ఈ చెట్టు మీ గుండెను కాపాడుతుంది | Guardian of Heart

0
12313

plant for heart healthస్థూలకాయం వల్ల, లేదా అనేక ఇతర కారణాలవల్ల గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. గుండెజబ్బులకు రక్షణనిచ్చే ఒక అద్భుతమైన చెట్టును గురించి తెలుసుకుందాం.

తెల్ల మద్ది చెట్టును ‘అర్జున వృక్షం’ అనీ, ‘గుండెకు రక్షకుడు’ అనీ అంటారు. టర్మినేలియా అర్జునా అని ఈ చెట్టు శాస్త్రీయ నామం.

ఈ చెట్టును గురించి క్రీ.పూ. 7 వ శతాబ్దానికి చెందిన వాగ్భటుడనే వైద్యుడు ప్రస్తావించాడు. ఈ చెట్టు బెరడుపాలను కషాయం చేసి వాడటం వలన హృద్రోగాలు తొలగుతాయని అష్టాంగ హృదయమనే గ్రంథం లో చెప్పబడింది.

అర్జునుడు ఏవిధంగా అయితే సమర్థ వంతంగా శత్రువులనుండీ రక్షిస్తాడో అలాగే ఈ వృక్షం కూడా సమర్థవంతంగా గుండె జబ్బులనుండీ రక్షిస్తుంది. అందుకనే ఈ చెట్టుకి అర్జున వృక్షమని పేరు.

అంతేకాదు పైపూతగా వాడటం వలన చర్మ రోగాలు, పుండ్లు నయమవుతాయి. నదులు ప్రవహించే ప్రాంతాలలో ఈ చెట్లు ఎక్కువగా పెరుగుతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here