకారం, ఆంజనేయుడు, శ్రీరామ భక్తుడు, వాయు పుత్రుడు, మారుతీ, భజరంగబలి పేర్లతో పిలువబడే హనుమంతుడిని ధైర్యం, శక్తికి ప్రతీకగా భావిస్తారు. బ్రహ్మచారిగా ఉండే ఈ అభయ ఆంజనేయస్వామిని ఆరాధించేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. హనుమంతుడిని పూజిచేందుకు మంగళవారం, శనివారాలను ప్రత్యేకమైనవిగా పరిగణిస్తారు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో హనుమంతుడిని పూజిస్తారో వారి కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయని పండితులు చెబుతారు. ఇదిలా ఉండగా మనలో దాదాపు అందరి ఇళ్లలో పూజ గది అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే పూజ చేసేటప్పుడు కొందరు దేవుని ఫోటోలను వాస్తు ప్రకారం కాకుండా ఎలా పడితే అలా ఎక్కడ పడితే అక్కడ పెడుతుంటారు. ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తులు బయటకు వెళ్లకుండా ఇంట్లోని వారికి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. అందులోనూ ఆంజనేయ స్వామి ఫోటో ఎక్కడ పెట్టాలనే విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఈ సందర్భంగా మన ఇంట్లో ఉండే హనుమంతుడి ఫోటోలు ఎలా ఉండాలి? ఎటు వైపు ఉంచాలి? ఎలాంటి భంగిమలో ఉండే ఆంజనేయుడి ఫోటోలతో శుభ ఫలితాలొస్తాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

దక్షిణ దిశలో :

వాస్తు శాస్త్రం ప్రకారం, హనుమంతుని ఫోటోను ఎల్లప్పుడూ దక్షిణ దిశలోనే ఉంచాలి. అది కూడా కూర్చున్న భంగిమలో, ఎరుపు రంగులో ఉండే ఫోటోనే ఉంచాలి. దక్షిణాభిముఖంగా ఉన్న హనుమంతుని చిత్రం మరింత పవిత్రమైనది ఎందుకంటే ఆంజనేయుడు ఈ దిశలోనే తన ప్రభావాన్ని ఎక్కువగా చూపాడని పండితులు చెబుతారు. ఈ దిశలో హనుమంతుని ఫోటో పెట్టడం వల్ల దుష్టశక్తులన్నీ తొలగిపోతాయట. మీ ఇంట్లో ఆనందం, ఐశ్వర్యం పెరుగుతాయి.

ఉత్తరం వైపు చూస్తున్నట్టు :

మీ ఇంట్లో ఉండే హనుమంతుని ఫోటోలో ఆంజనేయుడు ఉత్తరం వైపు చూస్తున్నట్టు ఉండేలా చూసుకోవాలి. ఉత్తరముఖి హనుమంతుని రూపంలో ఉండే ఈ రూపాన్ని పూజించడం వల్ల సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీదేవి కూడా సంతోషిస్తుంది.

పంచముఖి హనుమాన్ :

వాస్తు ప్రకారం, పంచముఖి హనుమంతుని ఫోటో ఉండే ఇంట్లో ఆటంకాలన్నీ తొలగిపోతాయి. సంపద కూడా పెరుగుతుంది. మీ కుటుంబంలోని ఆటంకాలు, వ్యాధులు వంటివి దూరమవుతాయి. శత్రువుల బాధ తొలగిపోతుంది. పంచముఖి హనుమంతుని ఫోటోను ఇంట్లోని ప్రధాన ద్వారం పైన ఉంచొచ్చు లేదా అందరికీ కనిపించే ప్రదేశంలో పెట్టొచ్చు. ఇలా చేయడం వల్ల ఎలాంటి దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించవు.

శ్రీరాముడిని నమస్కరిస్తూ :

మీ ఇంటికి అతిథులు వచ్చి కూర్చునే గదిలో శ్రీరాముడిని నమస్కరిస్తున్న ఫోటోను ఉంచాలి. ఈ చిత్రంలో చూపినట్టు శ్రీరాముని పాదాల దగ్గర హనుమంతుడు కూర్చున్న ఫోటోను ఉంచాలి లేదా శ్రీరాముని భజన చేస్తున్న హనుమంతుని ఫోటో ఉంచొచ్చు. ఇలా చేయడం వల మీ జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి.

