ధనుర్మాస వ్రత విధానం & నియమాలు | Dhanurmasa Vratham Puja Vidhi & Rules

0
842
Dhanurmasa Vratham Puja Vidhi & Rules
What are the Dhanurmasa Vratham Puja Vidhi & Rules?!

Thiruppavai / Dhanurmasa Vratham Pooja Vidh

1ధనుర్మాస వ్రత విధానం

  • బ్రహ్మ ముహూర్తంలో (ఉ: 3 గంటలకు) మెల్కోని కాలకృత్యాలు, స్నానం చేసి శుబ్రమైన తెల్లని వస్త్రాలని ధరించి శుభకరమైన ఊర్ధ్వతిలకం పెట్టుకొని ఇంట్లో ఉన్న పూజ గదిలోకి వెళ్ళాలి.
  • ఫూజ గదిలో శ్రీ రంగనాధుడు, శ్రీ గోదాదేవి లేదా శ్రీ కృష్ణుడు, శ్రీ గోదాదేవి పటాలను ప్రత్యేక పీఠంపై పెట్టి అలంకరించి వారిని మనస్పూర్తిగా ఆరాధించడం ప్రారంభించాలి.
  • దేవతా చిత్ర పటాలకు అర్ఘ్య, పాద్య, ఆచమనాలు, స్నానం, చందనంలను పూసి పుష్పాలు, తులసీదళాతో దేవతా మూర్తులకు వారి వారి అష్టోత్తర శతనామావళులతో అర్చన చేయాలి.
  • తదుపరి ధూప, దీప, నైవేధ్యాలు (పొంగలి) సమర్పించాలి.
  • “లక్ష్మీచరణలాక్షాంక స్వోచ్చిష్టమాలికా” అనే శ్లోకంతో మంగళనీరాజనం సమర్పించాలి.
  • ధనుర్మాస వ్రత సేవా కాలం చేయాలి అంటే ఆళ్వార్, ఆచార్య ప్రార్ధన, తిరుప్పళ్ళి యొళుచ్చి (శ్రీ రంగనాధ సుప్రభాతం), తిరుప్పావై పాశురాలు మరియు తెలుగు గేయాలను భక్తి శ్రద్దలతో పఠించాలి.
  • మళ్ళి ర్ఘ్య, పాద్య, ఆచమనాలు చేసి ప్రత్యేక ఆరగింపు (దద్దోజనం, పండ్లు, పులిహోర, చెక్కర పొంగలి లేదా భక్ష్యాలు) తినాలి.
  • తాంబూలం సమర్పించిన తర్వాత కర్పూర హారతితో మంగళాశాసన శ్లోకాలు చదవాలి.

ధనుర్మాస వ్రత విధానం (Dhanurmasa Vratham Pooja Vidh) – 2

  • సువర్ణ మంత్ర పుష్పం సమర్పించి చామరం వీస్తూ శాత్తుమురై పాశురాలు & వంగక్కడల్ పాశురాలను రెండు అనుసంధించాలి. ఈ సమయంలోనే “కర్కటే పూర్వ ఫల్గున్యాం, తులసీకాననోద్భవాం! పాండ్యే విశ్వం భరా గోదాం, వందే శ్రీ రంగనాయకీం!!” అనే శ్లోకాన్ని “నీళాతుంగస్తనగిరితటీ” అనే ఆండాళ్ ప్రార్ధన శ్లోకాన్ని విన్నపం చేయాలి. తర్వాత దేవేరులకు నమస్కరించి మంగళకరమైన మీ కోరికలను మనస్పూర్తిగా విన్నవించాలి.
  • ఆండాళ్ తిరునామాలను మొదటి రెండు పాశురాలను మాత్రం అనుసంధించాలి.
  • అందరికి తీర్ధాన్ని, ప్రసాదాలను ఇచ్చే సమయంలో “సర్వదేశదశాకాలే” అనే శ్లోకంతో ప్రారంభమై ఆళ్వారాచార్యుల మంగళాశాసన శ్లోకాలు పఠించాలి.
  • ఆండాళ్ తిరునామాల్లోని 3,4 శ్లోకలు పఠించాలి.
  • తర్వాత శ్రీగోదాచతుఃశ్శ్లోకి అనుసంధించి క్షమాప్రార్ధన శ్లోకం చదవాలి.
  • మంగళం శ్రీరంగమన్నారురాణికిని, ఊంజల్ సేవ మొదలైన పాటలు పాడి దేవతా మూర్తులకు సాష్టాంగం చేసి పూజ గది తలుపులు మూయాలి. ఇదంతా కూడా ఉదయం 6 గంటల లోపే పరిసమాస్తం కావాలి.

