పెళ్లి సంప్రదాయంలో “గరికె ముంత” ఎందుకు వాడతారు ? | Garike munta Usage in Telugu

0
9262
at-wedding-tradition-why-pot-is-used
పెళ్లి సంప్రదాయంలో “గరికె ముంత” ఎందుకు వాడతారు ? | Garike munta Usage in Telugu

పెళ్లి సంప్రదాయంలో “గరికె ముంత” ఎందుకు వాడతారు ? | Garike munta Usage in Telugu

ఆంధ్ర దేశంలోనూ, రాయలసీమ లోనూ, తెలంగాణాలోనూ, కర్నాటక లోనూ కరగ అనే పేరుతోనూ తమిళంలో కరగం అనే పేరు తోనూ, ఆంధ్ర ప్రాంతంలో గరికె, గరిక, గరిగ, గరిగె అనే పేర్లు తోనూ ప్రచారంలో వుంది.

ఈ గరిగలను సేవించడం ద్వారా అమ్మవారిని సేవించినట్లే భావించవచ్చు. గరిక అంటే కుండ అని అర్థం. ద్రౌపది తన వివాహ సమయంలో అనందావేశంతో ప్రక్క నున్న కలశాన్ని నెత్తిన పెట్టుకుని చిందులు వేసిందనీ, ఆ విధంగా అది పవిత్రతను పొందిందనీ అంటారు. ఈ నాటికీ వివాహ సమయంలో అన్ని ప్రాంతాలలోనూ గరికె ముంత, గరిగె బుడ్డి (అలంకరించిన) ముంత, పెండ్లి సమయాలలో కుమ్మరి వారు అలివేణి కుండలతో పాటు ఈ గరిగె ముంతను కూడ అందంగా రంగులతో చిత్రిస్తారు. దీనిని ఎంతో పవిత్రంగా చూస్తారు. గరికె ముంత లేకుండా వివాహం జరపరు. ఆ ముంతతో పూజా విధాన ముగింపుతో దానిని తాకించి, మంత్రాలు చదువుతారు.

ఈ గరిక ముంతను పెండ్లికి ముందు రోజే కుమ్మరి ఇంటినుండి మేళ తాళాలతో వెళ్ళి కుమ్మరివారికి కానుకలు చెల్లించి ఇంటికి తెచ్చి ఒక గదిలో వుంచి దీపారాధన చేసి పూజిస్తారు. ముందుగా ఈ గరిగెలను పూజించటం గౌరి పూజగా భావిస్తారు. అంటే పెండ్లిండ్లలో గరిగె గౌరీమాతకు ప్రతీకగా పూజ నందుకుంటుంది. వివాహ సమయంలో గరిగెను దంపతుల ముందుంచి మరల పూజచేసి, వివాహాన్ని పూర్తి చేస్తారు. వివాహం జరిగినంత సేపూ గరిగె ముంత ఎంతో ప్రాముఖ్యం వహిస్తుంది. వధువు అత్తగారింటికి వెళ్ళే ముందు ఈ గరిగను వధువుతో పంపించి పెండ్లి తరువాత కూడ దానిని పవిత్రంగా చూస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here