ఈ ఘాట్లో స్నానం చేస్తే బ్రహ్మ దోషంతో పాటు అనేక జన్మల పాపాలు తొలగిపోతాయి! | Haridwar Neel-Ghat

0
2302
Haridwar Neel-Ghat
Haridwar Neel-Ghat

Haridwar Neel-Ghat

2హరిద్వార్ నీల్-ఘాట్ వివరాలు (Details of Haridwar Neel-Ghat)

హరిద్వార్‌లోని పురాతన ఘాట్లో స్నానం చేయడం ద్వారా జనన మరణ చక్రం నుంచి విముక్తి లభిస్తుందట. మహాకుంభమేళలో విదేశాల నుంచి కూడ లక్షలాది మంది సాధువులు, ప్రజలు గంగా నదిలో స్నానం ఆచరిస్తారు. హరిద్వార్‌లోని నీల్ ఘాట్ పురాతన గంగా ఘాట్‌లలో ఒకటి. ఇది నీల్ధార ఒడ్డున నిర్మించబడింది. ఇక్కడ గంగానదిలో స్నానం చేయడం, పూజించడం ద్వారా మోక్షం లభిస్తుందని హిందు మత విశ్వాసం. ఈ ఘాట్ గురుంచి మన హిందు పురణాలలో కూడా వివరించబడింది. నీల్ ఘాట్ పై సుప్రసిద్ధ దేవాలయాలు నిర్మించబడ్డాయి అవే దక్షిణ కాళీ సిద్ధ పీఠ్ ఆలయం, చండీ దేవి ఆలయం, గౌరీ శంకర్ మహాదేవ్ ఆలయం, నీలేశ్వర్ మహాదేవ్ మొదలైన ఆలయాలు. నీల్ ఘాట్ పురాతన గంగా ఘాట్‌లుగా పరిగణించబడే ఐదు గంగా ఘాట్‌లలో కూడా చేర్చబడింది.