టిక్కెట్ కొనాలి

0
1481

నాగేశ్వర్, తన మిత్రుడు విక్రమ్ తో చెప్పాడు. “ఒరేయ్! ఇంకో మూడు వారాల్లో మన ఏన్యువల్ ఎగ్జామ్స్ మొదలవుతాయి. మనిద్దరం కంబైన్డ్ స్టడీ చేద్దాం. మంచి రేంక్ వస్తే యంబిబిఎస్లో సీట్ రావచ్చు’

విక్రమ్ బదులుగా నవ్వి తల అడ్డంగా ఊపాడు. ‘అది నీలాంటి బీదవాళ్లు చేయాల్సిన పని.”

‘అదేమిటి?’ నాగేశ్వర్ అడిగాడు. ‘నేను ధనవంతుల కుటుంబంలో పుట్టాను. ఊళ్లో అత్యంత ఖరీదైన ఇల్లు మాది. మా నాన్నగారు ఈ ఊరి మేయర్. నాకు ఎంబిబిఎస్లో ఎక్కువ రేంక్ రాకపోయినా సీట్ దొరుకుతుంది’

నాగేశ్వర్ నిరాశ చెంది చెప్పాడు. ‘ఒక్కరి కంటే ఇద్దరం కలిసి చదివితే పాఠాలు బాగా బోధపడతాయని అనుకున్నాను.”

మర్నాడు నాగేశ్వర్, విక్రమ్ ఇంటికి తిరిగి వెళ్లడానికి సిటీ బస్ ఎక్కారు. ఆ రోజు వారి పాఠశాలకి ఆఖరి రోజు. ప్రిపరేషన్ హాలీడేస్ ఇచ్చారు.

కండక్టర్ ప్రతీ వారి పాస్ ని అడిగి ఎక్స్ పైరీ డేట్ ని చెక్ చేస్తున్నాడు.  ‘పాస్’ చెప్పారు మిత్రులు ఇద్దరూ.

“చూపించండి.”

నాగేశ్వర్ చూపించిన పాస్ చెక్ చేసి వెనక్కి ఇచ్చి విక్రమ్ వంక చూశాడు. అతను తన జేబులు, పుస్తకాల సంచీని వెదికాడు. కాని పాస్ కనపడలేదు.

నా పాస్ ఎటో పడిపోయినట్లుంది’ చెప్పాడు విక్రమ్ .

“ఐతే టిక్కెట్ తీసుకో. ఎక్కడికి?’ కండక్టర్ అడిగాడు.

‘నేనెవరో తెలుసా? ఈ ఊరి మేయర్ కొడుకుని’ దర్పంగా చెప్పాడు విక్రమ్.  

‘కావచ్చు. కాని టిక్కెట్ కొనని వారు మేయర్ కొడుకైనా ప్రయోజనం లేదు. టిక్కెట్ కొన్నవారు మేయర్ కొడుకు కాకపోయినా ఇందులో ప్రయాణించవచ్చు’ చెప్పాడు కండక్టర్.

విక్రమ్ టిక్కెట్ కొనక తప్పలేదు. తమ స్టాపులో బస్ దిగి కొంత దూరం నడిచాక చెప్పాడు విక్రమ్.

‘ఈ రాత్రి నించి కంబైన్డ్ స్టడీ చేద్దాం. మా ఇంటికి రా..’

‘మనసు మార్చుకున్నావే?’ అడిగాడు నాగేశ్వర్.

‘నేను మేయర్ కొడుకుని అయినా ఎంసెట్ లో మంచి మార్కులు రాకపోతే ప్రయోజనం ఉండదని అర్థమైంది’ జవాబు చెప్పాడతను.

– కృష్ణమూర్తి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here