సుబ్రహ్మణ్య షష్టి ప్రత్యక వ్యాసం (Subrahmanya Shashti Personal Essay)
బ్రహ్మ శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు రచించిన (గురుస్వరూపుడు – సుబ్రహ్మణ్యుడు).
1. సుబ్రహ్మణ్యుడు ఎవరు? (Who is Subrahmanya?)
పరమపురుషుడు – శివుడు (లేదా విష్ణువు), అవ్యక్త శక్తి – ఉమాదేవి (లేదా లక్ష్మి). వీరిరువురి సంయోగమైన సమన్వయమూర్తి కుమారస్వామి.
ఈయననే స్కందుడు, సుబ్రహ్మణ్యుడు, షణ్ముఖుడు మొదలైన పేర్లతో శాస్త్రాలు సన్నుతించాయీ.
కుమారస్వామిని అర్చించడం – పార్వతీ పరమేశ్వరులను (లక్ష్మీనారాయణులను) సమగ్రంగా ఆరాధించడమే.
బ్రహ్మచేత నిర్మితమైన అగ్నిమయదివ్యశర వణం (రెల్లుతుప్ప)లో శివతేజం షణ్ముఖాకృతి ధరించిందని గాధ. కుమారస్వామి యొక్క అగ్నిమయ శివశక్తి రూపాన్ని స్పష్టం చేసే గాథల్లో ఇది ఒకటి.
కాలకాలుడు శంకరుడు. ‘కాలాగ్ని’ అని పిలువబడే ఈ అఖండ రుద్రమూర్తి యొక్క తేజస్సే సంవత్సరాగ్ని ఈ సంవత్సరాన్ని ఆధారం చేసుకొనే కాలగణన సాగుతుంది. ఈ సంవత్సరాగ్నికి సంకేతమే – పన్నెండు చేతులు, ఆరు ముఖాలు.
ద్వాదశ హస్తాలూ పన్నెండు మాసాలకు, ఆరు ముఖాలూ ఆరు ఋతువులకూ సంకేతాలు.
ఇక స్వామి కూర్చున్న మయూరం ‘చిత్రాగ్ని’ అనబడే అగ్నితత్వమే. వర్ణాలకు సంకేతమిది.
అగ్ని అమృతాల సమైక్యమూర్తి (అగ్నీసోమాత్మకం) సుబ్రహ్మణ్యుడు.
స్వామి చేతిలో ఉన్న శక్తి ఆయుధం, అమ్మవారు ఇచ్చినదే.
‘శివజజ్ఞాన ప్రదాయిని’ అయిన శ్రీమాత ఇచ్చిన ఆ శక్తి భల్లం – జ్ఞానం. “అహంకారః స్కందః’ అని చెప్పబడ్డ ప్రకారం… సృష్టిలోనూ, ప్రతి జీవునిలోనూ ‘నేను’ అనే భావనే స్కందుడు. మనస్సుతో కలిపి అయిదు జ్ఞానేంద్రియాలూ ఉన్న ‘అహంకారమే’ కుమారస్వామి. ఇచ్చా, జ్ఞాన, క్రియ — ఈ మూడు ఈ ఆరు ముఖాలతో సాగుతున్నాయి.
ఇచ్చా, జ్ఞాన, క్రియా రూప మహాశక్తిధరం భజే |
శివశక్తి జ్ఞానయోగం జ్ఞానశక్తి స్వరూపకమ్ ||
(శివపురాణం)
కవిత్వ సంగీతాది విద్యల్లో కూడా అగ్రగణ్యుడు స్కందుడు.
సుబ్రహ్మణ్యుని కవిరూపంగా వర్ణించాయి పురాణాలు. ‘పుట్టన్ బుట్ట శరంబునన్ మొలవ…’ అనే పద్యంలో స్వామిని కవిగా పేర్కొన్నాడు పోతన.
మహామహిమాన్వితమైన షట్కోణం* షణ్ముఖునికి ప్రతీక.
అన్నికోణాలనుండి సమగ్రంగా విషయ జ్ఞానం సాధించగలిగే నిశితమైన బహుముఖప్రజ్ఞే ‘షణ్ముఖీ ప్రతీభ’.