ధనుర్మాస వ్రత నియమాలు (Dhanurmasa Vrat Rules)

  • మార్గశిర మాసం మొదలైనప్పటి నుంచి ధనుర్మాసం ప్రారంభం అయ్యే సమయానికి ఈ వ్రత విధానం భాగ అర్ధం చేసుకోని అన్ని ఎర్పాట్లు చేసుకుంటే మంచిది.
  • వ్రతం సంకల్పం అనుకోగానే ముందుగ అన్ని సిద్దం చేసుకుంటూ కుటుంబ సభ్యులకు, బంధు మిత్రులకు, ఇంటి పక్క వాళ్ళకు, భగవత్తోత్తములకు, ఆచార్యులకు, పందితులను ఆహ్వానించండి.
  • శ్రీ గోదాదేవి తిరుప్పావై రెండో పాశురం “వైయత్తువాళ్వీరు గాళ్”లో సూచించిన నియమాలను ఖచ్చితంగా పాటించాల్సిందే. నెయ్యి మరియు పాలు తీసుకోకుండా చేస్తే మంచిది. కాకపోతే పాయసంలో పాలు, పొంగలిలో నెయ్యి ఉపయోగించి చేసిన నైవేద్యాన్ని ప్రసాదంగా తీసుకోవచ్చు. అలాగే అన్ని భోగాలకు, భోగ వస్తువులకు దూరంగా ఉండాలి.
  • విశేషపాశురాల రోజులలో నివేదిత భోగాలను కొద్దిగానే స్వీకరించాలి. వ్రతం జరిగే రోజుల్లో సాత్త్వికాహారాన్ని మితంగా తీసుకోవాలి.
  • సాయంత్రం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించి, ఎక్కడైన తిరుప్పవై ప్రవచనం విని దేవతా మూర్తులకు ఆర్ఘ్య పాద్యాదికాలు సమర్పించి ధూప, దీపం పెట్టి పండ్లు, పాలు ఆరగింపు చేసి మంగళాశాసనం సమర్పించాలి.
  • ఇలా 30 రోజుల వ్రతం పూర్తి చేసి భోగి పండుగ రోజు ఇంట్లోనే శ్రీ గోదా కళ్యాణం నిర్వహించాలి. లేదా ఎక్కడైన శ్రీ గోదా కళ్యాణం జరిగుతుంటే అక్కడికి వెళ్ళి అక్షింతలు, తీర్థ ప్రసదాలు తిసుకుంటే చాలు వ్రతం పరిసమాస్తం అవుతుంది.
  • ధనుర్మాసం ముందు లేద తర్వాత గాని మీకు నచ్చిన వారితో మొదట శ్రీవిల్లి పుత్తూరు తర్వాత శ్రీరంగం ఒకే యాత్రలో భక్తిశ్రద్దలతో దర్శిస్తే ధనుర్మాస వ్రతం పరిసమప్తాం అవుతుంది.
  • గోదా దేవి శ్రీ రంగనాధునితో భోగైకయం పొందిన రోజే భోగి పండుగగా మనం చేసుకుంటున్నాం. భొగం అంటే సుఖం. గోదా దేవి విషయంలో భోగం శారిరకం కాదు. ఆమే శ్రీ రంగాధునిలోనే సశరీరంగా ఐక్యమైంది. జీవాత్మ శర్రీరంతో పాటు పరమాత్మలో ఐక్యం కావడం గోదా దేవి మధుర భక్తిలోని విశిష్టత. ఇమే కళ్యాణం సామాన్యుల కళ్యాణం వంటిది కాదు. కాని లోక శ్రేయస్సు దృష్ట్యా రుక్మిణీ కళ్యాణం వలే “శ్రీ గోదా శ్రీ రంగనాయకుల కళ్యాణం” భోగి పండుగ రోజు నిర్వహించడం సంప్రదాయంగా వచ్చింది. అందుకే దేవతల కళ్యాణం లోక కళ్యాణం కోసమె!!

“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j

Related Stories

జ్యోతిష్యశాస్త్రరీత్యా జీవన క్రాంతి సంక్రాంతి | Spiritual Significance of Makar Sankranti

ధనుర్మాస వైభవం & విశిష్ఠత | Dhanurmasa Glory & Distinction

కలియుగ వైకుంఠం తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఎలా జరుగుతుంది? | How Vaikuntha Ekadashi Celebrate in Tirumala

వైకుంఠ ఏకాదశి కథ, పరమార్ధం & ఆధ్యాత్మిక స్పూర్తి | Vaikunta Ekadashi Stories & Spiritual Inspiration

Vaikunta Ekadasi 2025 Telugu | వైకుంఠ ఏకాదశి తేదీ, పూజా విధానం & ఉపవాస నియమాలు

Vaikunta Ekadasi Significance | వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత & పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి?

Matsya Dwadashi 2025 | మత్స్య ద్వాదశి విశిష్టత, పూజా విధానం & వ్రత కథ

Pradosha Pooja & Vrath 2025 Dates in Telugu | ప్రదోష వ్రతం యొక్క ప్రాముఖ్యత ఏమిటి ? ఎవరిని పూజించాలి ?

Pradosha Kalam In Telugu | ప్రదోష వేళ అంటే ఏమిటి?

Darsha Amavasya 2024 Dates, Significance, Rituals, Puja Vidhi & Vrat Katha | దర్శ అమావాస్య