ఆయుర్వేద పరంగా ముల్లంగి ప్రయోజనాలు | Health Benefits of Radish Related To Ayurvedic

0
10446
download (1)
ఆయుర్వేద పరంగా ముల్లంగి ప్రయోజనాలు | Health Benefits of Radish Related To Ayurvedic

Health Benefits of Radish Related To Ayurvedic

ముల్లంగిలో మేలు చేసే ఔషధ గుణాలెన్నో పుష్కలంగా ఉన్నాయి. దీన్ని మన రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే చక్కని ఆరోగ్యం మీ సొంతమవుతుంది.

. జీర్ణశక్తిని వృద్ధిచేస్తూ శరీరంలో నీరు నిలిచేలా చేస్తుంది. పైల్‌‌స వ్యాధిగ్రస్తులకు ముల్లంగి చక్కని ఔషధమే.

మూ్తప్రిండాలను ఆరోగ్యంగా ఉంచడమే కాదు శరీర బరువును తగ్గించేందుకు ముల్లంగి ఎంతగానో ఉపయోగపడుతుంది.

‘సి విటమిన్‌, ఫోలిక్‌యాసిడ్‌, యాంథోసియానిక్‌లు ముల్లంగిలో ఉన్నందువల్ల తరచూ ఇది తింటే కేన్సర్‌ బారినపడకుండా జాగ్రత్తపడవచ్చు. దీనిలోని సి+విటమిన్‌, ఫాస్పరస్‌, జింక్‌, బి+విటమిన్‌ చర్మానికి ఎంతో మేలు చేస్తాయి.

ముల్లంగి గుజ్జు ముఖానికి మంచి తేజస్సునిస్తుంది. ఇందులోని వ్యాధినిరోధకగుణం చాలా రకాల చర్మవ్యాధులను రాకుండా అడ్డుకుంటుంది.

ముల్లంగి రసంలో నల్ల ఉప్పును కలుపుకుని తాగితే ఇన్ఫెక్షన్లను తీసివేస్తుంది. దాంతో జ్వరం నెమ్మదిస్తుంది. వీటితో పాటు ముల్లంగి ఆకలిని వృద్ధిచేస్తుంది.

అలాగే నోటిశ్వాసను తాజాగా ఉంచుతుంది. రక్తసరఫరాను మెరుగుపరుస్తుంది. కడుపులో మంట, తలనొప్పి, దగ్గుని తగ్గిస్తుంది.

ముల్లంగి రసం : పైల్స్ కు ఒక గ్లాసు ముల్లంగి రసం చాలా అద్భుతంగా చేస్తుంది. ముందుగా 1/4కప్పుతో ప్రారంభించి, రోజు రోజుకూ అరకప్పు రసంను పెంచుకుంటూ పోవాలి

50 ml ముల్లంగి జ్యూస్ (ముల్లంగి రసం ) లో 50 ml మజ్జిగ కలిపి తాగితే మొలల నొప్పి వాపు తగ్గుతుంది .కడుపులో మంటను తగ్గిస్తుంది .

కడుపులోని పుండ్లను తగ్గిస్తుంది . కడుపులో వుండే రోగాలని తగ్గిస్తుంది . మరియు కిడ్నీ లు బాగా పని చేసెట్లు చేస్తుంది ..

ముల్లంగి తినడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండగలం. విరేచనాలకు విరుగుడులా పనిచేస్తుంది. అంతేకాకుండా గాయాలకు మందుగా కూడా ఇది పనిచేస్తుంది.

కాల్షియం, పొటాషియం ఎక్కువగా ఉన్న ముల్లంగి ఆకు వారానికి నెలలో రెండు సార్లు తిన్నా ఎంతో మంచిది.

ముల్లంగి ఆకులని ముక్కలు గా చేసి మిక్సీ లో వేసి రసం తీసి వడపోయాల్లి .. ఈ ముల్లంగీ ఆకు రసాన్ని 50 ml తీసుకొని ..

కాస్త పంచదార వేసుకొని ఉదయం , సాయంత్రం తాగితే మూత్ర నాళం లో వచ్చే ఇన్ఫేక్షేన్స్ ని తగ్గిస్తుంది . కామెర్లు ఉన్నవారు 40 రోజులు తాగితే చాలు ..

కాలేయం పనిచెయ్యనప్పుడు దీనిని తాగితే కాలేయం సక్రమం గా పని చేస్తుంది . రక్తం శుభ్ర పడుతుంది . మూత్రం లో రక్తం కలసి పోతుంతే దీని వాడవొచ్చు

ముల్లంగి గింజలు ని కొద్దిగా వేయించి పొడి చేసి ఒక 5 స్పూన్లు పొడిని తీసుకొని .. నువుల నూనె లో వేసి బాగా కలిపి బాగా కాయాలి .. ఇలా చేసిన తైలాన్ని .. తెల్లమచ్చల , బొల్లి మచ్చల పైన రాస్తే .. తగ్గుతాయి .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here