
Ganga Pushkaralu 2023
4పుష్కరుడు కథ (Story of Pushkarudu)
పుష్కరుడు ఒక బ్రాహ్మణుడు. బ్రహ్మ దేవుడు పుష్కరుడు సృష్టికర్త. పుష్కరుడు మహా శివుడి కోసం తపస్సు చేశాడు అని పురాణాల్లో ఉంది. పుష్కరుని తీర్థ రాజు అని పిలుస్తారు. సామాన్యులు అందరూ నది స్నానం చేయడం వల్ల ఆ నది పవిత్రత క్షీణించడానికి గమనించిన పుష్కరుడు చాలా చింతించేవాడు. దాని కోసం పరమ శివుడి కోసం తపస్సు చేసి నదుల దోషములన్నిటిని ప్రక్షాళన చేసే మార్గాన్ని అర్థించాడు. అతని తప్పసుకి మెచ్చి శివుడు పుష్కరుడుకి తను కోరిన వరం ఇస్తాడు. శివుని వరం వల్ల పుష్కరుడు పవిత్రుడు మరియు అనంతమైన శక్తి ప్రాప్తించింది అవుతారు. పుష్కరుడు ఆ నదిలోకి ప్రవేశిస్తాడో ఆ నది పవిత్రం అవుతుంది.
నదులలోని పాపాలన్నింటినీ తొలగించ గలగే వరం లభించింది. ఆ కారణం వల్ల 12 నదులన్నీ తమలో పవిత్రత నింపాలి అని పుష్కరుడు కోరుకుంటాడు. అటుపిమ్మట పన్నెండు పుణ్య నదులలో పుష్కరుడు ఉండేలా ఏర్పాటు అయింది. బృహస్పతి యొక్క సంచారాన్ని బట్టీ పుష్కరాలు నిర్ణయించబడతాయి. అంటే మిథున రాశి , వృషభ రాశి, మేష రాశి, కన్య రాశి ఎలా మోతం అన్నీ రాశిలో ఎప్పుడైతే గురుడు సంచరిస్తుంటాడో, అప్పుడే పుష్కరుడు నదులలో నివసించేలా చేసుకుంటాడు. పుష్కరుడు ప్రవేశిస్తుంచిన మొదటి 12 రోజులను పుష్కరాలు అని అంటారు. ఒక సంవత్సరం పాటు ఆ నదిలో ఉంటారు కానీ ఆది పుష్కరం ముగిసిన తర్వాత మధ్యాహ్నం సమయంలో ఒక్క 2 ముహూర్త కాలంలో మాత్రమే ఉంటారు.







