
Where the holy Hamsaladeevi located. what is the history?
2. హంసలదీవి ప్రత్యేకత ఏమిటి?
పూర్వకాలంలో కలుషహారిణి అయిన గంగామాత తనలో స్నానం చేసిన వారందరి పాపాలను నశింపచేస్తుండటం వలన తనకు అంటిన పాప పంకిలాన్ని పోగొట్టుకొనే మార్గం చెప్పవలసిందిగా శ్రీహరిని ప్రార్ధించింది.
అప్పుడు శ్రీ మహావిష్ణువు తన అంశతో ఉద్భవించిన కృష్ణానది సముద్రంలో కలిసే సంగమ ప్రదేశంలో కాకి రూపంలో వెళ్లి స్నానం చెయ్యి. నీపాప తమస్సు పోయి హంసవలె మారతావని వరమిచ్చాడు. గంగాదేవి తన యందలి పాప తమస్సును కాకివలె ధరించి కృష్ణా సాగరసంగమ పవిత్ర ప్రదేశంలో మునిగింది.
పాపప్రక్షాళన పొంది హంస వలె స్వఛ్ఛతను పొందింది. అంతటి మహిమ గల క్షేత్రం ఈ హంసల దీవి. ఎందరో మునులు ఈ ప్రాంతంలో తపస్సు చేసుకుంటూ సంచరించేవారని, అటువంటి పరమ హంసలు సంచరించిన ప్రదేశం కాబట్టే ఈ ప్రాంతాన్ని హంసలదీవి అన్నారని ఒక కథనం.
Promoted Content
Nice