
First Rock Temple Modeled on Bhadrachal Ram Temple in America
1అమెరికాలో భద్రాచల రామాలయాన్ని పోలిన నమూనాతో తొలి శిలా ఆలయ నిర్మాణం
దక్షిణ అయోద్యగా పిలవబడే ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం. శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ నమూనాతో అమెరికాలోని అట్లాంటాలో ఇలాంటి ఆలయాన్ని నిర్మించనున్నారు. అమెరికాలోని ప్రవాస భరతీయులే నడుంకట్టారు. ఈ ఆలయం పూర్తిగా రాళ్ళతో కట్టనున్నట్లు అందులోను ఇదే అమెరికాలోనే తొలి శిలా ఆలయం కావడం విషేశం.
ఈ ఆలయాన్ని 3 దశల్లో సుమారు 30 మిలియన్ డాలర్లతో నిర్మించనున్నారు. ఈ అలయానికి సంభందించిన శిలలు, శిల్పకళాకృతులను చెక్కే పనులను ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని వాణి శిల్పశాలలో జరుగుతున్నాయి. ఈ నిర్మాణ భాద్యతలను యాదాద్రి ఆలయ నిర్మాణంలో భాగస్వాములైన శిల్పులకే అప్పగించడం విషేశం. ఇప్పటికే శిల్పలను చేక్కే పనులు దాదాపు 50 శాతం అయిపొయాయి. మిగాతా పనులు జూలైలోపు పూర్తి అయిపోతాయి. 2024 జనవరి నాటికి శిలా నిర్మిత ఆలయ పనులు, విగ్రహాల ప్రతిష్ఠ పూర్తి చేయాలనే సంకల్పంతో పనులు జరుగుతున్నాయి.
విగ్రహాలకు భద్రాద్రి క్షేత్రంలో ప్రత్యేక పూజలు
ఈ ఆలయంలో ఏర్పాటు చేసే శ్రీ సీతారాములు, లక్ష్మణస్వామి, ఆంజనేయస్వామి విగ్రహాలకు భద్రాద్రి క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రాద్రి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన పర్ణశాల క్షేత్రంలోని గోదావరిలో ఆ విగ్రహాలకు ఒక రోజు పాటు జలాధివాసం నిర్వహించారు. అనంతరం విగ్రహాలకు ధాన్యాదివాసాన్ని నిర్వహించారు. మొత్తం 42 రోజుల పాటు ఆ విగ్రహాలను ధాన్యంలో ఉంచుతారు. ఈ విగ్రహాలు కూడ అచ్చం భద్రాద్రి ఆలయంలో ఉండే విగ్రహాలలాగే ఉంటాయి.
Related Posts
తిరుమలలో ఎంత రద్దీ ఉన్నా శ్రీవారి శీగ్ర దర్శనం ఈ ప్రత్యేక ప్యాకేజీతోనే సాధ్యం | IRCTC Tirupati Tour
టీటీడీ పేరుతో మరో నకిలీ వెబ్సైట్, ఇదే అధికారిక వెబ్సైట్ | TTD Official Website vs Fake Websites
శ్రీవారి భక్తులకు తిరుమల కొండపై మరో ఉచితం | TTD Another Free Seva to Devotees
తిరుమలకు వెళ్ళే దారులు? గతంలో ఏడుకొండలు ఎలా ఎక్కేవారు..? | Tirumala Routes