
వివిధ ప్రాంతాల్లో దీపావళి వేడుకలు | Diwali Celebration in Different Region in Telugu
భారతదేశంలో ప్రజలంతా ఆనందోత్సాహాలతో జరుపుకొనే పండుగ దీపావళి. భారతీయ పండుగలన్నీ ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ఆచారవ్యవహారాలన్నిటి కలయికతో కూడుకొని ఉంటాయి. అందుకే పండుగలను, పర్వదినాలను భక్తి శ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు.
దూరతీరాల్లో ఉన్న కుటుంబంలోని వ్యక్తులందరూ కలసి ఒకేచోట సుఖ సంతోషాలతో, హాయిగా గడపటానికి ఈ పండుగలు ఎంతగానో ఉపయోగపడతాయి. అటువంటి పండుగలలో అతి ముఖ్యమైన పండుగ దీపావళి.
2. ఉత్తర భారతదేశం
ఉత్తరభారతదేశంలోని అనేక ప్రాంతాల్లో దీపావళిని లక్ష్మీ పూజగా, బెంగాలులో కాళీపూజగా భావిస్తారు. వర్తకులు కొత్తగా ఖాతా పుస్తకాలు తెరుస్తారు. ధన, కనక, వస్తు వాహనా లను పూజిస్తారు.
రాజస్తాన్ లో స్త్రీలందరూ ఈ సందర్భంగా తమ బంగారు నగలకు ‘ఖర్’ అనే ఒక రకమైన పదార్థంతో మెరుగు పెట్టుకుని శుభ్రపరచుకుంటారు. ఈ పండుగను వారు రూప్ చౌదాస్ లేక రూపచతుర్దశి అని అంటూరు.
ఇక గుజరాత్లో కొన్ని బ్రాహ్మణ కుటుంబాలలో మొదటి సంతానం కలగాకనే దీపావళి జరుపుకుంటారు.
ఉత్తర భారతదేశంలో ఈ పండుగ ఐదు రోజులు జరుపబడుతుంది.
- ఆశ్వీయుజ బహుళ త్రయోదశి,
- నరక చతుర్దశి,
- బహుళ అమావాస్య (దీపావళి),
- బలిపాడ్యమి,
- యముద్వితీయ.
ఉత్తర భారతదేశంవారు మొదటిరోజు- బహుళ త్రయో దశి నాటి రాత్రి అపమృత్యు నివారణార్థం దీపం వెలిగించి ఇంటి ముంగిట పెడతారు. దీన్ని ‘నిధన’ లేక ‘యమదీపం అని’ అంటూరు.