What Should We Donate on Akshaya Tritiya
అక్షయ తృతీయ నాడు ఏ దానం చేస్తే ఎటువంటి ఫలితాలు లభిస్తాయి?
Donation Types on Akshaya Triteeya
శయన దానము
అక్షయ తృతీయ నాడు చాపను లేదా మంచాలను కానీ పరుపులను కానీ దుప్పట్లను కానీ దానం చేయడం వల్ల ఆ ఇంటిలోనివారికి పీడకలలు రావడం తగ్గుతుంది. అన్యోన్య దాంపత్యం కోసం కూడా శయన దానం చేస్తారు.
వస్త్ర దానము
వస్త్రదానం వలన దాత(దానం చేసినవారు) ప్రకృతి సంబంధమైన ప్రమాదాల నుండీ కాపాడబడతాడు.
కుంకుమ దానము
అక్షయ తృతీయనాడు కుంకుమ దానం చేయడం వలన ఆ ఇల్లాలి సౌభాగ్యం అక్షయమై వెలుగొందుతుంది.
చందన దానము
అక్షయతృతీయనాడు చందన దానము చేయడం వలన కీర్తి లభిస్తుంది.
తాంబూలము
తమలపాకులను దానం చేయడం వలన ఉద్యోగాలలో పదోన్నతులు, వ్యాపారలాభాలు, రాజకీయనాయకులకు ఉన్నతపదవులూ సంప్రాప్తిస్తాయి.
నారికేళ దానము
అక్షయ తృతీయనాడు కొబ్బరికాయను దానం చేయడం వలన వంశాభివృద్ధి కలుగుతుంది.
తక్ర దానము
తక్రము అంటే మజ్జిగ. అక్షయ తృతీయనాడు దాహార్తులకు మజ్జిగను దానం చేయడం వలన ఉన్నత విద్యాప్రాప్తి కలుగుతుంది. అన్ని రంగాలలోనూ రాణిస్తారు.
ఉద కుంభ దానము
అక్షయ తృతీయ రోజు చేయవలసిన దానాలలో ఉదకుంభ దానము ఎంతో విశిష్టమైనది. రాగి లేదా వెండి కలశం లో కుంకుమపువ్వు, కర్పూరం. తులసి, వక్క కలిపిన నీటిని దానం చేయడం వలన వివాహం కాని వారికి శీఘ్రవివాహం, పిల్లలు లేనివారికి పుత్ర ప్రాప్తి కలుగుతాయి.
పాద రక్షా దానము
అక్షయ తృతీయనాడు పాద రక్షలు(చెప్పులు) దానం చేయడం వలన నరకబాధలు తొలగుతాయి.
Akshaya Tritiya 2025 Date & Muhurat
అక్షయ తృతీయ, బుధవారం, ఏప్రిల్ 30, 2025
అక్షయ తృతీయ పూజ ముహూర్తం – 05:51 నుండి 12:13 వరకు
వ్యవధి – 06 గంటలు 23 నిమిషాలు
తృతీయ తిథి ప్రారంభం – ఏప్రిల్ 29, 2025న 17:31
తృతీయ తిథి ముగుస్తుంది – ఏప్రిల్ 30, 2025న 14:12
ఇతర నగరాల్లో అక్షయ తృతీయ ముహూర్తం
06:08 నుండి 12:32 వరకు – పూణే
05:41 నుండి 12:18 వరకు – న్యూఢిల్లీ
05:49 నుండి 12:06 వరకు – చెన్నై
05:49 నుండి 12:24 వరకు – జైపూర్
05:51 నుండి 12:13 వరకు – హైదరాబాద్
05:42 నుండి 12:19 వరకు – గుర్గావ్
05:40 నుండి 12:20 వరకు – చండీగఢ్
05:05 నుండి 11:34 వరకు – కోల్‌కతా
06:11 నుండి 12:36 వరకు – ముంబై
05:59 నుండి 12:17 వరకు – బెంగళూరు
06:07 నుండి 12:37 వరకు – అహ్మదాబాద్
05:41 నుండి 12:18 వరకు – నోయిడా
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
Related Posts