
Birth Of Hanuman
1. హనుమాన్ జయంతి
కలౌ కపి వినాయకౌ అంటారు. అంటే కలికాలం లో హనుమంతుడూ వినాయకుడూ సులభసాధ్యులని అర్థం. హనుమంతుడు సకల భయాలనూ దూరం చేసి, బలాన్నీ ధైర్యాన్నీ ప్రసాదిస్తాడు.
శ్రీ రామనామం ఎక్కడైతే వినిపిస్తుందో ఆ చోట హనుమంతుడు బాష్పలోచనుడై ముకుళిత హస్తాలతో ఉంటాడట.
చైత్ర మాసం లో పౌర్ణమినాడు కొన్ని ప్రాంతాలలో హనుమంతుని జయంతిని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా హనుమంతుని జనన వృత్తాంతాన్ని తెలుసుకుందాం.
హనుమంతుని జననం
దేవలోకం లో పుంజికస్థల అనే అప్సరస ఉండేది. ఆమె ఒకనాడు ఆకాశ మార్గం లో విహరిస్తుండగా ఆమెకు వానర రూపం లో ఎవరో కూర్చుని ఉన్నత్త్లు అనిపించింది.
కుతూహలం తోనూ బాల్య చాపల్యం తోనూ పుంజికస్థల ఆ వానరాన్ని రాళ్ళతోనూ, పళ్లతోనూ చెదరగొట్టడానికి ప్రయత్నించింది.
పుంజికస్థల చేష్టలకు ఆ వానరం దిగ్గున లేచింది. తీరా చూస్తే ఆమె రాళ్లువిసిరింది వానర రూపం లో ఉన్న ఒక మహా తపస్విపైన. ఈమె చేష్టలకు ఆయనకు తపోభంగమైంది.
వెంటనే ఆయన క్రోధం తో ‘వానర రూపం లో ఉన్నానని నన్ను హేళన చేశావు కదూ..! నీవు మానవ కాంతవై జన్మిస్తావు, అంతేకాదు నీవు ఎవరినైతే వరిస్తావో అతను వెంటనే వానర రూపం పొందుతాడు.’ అని శపిస్తాడు.
పుంజికస్థల శాప విమోచనం
పుంజికస్థల తన పొరపాటుకు మన్నించమని ఆ తపస్విని వేడుకుంది. తనకు శాప విమోచనం కలిగించమని ప్రార్థించింది.
ఆమె ప్రార్థనకు కరిగిన ఆ తపస్వి ఆమెకు శాప విమోచనం ప్రసాదించాడు. నీ భర్త కామరూపుడై,లోకోత్తర వీరుడై ఉంటాడు. అని అన్నాడు.
ఆమె మునికి కృతజ్ఞత తెలుపుకుని నిష్క్రమించింది. తరువాత ఆమె అంజనా దేవిగా జన్మించి , మహా వీరుడైన కేసరుని వరించి వివాహమాడింది.
హనుమంతుని జననం
అంజనా దేవిగా జన్మించిన పుంజికస్థల మరియు కేసరుడు పరమ శివుని అనుగ్రహం కొరకు దీర్ఘంగా తపస్సు చేశారు. పరమ శివుడు వారి తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమయ్యాడు. ఏమి వరం కావాలో కోరుకోమని అడుగగా వారిద్దరూ ముక్తకంఠం తో ఆ మహాదేవుని తమ పుత్రునిగా జన్మించమని ప్రార్థించారు. పరమ శివుడు అందుకు అంగీకరించి తన అంశతో ఆంజనేయుని వారికి పుత్రునిగా ప్రసాదించాడు. అలా హనుమంతుని జననం జరిగింది.
జై వీర హనుమాన్..!
Related Posts
Hanuman Vijayotsavam | చైత్ర పౌర్ణమి హనుమాన్ జయంతి కాదు… అది విజయోత్సవం!
Hanuman Jayanti 2025 | హనుమాన్ జన్మోత్సవం చరిత్ర, ప్రాముఖ్యత, శుభ ముహూర్తం మరియు పూజ విధి
Betel leaf garland for Hanuman | ఆంజనేయుడికి తమలపాకుల మాల ఎందుకు సమర్పిస్తారు?
Can we read the Hanuman Chalisa at night? | రాత్రి పూట హనుమాన్ చాలీసా చదవచ్చా ?
Hanuman Temple | ఆంజనేయస్వామిని బేడీలతో బంధించే ఆలయం, కారణం ఏమిటి?
Hanuman & Shani Dev | హనుమంతుడికి శనిదేవుడు ఏమని మాట ఇచ్చాడు?