దశమహా విద్యలు ఎవరు? | Dasha Maha Vidya In Telugu

0
14690
13140628_992945324130178_220387225_n
Dasha Maha Vidya

Dasha Maha Vidya

1. దశమహా విద్యలు

విద్య అంటే సరైన జ్ఞానం.  మన చుట్టూ ఉన్న మాయను పటాపంచలు చేసి సత్యాన్ని చూడగల శక్తినిచ్చేది మహా విద్య. జ్ఞాన స్వరూపిణి అయిన శక్తి ధరించిన పది రూపాలే దశ మహా విద్యలు. తంత్ర శాస్త్రం లో శక్తి ఉపాసనను విద్య అంటారు. తోడల తంత్రం లో దశమహా విద్యల సాధన ఉంటుంది.

అజ్ఞానం పాపానికి కారణమౌతుంది. పాపం దుఃఖానికి కారణం. జ్ఞానం స్వేచ్ఛనిస్తుంది. పరమానందాన్ని కలిగిస్తుంది. అటువంటి జ్ఞానాన్ని అమ్మవారు పది అవతారాలలో ప్రసాదిస్తుంది. ఆ అవతారాలనే దశ మహా విద్యలన్నారు. జ్ఞానానికి పది అవతారాలు ఎందుకు? మహా విద్య పది రూపాలను ఎందుకు సంతరించుకుంది?

మహా విద్య పది అవతారాలు – ఒక్కో అవతారం యొక్క అంతరార్థం

మహావిద్య పది అవతారాలలో  ఒక్కో అవతారం ఒక్కో విధమైన శక్తికి ప్రతీక.

కాళీ తారా మహావిద్యా షోడశీ భువనేశ్వరీ

భైరవీ ఛిన్నమస్తా చ విద్యా ధూమవతీ తథా

భగళా సిద్ధ విద్యాచ మాతంగీ కమలాత్మికా

యథా దశమహా విద్యాః సిద్ధి విద్యా ప్రకీర్తితా ||

  1.  కాళి – బ్రహ్మానికి అసలు రూపం. కాల స్వరూపం కాళిక. కాళిక వాక్కుకు శక్తినిస్తుంది.
  2. తార – తార అభయప్రదాత. ఆమె ఆపదలనుండీ కాపాడుతుంది. మోక్షజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది.
  3. త్రిపుర సుందరి/ షోడశి– ఈమెను తాంత్రిక పార్వతి అంటారు. అమ్మ త్రిభువన సౌందర్య రాశి.
  4. భువనేశ్వరి – సకల భువనాలకు భువనేశ్వరీ దేవి అధిదేవత. సకల సృష్టి అమ్మ రూపం లో ఇమిడి ఉంటుంది.
  5. భైరవి– దుష్టులను శిక్షించి, సజ్జనులను రక్షించడం భైరవి లక్షణం. దుష్టులు అంటే మనలోని దుష్టమైన ఆలోచనలను నశింపజేసి సద్బుద్ధిని కలిగిస్తుంది. చెడుతో పోరాడే శక్తినిస్తుంది.
  6. ఛిన్న మస్త– ఛిన్న అంటే తెగిన అని అర్థం. మస్త అంటే మస్తకం. ఈమె తన తలను తానే ఖండించుకుని మొండెం నుండీ చిందుతున్న రక్తాన్ని ఖండించబడ్డ శిరసుతో తాగుతూ కనిపిస్తుంది. శరీరం తో ముడిపడ్డ మోహాన్ని, అహాన్ని ఖండించి ఆత్మ జ్ఞానాన్ని అందించడమే ఛిన్నమస్త రూపం లోని ఆంతర్యం.
  7. ధూమవతి – ఈమె వైధవ్యం లో ఉన్న వృద్ధ స్త్రీ రూపం లో ఉంటుంది. ఈమెను మృత్యుదేవత అని కూడా అంటారు.
  8. భగళా ముఖి – భగళాముఖి శత్రువులను నిర్వీర్యం చేసే శక్తినిస్తుంది.
  9. మాతంగి– అమ్మ శ్యామల రూపంతో మరకత మణివలే ప్రకాశిస్తుంది. అందుకే శ్యామలా దేవి అంటారు. నీల సరస్వతి అని అమ్మకు పేరు. ఈమె సకల విద్యా దాత్రి. వనవాసినియై ఉంటుంది.
  10. కమలాత్మిక– ఈమె లక్ష్మీ దేవికి తాంత్రిక రూపం.

దశమహావిద్యలను సామాన్యులు ఆరాధించవచ్చా?

దశ మహావిద్యలను నిరభ్యంతరంగా ఎవరైనా ఆరాధించవచ్చు. అమ్మను కొలవడానికి అందరం అర్హులమే. ఆరాధించ దలచినవారు ముందుగా ఎవరైనా ఉపాసకులను , గురువులను దర్శించి విధి విధానాలను తెలుసుకోవడం మాత్రం తప్పనిసరి. దశమహావిద్యా స్తోత్రాన్ని పఠించడం వల్ల విద్యా, సంపదలు ఆ ఇంట వెల్లివిరుస్తాయి.

 దశ మహావిద్యా స్తోత్రం కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

 

Related Posts

Dhantrayodashi in Telugu | లక్ష్మీ దేవి అనుగ్రహం కోసం ధన త్రయోదశి నాడు ఇలా చేయండి.

Moral Stories | సీతాదేవి హనుమయ్య కి చెప్పిన రహస్యం ఏమిటి? హనుమయ్య కి మాత్రమే ఎందుకు చెప్పింది.

Vishno Devi | త్రికూట కొండలపై కొలువైన దేవి ఆలయ విశేషాలు చూద్దామా?

Items to Keep in the Pooja Room for Lakshmi Devi’s Blessings | లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పూజ గదిలో ఉంచాల్సిన వస్తువులు.

Key Signs of Goddess Lakshmi | మీ ఇంట్లో ఈ సంకేతాలు ఉన్నాయా? అయితే లక్ష్మి దేవి వచ్చినట్టే!

శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకరణ | Navaratri 2024 Fourth Day Alamkaram – Sri Lalita Tripura Sundari

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here