Bathukamma 2024 | తొమ్మిది రోజులు ఎనిమిది నైవేద్యాలు | ఏరోజు ఏం చేస్తారంటే?

0
788
Bathukamma Festival
Know the full details of Bathukamma like story, types and naivedyam

Bathukamma 2024

2తొమ్మిది రోజుల బతుకమ్మ నైవేద్యాలు (Nine Days Bathukamma Naivedyalu)

తొమ్మిది రోజులపాటు ప్రతిరోజూ ఓ రకమైన నైవేద్యం సమర్పిస్తారు. మొదటి ఎనిమిది రోజులు ఈ నైవేద్యం తయారీలో యువతులు పాల్గొంటారు. చివరిరోజును సద్దుల బతుకమ్మ అంటారు. ఈరోజు మాత్రం నైవేద్యాన్ని మహిళలు తయారు చేస్తారు.

  1. ఎంగిలి పూల బతుకమ్మ: మహాలయ అమవాస్యరోజు బతుకమ్మ మొదటిరోజు వేడుక సంబురం మొదలవుతుంది. తెలంగాణలో ఈ రోొజును పెత్రామస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
  2. అటుకుల బతుకమ్మ : ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.
  3. ముద్దపప్పు బతుకమ్మ : ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.
  4. నానే బియ్యం బతుకమ్మ : నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి గౌరీ దేవికి నైవేద్యంచేస్తారు.
  5. అట్ల బతుకమ్మ : అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు.
  6. అలిగిన బతుకమ్మ : ఈరోజు ఆశ్వయుజ పంచమి. నైవేద్యమేమి సమర్పించరు.
  7. వేపకాయల బతుకమ్మ : బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.
  8. వెన్నముద్దల బతుకమ్మ : నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
  9. సద్దుల బతుకమ్మ : ఆశ్వయుజ అష్టమి నాడు ఆదేరోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. ఐదురకాల నైవేద్యాలు తయారు చేస్తారు.

పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ అన్నం, కొబ్బరన్నం, నువ్వులన్నం. తొమ్మిదిరోజులు సమర్పించే నైవేద్యాలలో మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసర్లు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం, పాలు ఉపయోగిస్తారు.

తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో తొలిరోజు బతుకమ్మను ఎంగిలిపువ్వు బతుకమ్మ అని.. చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని పిలుస్తారు.. కొలుస్తారు. ఈ రోజుల్లో ఆడపడుచులు అందరూ అత్తవారింటి నుంచి కన్నవారింటికి చేరుకుని ఈ పూల పండుగ జరుపుకోవటానికి తయారవుతారు. ఈ తొమ్మిది రోజులలో వీరు రోజూ బతుకమ్మలు చేసి, ప్రతీ సాయంత్రం బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆడి పాడుతారు. ఆ తరువాత దగ్గరలో ఉన్న చెరువులో నిమజ్జనం చేస్తారు.

Bathukamma Related Posts

బతుకమ్మ అసలు కథ | ఏ రోజు ఏ బతుకమ్మని పూజించాలి? | Story Behind Bathukamma Festival & 2024 Dates

సద్దుల బతుకమ్మ అనే పేరు ఎందుకు వచ్చింది? కథ, వాయనం, విశిష్ఠత ఏమిటి? | 9th / Last Day Celebration Saddula Bathukamma

వెన్నముద్దల బతుకమ్మ అనే పేరు ఎందుకు వచ్చింది? కథ, వాయనం, విశిష్ఠత ఏమిటి? | 8th Day Vennamuddala Bathukamma

వేపకాయల బతుకమ్మ అనే పేరు ఎందుకు వచ్చింది? కథ, వాయనం, విశిష్ఠత ఏమిటి? | 7th Day Vepakayala Bathukamma

అలిగిన బతుకమ్మ అనే పేరు ఎందుకు వచ్చింది? కథ, వాయనం, విశిష్ఠత ఏమిటి? | 6th Day Aligina Bathukamma

అట్ల బతుకమ్మ అనే పేరు ఎందుకు వచ్చింది? కథ, వాయనం, విశిష్ఠత ఏమిటి? | Fifth Day Atla Bathukamma

నానబియ్యం బతుకమ్మ అనే పేరు ఎందుకు వచ్చింది? కథ, వాయనం, విశిష్ఠత ఏమిటి? | Fourth Day Nanabiyyam Bathukamma

ముద్దపప్పు బతుకమ్మ అని ఎందుకు పిలుస్తారు? కథ, వాయనం, విశిష్ఠత ఏమిటి? | Third Day Muddapappu Bathukamma

అటుకుల బతుకమ్మ అని ఎందుకు పిలుస్తారు? కథ, వాయనం, విశిష్ఠత ఏమిటి? | Second Day Atukula Bathukamma

ఎంగిలి పూల బతుకమ్మ అని ఎందుకు పిలుస్తారు? కథ, వాయనం, విశిష్ఠత ఏమిటి? | First Day Engilipula Bathukamma

విజయవాడ దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి 2024 మహోత్సవాలు | Vijayawada Dasara Navaratri Utsavalu 2024

Next