
Gastric Troubles Remedies
ఈ రోజుల్లో గ్యాస్ ట్రబుల్ సమస్య లేనివారు అతి తక్కువ మంది. దీనికి గల ముఖ్య కారణం మారిన జీవనశైలి విధానమే అని చెప్పవచ్చు. క్షణం తీరిక లేక యంత్రాలతో పరిగెడుతూ వేళకు ఆహారం తీసుకోక, ఒక వేళ అహారం తీసుకున్నా క్షణాలలో హడావిడిగా ముగించటం, దీనితో పాటుగా తీవ్ర మానసిక ఒత్తిడి, రాత్రి సరిగా నిద్రపట్టక పోవడం, ఆలోచనలతో మనసు నిలకడ లేకుండా పరిగెత్తడం, కారణం లేకుండానే కోపం రావటం వంటి మానసిక సమస్యలతో బాటు సరైన అహారం తీసుకోక పోవటంతో ఈ సమస్య తీవ్రరూపం దాల్చి అందరిని వేధిస్తోంది.
4. జాగ్రత్తలు:
- మసాలలు, వేపుళ్లు, ఆయిల్ఫుడ్స్, ఫాస్ట్పుడ్స్, ఆల్కహాల్, స్మోకింగ్ మానివేయాలి.
- వేళకు ఆహారం తీసుకుంటూ నీళ్ళు సరిపడినంతగా త్రాగాలి.
- నిల్వఉంచిన పచ్చళ్ళు తినడం మానివేయాలి.
- ముఖ్యంగా మానసిక ఒత్తిడిని నివారించటానికి ధ్యానం, యోగా నిత్యం చేయాలి.
- ప్రతి రోజు విధిగా వ్యాయామం చేయాలి.
- పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న తాజా వెజిటెబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి.
- టీ, కాఫీలు మానివేయాలి.
Promoted Content