
2. బ్రహ్మవాదిని గార్గి
వేదవేదాంగ పారంగతులైన విదుషీమణులలో ముఖ్యమైన స్త్రీ గార్గి. ఆమె సృష్టి మూలానికి సంబంధించిన ఎన్నో పరిప్రశ్నలను సంధించి అనేకమంది పండితులను, ఋషులను నిరుత్తరులను చేసిన విదూషీమణి.
వచక్ను మహర్షి కుమార్తె అయిన గార్గి పురాణ ప్రసిద్ధమైన బ్రహ్మ వాదిని. తండ్రి విద్యను పుణికి పుచ్చుకున్న అపర సరస్వతి. రామాయణం లో ఈమె గురించిన ప్రస్తావన ఉంటుంది.
విదేహ రాజైన జనకుడు జరిపిన ‘బ్రహ్మ యజ్ఞ’ మనే ఆధ్యాత్మిక గోష్ఠి కి ఆమె హాజరైంది. అక్కడ మహా పండితునిగా, జ్ఞానిగా పేరుగాంచిన యజ్ఞ్య వల్క్య మహర్షిని ఓడించింది.
ఆమె ప్రశ్నల పరంపరకు సమాధానమివ్వలేక “మరొక్క ప్రశ్నవేసినా నీ తల వేయి వక్కలవుతుందని” యజ్ఞ్య వల్క్యుడు ఆమెను శపించి నిలువరించాల్సి వచ్చింది.
ఆమెకు సమాధానం చెప్పడం తన వల్ల కాదని మహర్షి స్వయంగా నిరూపించాడు.
పురాణ స్త్రీలనుంచీ మనం విజ్ఞానాన్ని, ధైర్యాన్నీ , ఆత్మ స్థైర్యాన్నీ నేర్చుకోవాలి.