పర్వతాన్ని ఎత్తుతున్నట్టు :

మీ ఇంట్లో హనుమంతుని ఫోటోలో పర్వతాన్ని ఎత్తుకెళ్తున్నట్టు ఉండే ఫోటోను ఉంచడం వల్ల ధైర్యం, బలం, విశ్వాసం, బాధ్యతాయుతమైన భావాన్ని పెంపొందించుకుంటారు. ఈ భంగిమలోని ఫోటో వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురైనా అస్సలు భయపడరు. ఎంత పెద్ద సమస్యలకైనా పరిష్కారం కనుగొంటారు. వీర హనుమంతుని పూజించడం ద్వారా భక్తుల వైద్యం కూడా పెరుగుతుంది.

శ్రీరాముని భజన చేస్తూ :

మీ ఇంట్లో ఉండే హనుమంతుని ఫోటో శ్రీరాముని భజన చేస్తున్న భంగిలో ఉంటే మీకు భక్తి, విశ్వాసం పట్ల ఆసక్తి పెరుగుతుంది. వీటి కారణంగా మీరు జీవితంలో విజయాలను సాధిస్తారు. అంతేకాదు మీకు ఏకాగ్రత శక్తి కూడా పెరుగుతుంది.

తెల్లని రంగులో :

వాస్తు ప్రకారం, ఉద్యోగంలో ప్రమోషన్ పొందడానికి తెల్లని రూపంలో ఉండే హనుమంతుని ఫోటోను ఉంచాలి.

రాముడిని కౌగిలించుకుంటు : 

హనుమంతుడిని రాముడు కౌగిలించుకుంటున్న ఫోటో ఇంట్లో ఉండటం వల్ల కుటుంబంలో ఐక్యత, సమాజంలో స్నేహపూర్వక స్వభావాన్ని కొనసాగించే అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఇది మీ ప్రేమ భావనను పెంచుతుంది.

ధ్యానం చేస్తున్న హనుమాన్ :

మీ ఇంట్లో కళ్లు మూసుకుని ధ్యానం చేస్తున్న భంగిమలో ఉండే హనుమంతుని ఫోటో ఉంటే, మీ మనసులో శాంతి, ధ్యానం కూడా మెరుగవుతాయి. మీరు ధ్యానం, మోక్షం వంటి కోరికలు ఏదైనా పూర్తి కావాలంటే ఈ ఫోటోను మీ ఇంట్లో ఉంచుకోవాలి.

ఆశీర్వదిస్తున్న ఆంజనేయుడు :

హనుమంతుడు కుడి మోకాలిపై కూర్చొని ఆశీర్వదిస్తున్న ఫోటో మీ ఇంట్లో ఉంటే సంక్షోభాలను సులభంగా అధిగమిస్తారు. ఈ భంగిమలో ఉండే హనుమంతుని ఫోటో దక్షిణ దిశలో ఉంచాలి.

 

ఇలాంటి మరెన్నో విషయాలు  వ్యక్తిగతంగా పొందటానికి మరియు మన సంస్కృతి సంప్రదాయాలు తెలుసుకోవటానికి ఇప్పుడే 9059-777-789 కి “హరిఓం” అని మెసేజ్ చేయండి.

Related Posts

Lord Hanuman | హనుమంతుడి గురించి చాల మందికి తెలియని ఆశ్చర్యకరమైన రహస్యాలు.

Panchamukha Hanuman | పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోను ఇంట్లో ఉంచితే కలిగే ఫలితాలు & పంచముఖాల వివరణ

ఆంజనేయ స్వామి వారు బ్రహ్మచారి కాదా? మరీ ఎవరిని వివాహం చేసుకున్నారు? | Was Hanuman Married as per Hindu Mythology?

Hanuman Birth Place | హనుమంతుని జన్మస్థలం తిరుమలే, టీటీడీ కీలకమైన ప్రకటన ?

Hanuman And Shiva | హనుమాన్, శివుడు ఒకే చోట! అష్ట ఐశ్వర్యాలతో పాటు కష్టాలు తీరే అద్భుత క్షేత్రం!